జగన్ కు ముందునవన్నీ సవాళ్లేనట…? ఎందుకో తెలుసా?

చూసేవన్నీ నిజం కావు.. ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాలు అమలు చూస్తుంటే ఏ రాష్ట్రంలో జరగనన్ని జరుగుతున్నాయి. దీనికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పట్టుదలే కారణం. అధికారంలోకి [more]

Update: 2021-03-27 14:30 GMT

చూసేవన్నీ నిజం కావు.. ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాలు అమలు చూస్తుంటే ఏ రాష్ట్రంలో జరగనన్ని జరుగుతున్నాయి. దీనికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పట్టుదలే కారణం. అధికారంలోకి వచ్చిన కేవలం రెండేళ్లలోనే తాను పాదయాత్రలోనూ, మ్యానిఫేస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు పర్చాలని జగన్ పడిన తాపత్రయం భవిష్యత్ లో ఇబ్బందులకు గురి చేసేలా ఉంది. మరో మూడేళ్ల పాటు పథకాలను కొనసాగించాలంటే లక్షల కోట్లు అప్పులు చేయక తప్పదు.

నానాటికి దిగజారుతూ….

ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారుతుంది. అప్పులతోనే జగన్ కాలక్షేపం చేస్తున్నారు. వచ్చిన తర్వాత దాదాపు 70 వేల కోట్ల రూపాయలు వివిధ పథకాల రూపంలో ప్రజలకు పంచి పెట్టారు. దీనికి తోడు ఆదాయం మెరుగుపడలేదు. మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం కూడా క్రమంగా తగ్గుముఖం పడుతుంది. భూముల ధరలు ఢమాల్ అనడంతో రిజిస్ట్రేషన్లు కూడా పెద్దగా జరగడం లేదు. దీంతో అనుకున్న స్థాయిలో ఆదాయం ఏపీికి రావడం లేదు. దీంతో దొరికిన కాడికి దొరికినట్లు జగన్ అప్పులు చేసి కాలం వెళ్లబుచ్చుతున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

మాట తప్పనంటూ….

జగన్ మాట ఇస్తే తప్పడు అన్న మాటను నిజం చేసుకోవడానికి అందిన కాడికి అప్పులు తెచ్చి మరీ పథకాలను అమలు చేస్తున్నారు. ఈ పథకాలన్నీ మరో మూడేళ్ల పాటు ఏడాదికి 70 వేల కోట్ల రూపాయలు చొప్పున కేటాయించాల్సి ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరమే జగన్ కు ఇబ్బందులు తప్పవని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అధికార వర్గాల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులున్నట్లు కాగ్ నివేదిక తేల్చింది.

వచ్చే ఎన్నికల హామీలో?

ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల నాటికి కొత్త హామీలు ఇవ్వకుండా జగన్ ప్రజల వద్దకు వెళ్లలేరు. ప్రస్తుత పథకాలను కొనసాగిస్తూనే కొత్త పథకాలను ప్రకటించాల్సి ఉంటుంది. ఉన్నవాటికి అప్పులు తెచ్చి అమలు చేస్తూ కొత్త వాటిని ప్రకటించాలంటే జగన్ కు కష్టమేనంటున్నారు. ఇలా అప్పులతోనే ఎంతకాలం నెట్టుకొస్తారన్న కామెంట్స్ సొంత పార్టీ నుంచే వినపడుతున్నాయి. జగన్ పాలన చూడటానికి ప్రస్తుతానికి బాగానే ఉన్నా భవిష్యత్ లో మాత్రం ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొనక తప్పదంటున్నారు.

Tags:    

Similar News