ఆ పదవి మహిళకేనా.. జగన్ వ్యూహం ఇదే..!
అధికార పార్టీ వైసీపీలో రాజకీయం మారుతోంది. పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో పార్టీ అధినేత, సీఎం జగన్ ప్రభుత్వాన్ని ప్రక్షాళన చేస్తున్నారు. మంత్రులను మారుస్తున్నారనే [more]
;
అధికార పార్టీ వైసీపీలో రాజకీయం మారుతోంది. పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో పార్టీ అధినేత, సీఎం జగన్ ప్రభుత్వాన్ని ప్రక్షాళన చేస్తున్నారు. మంత్రులను మారుస్తున్నారనే [more]
అధికార పార్టీ వైసీపీలో రాజకీయం మారుతోంది. పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో పార్టీ అధినేత, సీఎం జగన్ ప్రభుత్వాన్ని ప్రక్షాళన చేస్తున్నారు. మంత్రులను మారుస్తున్నారనే విషయం తెలిసిందే. తాను చెప్పిన మేరకు ఆయన మంత్రులను మారుస్తారని తెలుస్తోంది. అయితే ఇది జగన్ ముందు నుంచి చెపుతున్నట్టుగా 90 శాతం కాకపోయినా 70 శాతం వరకు అయినా మార్పు ఉండవచ్చని అంటున్నారు. అయితే.. ఈ క్రమంలో.. ప్రస్తుతం స్పీకర్‌గా ఉన్న సీనియర్ పొలిటీషియన్.. మాజీ మంత్రి, తమ్మినేని సీతారాంను కేబినెట్‌లోకి తీసుకునే ఛాన్స్ 100 శాతం కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఈ క్రమంలో ఆయనను మంత్రిగా తీసుకుంటే.. మరి స్పీకర్ పదవిని ఎవరికి ఇస్తారు? అనే ఊహాగానాలు సహజం.
మహిళలకేనట….
ఈ క్రమంలో జగన్ ఈ పదవిని మహిళలకు కేటాయించే అవకాశం కనిపిస్తొందని అంటున్నారు పరిశీలకులు. గతంలో చంద్రబాబు ఒకసారి.. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రతిభా భారతికి అవకాశం ఇచ్చారు. అయితే.. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పదవి ని మహిళలకు కేటాయించలేదు. పైగా ఇది రాజ్యాంగ బద్ధమైన పదవి కావడంతో.. దీనిని ఇప్పుడు మహిళలను కేటాయించడం ద్వారా.. జగన్ మహిళల విషయంలో ఎంత సానుకూలంగా ఉన్నారనే విషయాన్ని.. పార్టీ ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. నిజానికి ఇప్పటి వరకు జరిగిన నియామకాల్లో.. స్థానిక సంస్థల పదవుల్లోనూ జగన్ మహిళలకు పెద్దపీట వేశారు.
ఈ ఇద్దరేనట…
మరీ ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనార్టీ మహిళలకు అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలోనే ఇప్పుడు .. స్పీకర్ పదవిని కూడా మహిళలకు కేటాయిస్తారని ఆ పార్టీ కీలక నేతల మధ్యే చర్చకు వస్తోంది. దీనికి ప్రధానంగా ఇద్దరిని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన విద్యావంతురాలు.. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న జొన్నలగడ్డ పద్మావతి పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ.. ఉత్తరాంధ్ర ప్రాంతానికే తిరిగి ఇవ్వాలని అనుకుంటే.. పాలకొండ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి పేరును పరిశీలించే అవకాశం ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు.
రెండున్నరేళ్లు….
అయితే.. ఈ దఫా రెండున్నరేళ్లపాటు.. ఈ పదవిని సీమకు కేటాయిస్తారని.. ఇక్కడ పెల్లుబుకుతున్న అసంతృప్తిని తగ్గిస్తారని .. మరో ప్రచారం జరుగుతోంది. సో.. ఎలా చూసుకున్నా.. మహిళకు. అందునా.. ఎస్సీ సామాజిక వర్గానికి ఈదఫా స్పీకర్ పదవిని రిజర్వ్ చేయడం జరిగిపోయిందనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం. ఇదే జరిగితే.. జగన్ మరో సంచలన రికార్డును స్థాపించినట్టే అంటున్నారు పరిశీలకులు. పైగా జగన్ ఎస్సీలు, అందునా ఆ వర్గంలో మహిళలకు హోం మంత్రి, స్పీకర్ లాంటి పదవులు ఇచ్చారని.. వాళ్లలో మరింత పాతకు పోవడమే టార్గెట్‌గా ఉంది.