రెడ్లు-క‌మ్మల‌ను టార్గెట్ చేసిన‌ ఎంపీ.. జ‌గ‌న్ నుంచి సమన్లు

రాజ‌కీయాల్లో ఏదైనా చేయొచ్చు.. ఎలాగైనా మాట్లాడేయొచ్చు.. అనే ధోర‌ణి ఇటీవ‌ల కాలంలో పెరిగిపోయింది. మ‌రీ ముఖ్యంగా.. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు.. త‌మ కామెంట్ల ద్వారా సంచ‌ల‌నాలు సృష్టిస్తున్నారు. [more]

Update: 2020-12-23 12:30 GMT

రాజ‌కీయాల్లో ఏదైనా చేయొచ్చు.. ఎలాగైనా మాట్లాడేయొచ్చు.. అనే ధోర‌ణి ఇటీవ‌ల కాలంలో పెరిగిపోయింది. మ‌రీ ముఖ్యంగా.. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు.. త‌మ కామెంట్ల ద్వారా సంచ‌ల‌నాలు సృష్టిస్తున్నారు. వీటితోనే ప‌బ్బం గ‌డుపుతున్నారు. అయితే.. వీటిని కూడా సీఎం జ‌గ‌న్ కానీ, పార్టీ అధిష్టానం కానీ.. ఎక్కడా ఆప‌డంలేదు. దీంతో వారు మ‌రింత రెచ్చిపోతున్నారు. అయితే దీనిలో ఓ కీల‌క ఫార్ములా ఉంది. సంచ‌ల‌న కామెంట్లు చేయొచ్చు. మీడియాలోనూ ప‌దే ప‌దే క‌నిపించ‌వ‌చ్చు. కానీ పార్టీ లైన్ మేర‌కే వ్యవ‌హ‌రించాల‌నేది పార్టీ ప్రధాన కార్యద‌ర్శి, సీఎం జ‌గ‌న్‌ రాజ‌కీయ స‌ల‌హ‌దారు స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి చెబుతున్న విష‌యం తెలిసిందే. వైసీపీలో కొద్ది రోజుల వ‌ర‌కు కూడా కులాల‌ను టార్గెట్‌గా చేసుకుని విమ‌ర్శల ప‌ర్వం ఎక్కువుగా కొన‌సాగింది.

జగన్ నుంచి సమన్లు….

అయితే పార్టీ అధిష్టానం ఏం ఆలోచ‌న చేసిందో కాని పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు.. కులాల‌ను టార్గెట్ చేయ‌డం మానేసి.. వ్యక్తుల‌ను, ప్రత్యర్థుల‌ను, ప్రత్యర్థి పార్టీల‌ను టార్గెట్ చేసుకుంటున్నారు. మ‌రీ ముఖ్యంగా టీడీపీ అధినేత‌ను ఎంత టార్గెట్ చేస్తే.. అంత గుర్తింపు.. అనే ధోర‌ణి వైసీపీలో క‌నిపిస్తోంది. అయితే మ‌ళ్లీ పార్టీ లైన్‌కు భిన్నంగా తొలిసారి.. అనంత‌పురం జిల్లా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధ‌వ్ కులాల‌ను టార్గెట్ చేశారు. కులాల పేర్లు ఎత్తి విరుచుకుపడ్డారు. మ‌రీ ముఖ్యంగా రెడ్లు, కమ్మలు దౌర్జన్యాలు చేస్తే ఊరుకోమని హెచ్చరిక జారీ చేశారు. ఇటీవ‌ల జ‌రిగిన ఈ ప‌రిణామం… అప్పట్లోనే సంచ‌ల‌నం సృష్టించినా.. ప‌రిటాల వ‌ర్గంపై ఆయ‌న దాడి చేశార‌నే కోణంలో అంద‌రూ అనుకున్నా.. తాజాగా జ‌గ‌న్ నుంచి ఆయ‌నకు స‌మ‌న్లు అందిన‌ట్టు పార్టీలో అత్యంత గోప్యంగా చ‌ర్చ సాగుతోంది.

కులాల ప్రస్తావనపై……

సామాజిక వ‌ర్గాల‌ను టార్గెట్ చేయ‌డం వ‌ల్ల పార్టీ న‌ష్టపోతుంద‌ని ప‌దే ప‌దే చెబుతున్నా.. ఎంపీ స్థాయిలో ఉన్న మాధ‌వ్‌.. ఇలా గాడి త‌ప్పడం.. కులాల‌ను టార్గెట్ చేయ‌డం స‌రికాద‌ని జ‌గ‌న్ భావిస్తున్నార‌ని, ఆయ‌న చాలా సీరియ‌స్‌గా ఉన్నార‌ని తెలుస్తోంది. ఈ క్రమంలోనే పిలిచి త‌లంటేందుకు ఆయ‌న స‌మాయ‌త్తమ‌య్యార‌ని అంటున్నారు. ఏదైనా ఉంటే.. పార్టీల‌పై విమ‌ర్శలు చేయండి, నేత‌ల పేర్లు పెట్టి తిట్టండి… ఇంకేమైనా చేసుకోండి. అయితే.. కులాల‌ను ఆపాదించ‌డం, కులాల పేరు పెట్టి ప్రత్యర్థుల‌ను సైతం దూషించ‌వ‌ద్దని .. జ‌గ‌న్ కొన్నాళ్లుగా చెబుతూనే ఉన్నారు.

ఓటు బ్యాంకు కోసం….

సామాజిక వ‌ర్గాలుగా చీలిపోయిన ఓటుబ్యాంకు ప‌రిర‌క్షించుకునేందుకు జాగ్రత్తగా వ్యవ‌హ‌రించాల‌ని సూచిస్తున్నారు. అయితే.. స‌ద‌రు ఎంపీ.. మాధ‌వ్ మాత్రం మ‌న‌సులో జేసీ దివాక‌ర్‌రెడ్డి, ప‌రిటాల ర‌వి వ‌ర్గాల‌ను దృష్టిలో పెట్టుకుని.. వారిని అడ్డు పెట్టి.. రెడ్డి, క‌మ్మ వ‌ర్గాల‌ను దూషించ‌డంపై స్థానికంగా కూడా అల‌జ‌డి రేగుతుండ‌డం గ‌మ‌నార్హం. దీంతో జ‌గ‌న్ ఆయ‌న‌కు క్లాస్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఇక మాధ‌వ్ గ‌తంలో కియా ప్లాంట్ వ‌ద్ద నానా హ‌డావిడి చేసి విమ‌ర్శల పాల‌వ్వడంతో అప్పుడే పార్టీ అధిష్టానం నుంచి క్లాస్ ప‌డింది. ఆ త‌ర్వాత కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న ఆయ‌న ఇప్పుడు మ‌ళ్లీ ఈ కాంట్రవ‌ర్సీ వ్యాఖ్యల‌తో వార్తల్లోకెక్కారు.

Tags:    

Similar News