జగన్ ధీమా అదేనట… మోదీ దిగివస్తారట

ఏపీ ముఖ్యమంత్రి జగన్ విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో గట్టి పట్టుదలతో ఉన్నారు. ఎలాగైనా విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరణ కాకుండా చూసేందుకు అన్ని రకాలుగా [more]

Update: 2021-03-12 13:30 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్ విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో గట్టి పట్టుదలతో ఉన్నారు. ఎలాగైనా విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరణ కాకుండా చూసేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వెనక్కు తీసుకునేలా కొన్ని అడుగులు వేస్తున్నారు. దీనికి సంబంధించి జగన్ ఇప్పటికే కొన్ని చర్యలు ప్రారంభించినట్లు తెలిసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ కాకుండా అడ్డుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ఇమేజ్ మరింత పెరుగుతుంది.

మొండిగా వెళుతున్నా….

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండిగా ముందుకు వెళుతుంది. దీనికి సంబంధించిన అన్ని ప్రక్రియలను ప్రారంభించింది. అయితే ఇదే సమయంలో జగన్ కూడా దీనిని అడ్డుకునేందుకు కేంద్ర మంత్రుల చేత రాయబారం నడుపుతున్నట్లు తెలిసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ చేస్తే బీజేపీ రాష్ట్రంలో మరింత ఇబ్బంది పడుతుందని, భవిష్యత్ ఉండదని జగన్ ఢిల్లీ పెద్దలకు సూచించారు.

పరోక్షంగా హెచ్చరికలు…

ీదీంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా తమ సహకారం భవిష్యత్ లో కావాలంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఆలోచనను మానుకోవాలని కూడా పరోక్షంగా సంకేతాలు పంపినట్లు తెలిసింది. ఇప్పటికే ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేశారని, విశాఖస్టీల్ ప్లాంట్ విషయంలో కూడా వ్యతిరేక నిర్ణయం తీసుకుంటే తాము కూడా పునరాలోచించుకోవాల్సి వస్తుందని జగన్ కేంద్ర నాయకత్వానికి కబురు పంపినట్లు సమాచారం.

ఆ ఎన్నికల ఫలితాల తర్వాత…?

అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఎలాగైనా ఆగిపోతుందన్న నమ్మకంతో జగన్ ఉన్నారని తెలుస్తుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజీపీకి చేదు అనుభవం తప్పదని, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు వస్తుందని జగన్ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది. అందుకే మే నెల వరకూ ఓపిక పట్టాలని, ప్రయివేటీకరణను ఎలాగైనా అడ్డుకునేందుకు చివరి వరకూ ప్రయత్నాలు చేద్దామని జగన్ ఇద్దరు కీలక నేతలకు చెప్పనట్లు తెలిసింది. మొత్తం మీద విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ జరగకుండా అడ్డుకోగలనన్న ధీమాలోనే జగన్ ఉన్నారు.

Tags:    

Similar News