వాటినే నమ్ముకున్న జగన్.. జనాలు జై కొడతారా?
వచ్చే ఎన్నికల్లో భారీ విజయం సాధించాలనేది వైసీపీ అధినేత జగన్ వ్యూహం. గత 2019 ఎన్నికల్లో వచ్చిన 151 సీట్లకు మించి.. ఘన విజయం సాధించాలనేది సీఎం [more]
;
వచ్చే ఎన్నికల్లో భారీ విజయం సాధించాలనేది వైసీపీ అధినేత జగన్ వ్యూహం. గత 2019 ఎన్నికల్లో వచ్చిన 151 సీట్లకు మించి.. ఘన విజయం సాధించాలనేది సీఎం [more]
వచ్చే ఎన్నికల్లో భారీ విజయం సాధించాలనేది వైసీపీ అధినేత జగన్ వ్యూహం. గత 2019 ఎన్నికల్లో వచ్చిన 151 సీట్లకు మించి.. ఘన విజయం సాధించాలనేది సీఎం ఆలోచనగా ఉన్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రతి అసెంబ్లీ సమావేశంలోనూ వైసీపీ నేతలుచెబుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీకి ఇప్పుడు వచ్చిన 23 స్థానాలు కూడా దక్కవని. అయితే.. రెండు లేకపోతే.. 3 స్థానాలకు మాత్రమే పరిమితం చేస్తామని.. ప్రజలు మొత్తం తమవైపే ఉన్నారని.. పదే పదే ప్రకటిస్తున్నా రు. అయితే.. ఈ వ్యూహం నిజంగానే అమలవుతుందా? వైసీపీ కోరుకున్నట్టు జరుగుతుందా ? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
సంక్షేమాన్ని నమ్ముకుని….
ఎందుకంటే ప్రభుత్వం నమ్ముకున్నది సంక్షేమం మాత్రమే. ప్రజలకు నేరుగా డబ్బులు అందించడం ద్వారా.. లబ్ధి పొందాలనేది వైసీపీ అధినేత జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీ సర్కారు.. వైస్సార్ పేరుతోను.. జగన్ పేరుతోనూ.. నేరుగా ప్రజలకు డబ్బులు ఇచ్చే పథకాలను అమలు చేస్తున్నా రు. అయితే.. ఈ సంక్షేమం వైసీపీని గట్టెక్కించడం అంత ఈజీకాదని చెబుతున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. గతంలోనూ ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, తర్వాత..నవ్యాంధ్ర తొలి ముఖ్యమం త్రిగా.. చంద్రబాబు కూడా అనేక పథకాలు అమలు చేశారు.
గతంలోనూ…..
వైఎస్ హయాంలో పింఛన్లను పెంచారు. అదే సమయంలో పలు పథకాలను కూడా అమలు చేశారు. ఇక, చంద్రబాబు హయాం తీసుకుంటే.. వైఎస్‌ను మించి అన్నట్టుగా ఆయన పథకాలను తీసుకువచ్చారు. సామాజిక వర్గాల వారీగా, మతాల వారీగా కూడా ఆయన పథకాలను తీసుకువచ్చారు. క్రిస్మస్, రంజాన్ కానుకలు కూడాఅందించారు. ఇక, ఎన్నికలకు ముందు.. పసుపు-కుంకుమ పేరుతో అర్హులైన మహిళలకు రూ.10 వేల చొప్పున లబ్ధి చేకూర్చారు. డ్వాక్రా గ్రూపులకు రూ.లక్షల మొత్తం అందించారు. ఇవన్నీ అందరికీ తెలిసినవే. ఇవి కాకుండా.. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా చంద్రబాబు కోన్ని కోట్ల రూపాయలను బాధితులకు అందించారు.
ఇందుకు భిన్నంగా….
అయినప్పటికీ.. వైఎస్ హయాంను తీసుకుంటే.. 2004లో ఉన్న ప్రభంజనం.. 2009 నాటికి లేకుండా పోయింది. ఆ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు మళ్లించే క్రమంలో వైఎస్ సక్సెస్ అయ్యారు కాబట్టి.. ఆయన స్వల్ప మెజారిటీతోనే రెండోసారి విజయం దక్కించుకున్నారు. ఇక, చంద్రబాబు విషయానికి వస్తే.. ఆయన పరిస్థితి దారుణంగా మారింది. ఎన్ని పథకాలు, సంక్షేమాన్ని అమలు చేసినా.. బాబు విజయం దక్కించుకోలేక పోయారు. ఇక, ఇప్పుడు జగన్ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంటుందని అనుకోలేమని అంటున్నారు పరిశీలకులు.
అభివృద్ధి లేకపోవడంతో….
ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంతోపాటు.. ముఖ్యంగా నిరుద్యోగులకు ఉపాధి చూపించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఈ విషయాన్ని పక్కన పెట్టడం.. సరికాదని.. సంక్షేమాన్ని నమ్ముకుంటే.. ఎన్నికల సమయానికి ప్రజల మూడ్ మారిపోయే పరిస్థితి ఉంటుంది. ఇక ఏపీలో అభివృద్ధి అన్న మాటే లేదు. సో.. ఇప్పటికైనా.. జగన్ నేల విడిచి సాము చేయకుండా.. జగన్ గతాన్ని గుర్తు పెట్టుకుని వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.