`మూడు` ముహూర్తానికి ఆర్థిక కష్టాలే కారణమా.. ?
ఏపీ అధికార పార్టీ వైసీపీలో గడిచిన కొద్ది రోజులుగా ఆసక్తికర విషయంపై చర్చసాగుతోంది. పార్టీ అధినేత, సీఎం జగన్ ప్రతిష్టాత్మ కంగా తీసుకున్న మూడు రాజధానుల విషయంపైనే [more]
;
ఏపీ అధికార పార్టీ వైసీపీలో గడిచిన కొద్ది రోజులుగా ఆసక్తికర విషయంపై చర్చసాగుతోంది. పార్టీ అధినేత, సీఎం జగన్ ప్రతిష్టాత్మ కంగా తీసుకున్న మూడు రాజధానుల విషయంపైనే [more]
ఏపీ అధికార పార్టీ వైసీపీలో గడిచిన కొద్ది రోజులుగా ఆసక్తికర విషయంపై చర్చసాగుతోంది. పార్టీ అధినేత, సీఎం జగన్ ప్రతిష్టాత్మ కంగా తీసుకున్న మూడు రాజధానుల విషయంపైనే నాయకులు గుసగుసలాడడం గమనార్హం. దీనికి కారణం.. సీఎంగా జగన్ ఎక్కడ ఏ వేదికపై మాట్లాడినా.. వెంటనే మూడు రాజధానుల ప్రస్తావన తెస్తున్నారు. అమరావతి ఓ వర్గానికే పరిమితమైన రాజధాని అని.. రాష్ట్ర సర్వతోముఖాభివృద్దికి.. మూడు రాజధానులు అయితేనే.. బెటర్ అని ఆయన చెబుతున్నారు. దీనిని అసెంబ్లీ నుంచి ప్రతి గల్లీకి ప్రచారం చేస్తున్నారు కూడా. ఇక, మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో హైకోర్టు హెచ్చరిస్తున్నా.. అధికార పార్టీ దూకుడు మాత్రం తగ్గలేదు.
పక్కన పెట్టారా?
ఈ క్రమంలోనే.. విశాఖలో భూముల కొనుగోలు.. అధికార కార్యకలాపాల కోసం.. ఏర్పాట్లు.. వంటివి అందరికీ తెలిసిందే. అదే సమయంలో కర్నూలులో హైకోర్టు ఏర్పాటు కూడా జగన్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.. కేంద్రానికి ఇటీవల కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. బీజేపీ కూడా కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు హామీ ఇచ్చింది కాబట్టి.. దీనిని ఏర్పాటు చేయాలని.. జగన్ సైతం డిమాండ్ చేస్తున్నారు. ఇక అమరావతిని శాసన రాజధానిగా ఉంచే ప్రక్రియలో భాగంగా కొన్ని మౌలిక సదుపాయాల ఏర్పాటును ప్రారంభించారు. అంటే.. ఇంత జోరుగా మూడు రాజధానుల విషయం.. చర్చకు వస్తోంది. అయితే.. ఇప్పుడు ఆకస్మికంగా.. దీనిని పక్క పెట్టడం చర్చనీయాంశంగా మారింది.
ఆ స్పీచ్ లోనూ….?
రెండు రోజుల కిందట వరకు మూడు జపం చేసిన.. జగన్.. అకస్మాత్తుగా.. పంద్రాగస్టు వేడుకల్లో మాత్రం అసలు మూడు రాజధానుల విషయాన్ని ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం. నిజానికి ఆయన ఏ వేదిక ఎక్కినా.. మూడు గురించి ప్రస్తావన ఉంటుంది. కానీ.. ఈ దఫామాత్రం కనిపించలేదు. దీనిపై వైసీపీలోనే చర్చసాగుతోంది. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టిన నేపథ్యంలోనే జగన్ ఈ ప్రస్తావనను పక్కన పెట్టారని అంటున్నారు.
అందుకే పిలిచారా?
మరోవైపు కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు కూడా కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం లేకపోవడం.. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండడం వంటి పరిణామాల క్రమంలో.. మూడుకు ఇప్పట్లో మోక్షం లేనట్టేనని అంటున్నారు వైసీపీ నాయకులు. అందుకే అమరావతిలో హైకోర్టు భవన నిర్మాణానికి టెండర్లు పిలిచారంటున్నారు. మరో రెండున్నరేళ్లలోనే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ విషయాన్ని ఎంత త్వరగా మరుగున పడేస్తే.. అంతమంచిదనే భవన.. ఇటు జగన్ లోనూ, అటు పార్టీ నేతల్లోనూ వ్యక్తం అవుతుండడం గమనార్హం.