బాకీ పడిపోతున్న జగన్… ?
రాజకీయాల్లో బాకీలు ఉంటే భారీ షాకులే ఇస్తాయని చంద్రబాబు 2019 ఓటమి ఉదంతం తెలియచేస్తోంది. ఇస్తానని చెప్పి ఇవ్వకపోతే జనాలు అసలు ఊరుకోరు. మాకూ టైమ్ వస్తుంది [more]
;
రాజకీయాల్లో బాకీలు ఉంటే భారీ షాకులే ఇస్తాయని చంద్రబాబు 2019 ఓటమి ఉదంతం తెలియచేస్తోంది. ఇస్తానని చెప్పి ఇవ్వకపోతే జనాలు అసలు ఊరుకోరు. మాకూ టైమ్ వస్తుంది [more]
రాజకీయాల్లో బాకీలు ఉంటే భారీ షాకులే ఇస్తాయని చంద్రబాబు 2019 ఓటమి ఉదంతం తెలియచేస్తోంది. ఇస్తానని చెప్పి ఇవ్వకపోతే జనాలు అసలు ఊరుకోరు. మాకూ టైమ్ వస్తుంది అంటూ కొపాన్ని దాచుకుని వడ్డీలతో సహా ఎన్నికల వేళ బయటకు తీస్తారు. ఇక జగన్ విషయం తీసుకుంటే మాట ఇస్తే తీరుస్తారు అని పేరు. అయితే కొన్ని విషయాల్లో జగన్ అనుకున్నది చేయలేకపోతున్నారు. దానికి కారణం ఆర్ధికపరమైన వెసులుబాటు లేకపోవడమే. బీసీలను చంద్రబాబు కంటే ఎక్కువగా నెత్తిన పెట్టుకుంటాను అంటూ సరిగ్గా ఎనిమిది నెలల క్రిత్రం జగన్ చేసిన కార్పోరేషన్ ప్రయోగం ఇపుడు వికటిస్తోందా అన్న డౌట్లు వస్తున్నాయట.
విగ్రహం పుష్టి ….
విగ్రహం పుష్టి నైవేద్యం నాస్తి అన్నట్లుగా ఏపీలో బీసీ కార్పోరేషన్లు తయారయ్యాయి అన్న కామెంట్స్ ఉన్నాయి. ఏపీలో మొత్తం ఉన్న 139 కులాలను 56 కార్పోరేషన్లుగా చేసి వాటికి చైర్మన్లను, డైరెక్టర్లను పెద్ద ఎత్తున జగన్ నియమించారు. ఇవన్నీ కూడా రాష్ట్ర స్థాయి పదవులే. ఇక వాటికి విధి విధానాలు, హోదాలు వంటివి కూడా ఆ తరువాత ఏమీ ప్రకటించలేదు. అన్నింటికీ మించి నిధులు అసలు లేవు. గట్టిగా చెప్పాలంటే కాగితాల మీదనే ఇంకా కార్పోరేషన్లు ఉన్నాయని అంటున్నారు.
జీతాలేవీ …?
బీసీ కార్పోరేషన్ల చైర్మన్లకు యాభై వేల రూపాయలు జీతం అని చెప్పారు. అలాగే డైరెక్టర్లకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటిదాకా ఒక్క పైసా కూడా వారి ఖాతాల్లో జమ కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం చైర్మన్ సహా 12 మంది డైరెక్టర్లు ఒక కార్పొరేషన్ లో ఉంటారు. ఆ విధంగా చూస్తే 672 మంది వారే ఉంటారు. అదే విధంగా 56 మంది చైర్మన్లు ఉన్నారు. వీరందరికీ నెలకు గౌరవ వేతనాలు ఇవ్వాలంటే పెద్ద ఎత్తున బడ్జెట్ అవుతుంది. ఆర్ధిక పరమైన కారణాలతోనే వీరికి వేతనాలు ఆపారా అన్నదే ప్రశ్నగా ఉందిట.
ఉన్నారంటే …?
వీరి పరిస్థితి ఉపుడు ఎలా ఉంది అంటే ఉన్నారు అంటే ఉన్నారు అన్నట్లు అంటున్నారు. వీరి కోసం ఒక ఆఫీస్ లేదు. అలాగే వీరంతా ఒక చోట సమావేశం కావాలంటే కూడా ఇబ్బందిగానే ఉందిట. మరో వైపు చూస్తే వీరి విధి విధానాలను ఇప్పటిదాకా ఖరారు చేయకపోవడం వల్ల తాము పేరుకు మాత్రమే పదవుల్లో ఉన్నామా అన్న బాధ అయితే ఉంది. ఇక్కడో విషయం చెప్పుకోవాలి. ప్రత్యేకించి కార్పోరేషన్లకు నిధులు కేటాయింపులు లేవు. ప్రభుత్వ పెద్ద ఎత్తున అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు అందరి మాదిరిగానే ఈ కులాలకు దక్కుతాయి. మరి వాటిని పర్యవేక్షించి అర్హులకు వాటిని అంచించే పని కోసమా ఇంతటి హంగామా అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. జరిగిందేదో జరిగిపోయింది ఇప్పటికైన వీరికి సమాదరించి తగిన విధంగా కార్పోరేషన్లను స్ట్రీమ్ లైన్ చేయకపోతే అసలుకే ఎసరు వచ్చేలా ఉందని వైసీపీలో చర్చ అయితే సాగుతోంది.