చివరకు చిరిగి చేటయ్యేది జగన్ కేనా?

రాజకీయాలల్లో రాళ్ళు ఎటు నుంచి దూసుకువస్తాయో ఎవరికీ తెలియదు. అలా వచ్చినవి అటూ ఇటూ తగిలి ఊరుకుంటాయి అనుకుంటే పొరపాటే. చివరికి అవి నేరుగా అధినాయకుడికే తగులుతాయి. [more]

Update: 2021-08-21 14:30 GMT

రాజకీయాలల్లో రాళ్ళు ఎటు నుంచి దూసుకువస్తాయో ఎవరికీ తెలియదు. అలా వచ్చినవి అటూ ఇటూ తగిలి ఊరుకుంటాయి అనుకుంటే పొరపాటే. చివరికి అవి నేరుగా అధినాయకుడికే తగులుతాయి. దాని వల్ల అతి పెద్ద డేంజర్ కూడా పార్టీకి జరుగుతుంది. మరి ఈ విషయం గ్రహించారో లేదో కానీ వైసీపీ నేతల ఆడియో లీకుల మీద జగన్ పెద్దగా సీరియస్ గా ఉన్నట్లుగా లేదు. ఏపీలో ఇపుడు కొత్త రకం రాజకీయం సాగుతోంది. వైసీపీ సర్కార్ ఫెయిల్యూర్స్ అని ఒక వైపు చర్చకు పెడుతున్న విపక్షాల నాయకులు వాటితో పాటుగా రాసలీలల ఆడియో లీకులను కూడా వాడుకుంటూ ఏకంగా రాష్ట్రంలో మహిళా భద్రతనే ప్రశ్నిస్తున్నారు.

వరసబెట్టి….

ఒకటి జరిగితే పొరపాటు అనుకోవచ్చు. కానీ అదే అలవాటుగా మారితే మాత్రం ఇక ఉపేక్షించి లాభం లేదు. నిజానికి గత ఏడాది థర్టీ యియర్స్ ఇండస్ట్రీ పృధ్వీ విషయంలో ఇలా జరిగినపుడే జగన్ పూర్తి స్థాయి దర్యాప్తు జరిపించాల్సింది. కానీ ఆయన్ని పక్కన పెట్టేశారు. తరువాత సీనియర్ ఎమ్మెల్యే అంబటి రాంబాబు బుక్ అయ్యారు. ఇపుడు విశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పేరు బయటకు వచ్చింది. దాంతో ఇది జగన్ సర్కార్ ప్రతిష్టకే మచ్చగా మారుతోంది. దాంతో ప్రభుత్వం దీని మీద గట్టిగానే రియాక్ట్ అవాలన్న మాట అయితే వినిపిస్తోంది.

అచేతనంగా ఉంటే…?

వైసీపీ సర్కార్ కి, పార్టీకి జగనే నాయకుడు. అందువల్ల వైసీపీలో ఏ ఘటన జరిగినా చుట్టుకునేది మాత్రం జగన్ కే అన్నది తెలిసిందే. ఆయన అయితే పూర్తి సైలెంట్ గా ఉంటారు. ఆయనకు తన మనుషుల మీద నమ్మకం ఉండవచ్చు కాక. కానీ దీన్ని ఆసరాగా చేసుకుని విపక్షాలు సోషల్ మీడియాలో ఒక్క లెక్కన ఆట ఆడేసుకుంటున్నాయి. దాని వల్ల బురద వచ్చి మొత్తం వైసీపీ మీదనే పడుతోంది మరి జగన్ యాక్షన్ అన్నది ఏదైనా తీసుకోకపోతే ఇంకా చాలా ఆడియో లీకులు బయటకు వస్తాయని కూడా అనుమానిస్తున్నారు.

జనంలోకి వెళ్తే …

ఇక జనాలు సాధారణంగా సున్నితమైన విషయాల్లో గట్టిగానే ఉంటారు. రాజకీయాలు వేరు, ఇలాంటివి వేరు. నేతల అవినీతి ఆరోపణలు ఎన్ని వచ్చినా ప్రజలు పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే ఎవరు మాత్రం పతిత్తులు అన్నది జనం భావన. కానీ మహిళలతో వైసీపీ నేతల రాసలీలలు అంటూ వస్తున్న ఆడియోలు లీకుల ప్రచారం అయితే మాత్రం అది పార్టీకే పెద్ద దెబ్బగా మారుతుంది. మరో వైపు దిశ చట్టం మహిళా భద్రత గురించి గొప్పగా చెప్పుకుంటున్న వైసీపీకి ఈ పరిణామాలు అసలు మింగుడు పడకపోవచ్చు. సొంత పార్టీ వారే ఇలా చేస్తున్నారా అన్న డౌట్లు జనాల్లోకి వెళ్తే ఏం చెప్పినా బూమరాంగ్ అవుతుంది. అందువల్ల ఈ ఆడియో లీకుల వెనక ఎవరు ఉన్నారు లెక్క తేల్చి బాధ్యుల మీద సీరియస్ గా యాక్షన్ తీసుకోవాల్సిన కర్తవ్యం జగన్ మీదనే ఉంది అంటున్నారు. ఆయన కనుక ఉపేక్షిస్తే మాత్రం చిరిగి చేట అయ్యేది చివరికి జగన్ ఇమేజే సుమా.

Tags:    

Similar News