జగన్ రిస్క్ లో పడ్డట్లేనా?

మూడు రాజధానుల విషయంలో జగన్ ఎంత పట్టుదలగా ఉన్నారో అందరికీ తెలిసిందే. ఈ విషయంలో ఆయన ఎవరికీ ఖాతర్ చేయడంలేదు. తాను అనుకున్నట్లుగా ముందుకుసాగుతున్నారు. తన ఆలోచలను [more]

;

Update: 2020-02-08 13:30 GMT

మూడు రాజధానుల విషయంలో జగన్ ఎంత పట్టుదలగా ఉన్నారో అందరికీ తెలిసిందే. ఈ విషయంలో ఆయన ఎవరికీ ఖాతర్ చేయడంలేదు. తాను అనుకున్నట్లుగా ముందుకుసాగుతున్నారు. తన ఆలోచలను భావి తరాలకు మేలు చేస్తాయని జగన్ నమ్ముతున్నారు. నిజంగా జగన్ చెబుతున్న దాంట్లో అంతా ఏకీభవించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అమరావతి అన్నది అర్ధ శతాబ్దం ప్రాజెక్ట్. ఇప్పటికిపుడు తిండి పెట్టదు, అందువల్ల రెడీ మేడ్ నగరమైన విశాఖను జగన్ ఎంచుకున్నారు. విశాఖను తొందరగా అభివృధ్ధి చేసుకుంటే ఫలితాలు కూడా త్వరగా వస్తాయని జగన్ ఆలోచంగా ఉంది. అయితే ఇక్కడే జగన్ రిస్క్ చేసి మరీ ఒంటరి పోరాటం చేస్తున్నారు.

అలా అయితే ఒకే…..

విశాఖ రాజధాని అన్నది పాత నినాదం. అయితే దానితో పాటుగా మిగిలిన రెండు ప్రాంతాలను జగన్ రాజధానులను చేశారు. ఇక రాయలసీమ వాసులు తీసుకుంటే తమకే రాజధాని కావాలని పట్టుపడుతున్నారు. ఈ క్రమంలో మూలన ఉన్న విశాఖను రాజధానిగా జగన్ చేసిన మరుక్షణం అక్కడ ఉద్యమాలు మొదలవుతాయని అంటున్నారు. ఆ రాజకీయ గొడవ అలా ఉంటే విశాఖ రాజధానిగా హిట్ అయితే ఓకే. కాకపోతేనే మరిన్ని కొత్త చిక్కులు వస్తాయని అంటున్నారు. విశాఖలో ఉన్న అనేక సమస్యల కారణంగా జగన్ అనుకున్న ప్రగతి సాధ్యపడుతుందా? అన్నది కూడా చూడాలి.

కొరత ఎక్కువే….?

విశాఖలో భూమి కొరత ఉంది. అలాగే నీటి కొరత ఉంది. ఇప్పటికే వివిధ కేంద్ర, రాష్ట్ర పరిశ్రమలతో నగరం మొత్తం పొల్యూషన్ కోరల్లో చిక్కుకుంది. దీంతో విశాఖలో కనుక క్యాపిటల్ పెడితే ఇంకా ఇబ్బందులు వస్తాయని ఓవైపు పర్యావరణవేత్తలు అంటున్నారు. ఇక విశాఖలో పరిశ్రమలు పెట్టేందుకు వచ్చేవారికి భూమి చూపించే బాధ్యత సర్కార్ మీద ఉంది. కానీ అవసరమైన భూమి ప్రభుత్వం వద్ద లేనే లేదు. ఇక మంద ఎక్కువైతే మఠానికి చేటు అన్న తీరున విశాఖలో ఇప్పటికే నీటి ఎద్దడి ఉంది. అది మరింతగా పెరిగితే జనం దాహంతో హాహాకారాలు పెట్టాల్సిందే. వీటితో పాటుగా విశాఖ ఒక నగరంగా ఇప్పటికే జరగాల్సిన అభివఋధ్ధి జరిపించుకుంది. ఇక విస్తరణకు పెద్దగా అవకాశాలు లేవని మాట కూడా ఉంది.

ఉత్తరాంధ్ర యూనిట్ గా….

ఈ నేపధ్యంలో విశాఖను రాజధానిగా ఉంచుతూనే అభివఋధ్ధి కోసం ఒడిషా సరిహద్దు వరకూ పరిమితి పెట్టుకుని ముందుకు సాగితే భూమి కొరత తీరుతుంది. మూడు జిల్లాలను ఒక యూనిట్ గా చేసుకుని వీలైనంత వరకూ శ్రీకాకుళం చివరి వరకూ విస్తరించేలా ప్రణాళికలు వేసుకుంటేనే ఇక్కడ రాజధాని ఏర్పాటు చేసినందుకు సార్దకత దక్కుతుంది. అయితే పారిశ్రామిక వేత్తలు సదూరంలో ఉన్న శ్రీకాకుళం దాకా వస్తారా. వారిని అలా నడిపించే గైడింగ్ ఫోర్స్ గా వైసీపీ సర్కార్ ఎంతవరకూ ఉంటుంది అన్నది కూడా చూడాలి.

మళ్ళీ అదే కధ…

అదే సమయంలో బాగా వెనకబడిన విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను అభివృధ్ధి చేసేందుకు కూడా ప్రభుత్వం మౌలిక సదుపాయాల కోసం పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేయాల్సిఉంటుంది. అంటే ఇదో చిన్న సైజ్ అమరవాతి కధ లాంటిదేనన్నమాట. జగన్ సర్కార్ కి కచ్చితంగా నాలుగేళ్ల గడువు మాత్రమే వుంది. ఇవన్నీ అప్పటిలోగా చేసుకోకపోతే ఇంత రిస్కూ తీసుకుని మూడు రాజధానులు పెట్టినందుకు ఫలితం లేకపోగా రాజకీయంగా కూడా ఇబ్బందులు వస్తాయి. మరి చూడాలి జగన్ విజన్ ఎలా ఉందో.

Tags:    

Similar News