కరకట్ట మీదకు కోటరీ మరోసారి ఎంట్రీ
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వద్దకు మళ్లీ కోటరీ చేరిపోతుందా? ఎన్నికల తర్వాత దూరమైన కోటరీని మళ్లీ చంద్రబాబు దగ్గరకు చేర్చుకుంటున్నారా? అన్నది పార్టీ లోచర్చనీయాంశమైంది. చంద్రబాబు [more]
;
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వద్దకు మళ్లీ కోటరీ చేరిపోతుందా? ఎన్నికల తర్వాత దూరమైన కోటరీని మళ్లీ చంద్రబాబు దగ్గరకు చేర్చుకుంటున్నారా? అన్నది పార్టీ లోచర్చనీయాంశమైంది. చంద్రబాబు [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వద్దకు మళ్లీ కోటరీ చేరిపోతుందా? ఎన్నికల తర్వాత దూరమైన కోటరీని మళ్లీ చంద్రబాబు దగ్గరకు చేర్చుకుంటున్నారా? అన్నది పార్టీ లోచర్చనీయాంశమైంది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఈ కోటరీ బలమైన లాబీయింగ్ చేసేది. కోటరీని దాటుకునే చంద్రబాబును కలిసే అవకాశముంటుంది. దీనిపై అప్పట్లో టీడీపీ నేతల నుంచే విమర్శలు వచ్చాయి. అయినా కోటరీ మాత్రం పార్టీ అధికారంలో ఉన్నంతవరకూ బలంగానే ఉంది.
ముగ్గురు నేతలు……
కృష్ణా జిల్లాకు చెందిన ఒక సీనియర్ నేతతో పాటు మాజీ ఐఏఎస్ అధికారి, తెలుగుదేశం పార్టీతో సుదీర్ఘ అనుభవం ఉండి ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేని మరో వ్యక్తి చంద్రబాబు కోటరీలో ప్రముఖంగా ఉండేవారు. ఈయన పార్టీ కేంద్ర కార్యాలయం బాధ్యతలను చూసుకునే వారు. ఇక చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కాంట్రాక్టులు, బదిలీలు, పదోన్నతులు వంటి అంశాలు ఈ కోటరీ కనుసన్నల్లోనే జరిగేవి. ఏ ఎమ్మెల్యే అయినా తమ నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి చంద్రబాబు కంటే ముందు కోటరీనే సంప్రదించాల్సి వచ్చేది.
ఫలితాల తర్వాత…..
అయితే ఎన్నికల ఫలితాల తర్వాత ఈ కోటరీని చంద్రబాబు దూరం పెట్టారు. తనకు తప్పుడు సమాచారం ఇచ్చారని వారిపై ఆయన ఆగ్రహంతో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. నిజంగానే అధికారంలో లేకపోవడంతో వారు కూడా చంద్రబాబుకు దూరంగా ఉంటూ వచ్చారు. కానీ పంచాయతీ ఎన్నికల సమయంలో మరోసారి కోటరీ సాయం చంద్రబాబుకు అవసరమైందంటున్నారు. వారి సేవలను పంచాయతీ ఎన్నికల వేళ చంద్రబాబు ఉపయోగించుకున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు.
తాజాగా వారి సాయంతోనే…?
పార్టీ ఓటమి పాలయి రెండేళ్లు కావడం, ఇప్పటికీ ముఖ్యమైన నేతలందరూ ముఖం చాటేస్తుండటంతో చంద్రబాబుకు పక్కనే ఉండి ఆయన చెప్పిన పనులు చక్కబెట్టే వారు లేరు. అనేక నియోజకవర్గాల్లో నాయకత్వ సమస్య ఉంది. మరో వైపు లోకేష్ కు ఇప్పట్లో పార్టీ బాధ్యతలను అప్పగించే అవకాశాలు లేవు. అంతేకాదు వచ్చే ఎన్నికలకు తానే నేతృత్వం వహించి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే మళ్లీ కోటరీ సాయం తీసుకుంటున్నారు. ఇప్పుడు కరకట్ట మీదకు కోటరీ మరోసారి ఎంట్రీ అయిందన్న ప్రచారం సాగుతోంది.