ys jagan : జగన్ చూసీ చూడనట్లు వదిలేస్తున్నారా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పాలన రెండున్నరేళ్లు పూర్తయింది. అవినీతిని తాను సహించేది లేదని జగన్ ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో చెప్పారు. అవినీతిని ప్రోత్సహించే వారు సయితం [more]
;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పాలన రెండున్నరేళ్లు పూర్తయింది. అవినీతిని తాను సహించేది లేదని జగన్ ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో చెప్పారు. అవినీతిని ప్రోత్సహించే వారు సయితం [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పాలన రెండున్నరేళ్లు పూర్తయింది. అవినీతిని తాను సహించేది లేదని జగన్ ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో చెప్పారు. అవినీతిని ప్రోత్సహించే వారు సయితం తన కేబినెట్ లో ఉండరని చెప్పారు. అయినా మంత్రుల మీద ఆరోపణలు వచ్చినా ముఖ్యమంత్రి జగన్ ఇప్పటి వరకూ ఒక్కరిపైన కూడా చర్యలు తీసుకోలేదు. వారిపై వచ్చిన ఆరోపణల విషయంలో వివరణ అడిగి వదిలేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
ఆరోపణలొచ్చినా….
ఈఎస్ఐ స్కామ్ లో టీడీపీ నేత అచ్చెన్నాయుడును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అయితే ఇదే విషయంలో మంత్రి గుమ్మనూరి జయరాంపై ఆరోపణలు వచ్చాయి. నిందితుల నుంచి ఖరీదైన కారును గిఫ్ట్ గా పొందారన్న ఆరోపణలు టీడీపీ నేతలు చేశారు. ఇందుకు తగ్గ ఫొటోలను కూడా బయటపెట్టారు. సీఐడీ అధికారులకు కూడా మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఫిర్యాదు చేశారు.
వివరణతో సరి…
కానీ సీఐడీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. జగన్ కూడా ఈ ఆరోపణపై వివరణ అడిగి గుమ్మనూరి జయరాంను వదిలేశారు. అదే మంత్రి కుటుంబ సభ్యులు తన ఇలాకాలో పేకాట క్లబ్ లు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పోలీసులు కూడా దాడి చేశారు. అయినా మంత్రి పైన చర్యలు లేవు. ఇక ఇటీవల గుమ్మనూరి జయరాం ఎస్ఐతో మాట్లాడిన ఫోన్ కాల్ వైరల్ అయింది.
సొంత పార్టీలోనే చర్చ….
ఇసుక లారీలను వదిలేయాని మంత్రి చేసిన కామెంట్స్ పార్టీని ఇబ్బందుల్లో నెట్టాయి. అయితే వెంటనే మంత్రిని పిలిపించుకుని జగన్ వివరణ అడిగారు. కానీ చర్యలు తీసుకోలేదు. పార్టీని ఇబ్బంది పెడుతున్న వారిని జగన్ ఎందుకు ఉపేక్షిస్తున్నారన్న చర్చ పార్టీలోనే జరుగుతుంది. మంత్రి పదవి నుంచి తొలగించి జగన్ విమర్శలకు చెక్ పెట్టే ఛాన్స్ ఉన్నా ఎందుకు తీసుకోవడం లేదన్న ప్రశ్న పార్టీ నేతల నుంచే విన్పిస్తుండటం విశేషం.