శత్రువులు పెరుగుతున్నారు జగన్… ?
శత్రువు ఎందుకు ఉంటాడు అంటే చాలా కారణాలు చెప్పవచ్చు. అసూయతోనూ, పోటీతోనూ శత్రువులు రాజకీయాల్లో ఉంటారు. ఒకరిని దాటుకుని ముందుకు సాగే క్రమంలో ఈ శత్రువులు పుట్టుకువస్తారు. [more]
;
శత్రువు ఎందుకు ఉంటాడు అంటే చాలా కారణాలు చెప్పవచ్చు. అసూయతోనూ, పోటీతోనూ శత్రువులు రాజకీయాల్లో ఉంటారు. ఒకరిని దాటుకుని ముందుకు సాగే క్రమంలో ఈ శత్రువులు పుట్టుకువస్తారు. [more]
శత్రువు ఎందుకు ఉంటాడు అంటే చాలా కారణాలు చెప్పవచ్చు. అసూయతోనూ, పోటీతోనూ శత్రువులు రాజకీయాల్లో ఉంటారు. ఒకరిని దాటుకుని ముందుకు సాగే క్రమంలో ఈ శత్రువులు పుట్టుకువస్తారు. కొన్ని సార్లు మోకాలడ్డడానికి కూడా ఈ శత్రువులు పధకాలు వేస్తారు. అలా కనుక చూసుకుంటే జగన్ కి తొలినాళ్ళలో సోనియాగాంధీ చంద్రబాబు ప్రధాన శత్రువులుగా ఉండేవారు. జగన్ ఎదుగుదలను మొగ్గలోనే తుంచాలని వారిద్దరూ చూశారని అంటారు. ఇక వారితోనే పోరాడుతూ ముఖ్యమంత్రి పీఠం అందుకున్నారు. ఈ మధ్యలో ఆయనతో చేతులు కలిపిన వారు, ఆశలు పెట్టుకున్న వారు ఇపుడు అవి నెరవేరక కొత్త శత్రువులుగా మారిపోతున్నారా అన్న చర్చ అయితే వస్తోంది.
ముగిసింది హానీమూన్….
జగన్ సర్కార్ రెండేళ్ల పాలన ముగించుకుంది. మరో మూడేళ్ళు చేతిలో ఉన్నాయి. కానీ ఎన్నికల ఏడాదిగా చివరి సంవత్సరాన్ని తీసేస్తే మిగిలింది కచ్చితంగా మరో రెండేళ్లు. అంటే జగన్ ఏం చేయాలనుకున్నా ఇదే కరెక్ట్ టైమ్ అన్న మాట. ఇక జగన్ మీద అందరి చూపూ ఉంటుంది. ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చమని ఒత్తిడి పెట్టేవారు ఇకమీదట కనిపిస్తారు. ఇన్నాళ్ళూ జగన్ సర్కార్ కి సమయం ఇచ్చిన వారు కూడా అలసిపోయి పోరాటబాట పట్టేందుకు కూడా రెడీ అయ్యే సమయం కూడా ఇదే. ముఖ్యంగా ప్రభుత్వంలో కీలకమైన భాగంగా ఉన్న ఉద్యోగ వర్గాల్లో అయితే జగన్ సర్కార్ మీద వ్యతిరేకత ప్రబలుతోంది అంటున్నారు.
ఉద్యోగుల గుస్సా…?
ప్రభుత్వ ఉద్యోగులు జగన్ మీద గుస్సా పెంచుకోవడానికి అతి ముఖ్యమైన అంశం పీయార్సీ. తెలంగాణాలో అమలు అయింది ఏపీలో మాత్రం పెండింగులో ఉంది. తాజా బడ్జెట్ లో కూడా ఆ ఊసు లేదు. దాంతో వారు మండుతున్నారు. అదే విధంగా పాదయాత్ర వేళ జగన్ పెన్షన్ స్కీమ్ విషయంలో పాత విధానాన్నే కొనసాగిస్తమని చెప్పారు. కానీ ఇప్పటిదాకా అది నెరవేరలేదు. ఇక మూడు రాజధానుల విషయంలో కూడా ఉద్యోగులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దాంతో ఉద్యోగ సంఘాల నేతలు తాము ప్రభుత్వానికి మద్దతు అని పైకి చెబుతున్నా లోపల సీన్ మాత్రం వేరేగా ఉందని అంటున్నారు. ఉద్యోగులు కనుక తలచుకుంటే ప్రభుత్వాల జాతకాలు మారుతాయి అన్న సంగతి తెలిసిందే.
వీరంతా అదే రూట్ :
ఇక ఏపీలో ఇసుక సమస్య అలాగే ఉంది. దాంతో దాని మీద ఆధారపడిన భవన నిర్మాణ కార్మికులు అనబడే పెద్ద సెక్షన్ కూడా సర్కార్ కి యాంటీగా ఉంది అంటున్నారు. అలాగే బిల్డర్లు కూడా జగన్ ప్రభుత్వం మీద మండుతున్నారు. మరో వైపు ప్రభుత్వ పధకాల కిందకు రాని వర్గాలు కూడా అభివృద్ధి ఏదీ అని ప్రశ్నిస్తున్నారు. ఉపాధి అవకాశాలు లేని నిరుద్యోగ యువత సైతం జగన్ సర్కార్ చెప్పిన జాబ్ క్యాలండర్ ఏదీ అని నిలదీస్తోంది. అరకొర ఉద్యోగంగా ఉన్న సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్న వారు కూడా బండ చాకిరి తమ మీద పడిపోతోంది అంటూ సృష్టి కర్త జగన్ మీదనే కోపం పెంచుకుంటున్నారు. ధరలు నింగిని అంటేసి సామాన్యుడు కూడా ప్రభుత్వం మీద ధర్మాగ్రహం ప్రదర్శిస్తున్నాడు. ఇంతకాలం విపక్షాలు చేసిన ఉద్యమాలు ఫెయిల్ అవడానికి కారణం ఈ వర్గాలు సైలెంట్ గా ఉండడం. ఇపుడు జగన్ హానీమూన్ ముగిసింది. వీరు కనుక మద్దతు ఇస్తే విపక్షాలకు కూడా జోష్ వస్తుంది. అపుడు ప్రభుత్వ వ్యతిరేకత కూడా బాగా పెరుగుతుంది. మరి అంతవరకూ సీన్ తెచ్చుకోకుండా ఉండాలంటే ఆయా సబ్జెక్టుల మీద ఇప్పటి నుంచే సర్కార్ దృష్టి పెట్టాల్సిందే అంటున్నారు.