ఈ మూడింటి నుంచి జగన్ తప్పించుకోలేరట

ఒక్కో ప్రభుత్వానికి ఒక్కో నిర్ణయం ప్రజల నుంచి వ్యతిరరేకత తెచ్చిపెడుతుంది. తెలంగాణలో ఎల్ఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వానికి చేటు తెచ్చిందనే చెప్పాలి. ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీమ్ కారణంగానే టీఆర్ఎస్ [more]

Update: 2021-01-01 05:00 GMT

ఒక్కో ప్రభుత్వానికి ఒక్కో నిర్ణయం ప్రజల నుంచి వ్యతిరరేకత తెచ్చిపెడుతుంది. తెలంగాణలో ఎల్ఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వానికి చేటు తెచ్చిందనే చెప్పాలి. ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీమ్ కారణంగానే టీఆర్ఎస్ గ్రేటర్ ఎన్నికల్లో అనుకోని ఫలితాలను చవి చూడాల్సి వచ్చింది. ఇప్పుడు ఏపీలో కూడా ఎల్ఆర్ఎస్ అనేది జగన్ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. అయితే ఏపీలో ఎల్ఆర్ఎస్ అంటే ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీమ్ మాత్రం కాదు. ఎల్ అంటే లిక్కర్, ఆర్ అంటే రోడ్లు, ఎస్ అంటే శాండ్ గా చెబుతున్నారు.

ఇరవై నెలలు గడుస్తున్నా…..

జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఇరవై నెలలు సమీపిస్తుంది. ఈ ఇరవై నెలల్లో జగన్ కేవలం సంక్షేమ కార్యక్రమాలపైనే దృష్టి పెట్టారు. వ్యక్తిగతంగా లబ్దిదారులకు ప్రయోజనం చేకూర్చడంపైనే ఆయన మనసు పెట్టారు. కానీ ప్రధాన అంశాలను పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా మద్యం అంశం వచ్చే ఎన్నికల్లో కీలక భూమిక పోషించనుంది. మద్యం ధరలను పెంచడంతో పాటు, బ్రాండ్లను కూడా వినియోగదారులు ఆశించినవి లభించకుండా చేయడంతో మందుబాబులు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారన్నది వాస్తవం.

కొత్త ఇసుక పాలసీ తెచ్చినా…..

ఇక ఇసుక విషయానికొస్తే పందొమ్మిది నెలలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇసుక కొరత కొన్ని నెలలు పట్టి పీడించింది. తర్వాత జగన్ ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీని తెచ్చినప్పటికీ ఇసుక లభ్యత తక్కువగానే ఉంది. కొనాలన్నా గతంలో కంటే రెండు, మూడు రెట్లు ఎక్కువ చెల్లించాల్సి ఉంది. ఇసుక కారణంగా కేవలం ఇళ్లను నిర్మాణం చేసుకునే వారు మాత్రమే కాకుండా, భవన నిర్మాణ కార్మికులు, దాని అనుబంధ పరిశ్రమలకు చెందిన వారంతా జగన్ పాలనపై పెదవి విరుస్తున్నారని చెప్పక తప్పదు.

రోడ్లను చూసిన వారెవరైనా….?

గడచిన ఏడాదిన్నరగా జగన్ ప్రభుత్వం రహదారులను ఏమాత్రం పట్టించుకోలేదు. పిడెకెడు మట్టి వేసిన పాపాన పోలేదు. రాష్ట్రంలో అనేక రోడ్లు గుంతలు పడి వాహనదారులకు ఇబ్బందిగా మారాయి. చికాకు పెడుతున్నాయి. ఏ పట్టణం చూసినా ఇదే పరిస్థిితి. దీంతో ప్రజలు అనేక మంది దుస్థితిలో ఉన్న రోడ్లను చూసి జగన్ పాలనపై చర్చించుకుంటున్నారు. మొత్తం మీద ఈ మూడు అంశాలు జగన్ కు వచ్చే ఎన్నికల్లో ప్రతికూలాంశాలుగా మారే అవకాశముందన్నది వాస్తవం. రానున్న కాలంలో ఈ మూడింటి విషయంలో జగన్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి పరిష‌్కరించగలిగితేనే కొంత వ్యతిరేకత నుంచి తప్పించుకునే అవకాశముంది.

Tags:    

Similar News