మూట విప్పుతున్న జగన్… ?
అధికారంలో ఉన్న వారికి చాలా తలనొప్పులు ఉంటాయి. అందులో పదవుల పందేరం అన్నది చాలా చెడ్డ చికాకు పెట్టేదే. అందరూ అయినవారే. మరి కొందరికే పదవులు. ఎవరికీ [more]
;
అధికారంలో ఉన్న వారికి చాలా తలనొప్పులు ఉంటాయి. అందులో పదవుల పందేరం అన్నది చాలా చెడ్డ చికాకు పెట్టేదే. అందరూ అయినవారే. మరి కొందరికే పదవులు. ఎవరికీ [more]
అధికారంలో ఉన్న వారికి చాలా తలనొప్పులు ఉంటాయి. అందులో పదవుల పందేరం అన్నది చాలా చెడ్డ చికాకు పెట్టేదే. అందరూ అయినవారే. మరి కొందరికే పదవులు. ఎవరికీ అసంతృప్తి రాకుండా చూసుకోవాలి అంటే కత్తి మీద సాము వ్యవహారం. ఈ గొడవ పడలేక తన అయిదేళ్ల పాలనలో చివరి ఏడాది మాత్రమే కొందరికి పదవులు పంచి నెక్స్ట్ టైమ్ బెటర్ లక్ అంటూ చంద్రబాబు చెప్పేశారు. మరి జగన్ పాలన రెండేళ్ళు పూర్తి అయింది. ఇంకా మూడేళ్లు ఉంది. వచ్చే ఎన్నికలకు క్యాడర్ ని సిద్ధం చేయాలంటే వారి చేతిలో పదవి ఇవ్వాల్సిందే. అందుకే ఎట్టకేలకు జగన్ ఓకే చెప్పేశారుట.
లిస్ట్ పెద్దదే ….?
వైసీపీ లో ప్రస్తుతం సీన్ ఎలా ఉంది అంటే నీళ్ళతో బాగా నిండిన చెరువులో కప్పలు మిక్కిలిగా చేరిన మాదిరిగా అని చెప్పాలి. అంతా అక్కడే చేరారు. జనంతో కిక్కిరిసిపోతున్నారు. వీరిలో మొదటి నుంచి జగన్ ని అట్టి పెట్టుకుని ఉన్న వారుంటే మధ్యలో చేరిన వారు కొందరు. ఇక ఎన్నికల ముందు చేరిన వారు, అనంతరం అధికారం చూసుకుని జత కలసిన వారు. ఇలా చాలా జాబితాయే వుంది. వీరిలో అందరి కన్నూ అందలం మీదనే ఉంది. మరి జగన్ సంతర్పణ చేయాలంటే ఏపీలో ఉన్న పదవులు అన్నీ సరిపోవు. కాబట్టే కొన్ని అర్హతలను సెట్ చేసి లిస్ట్ రెడీ చేయాలని జగన్ ఆదేశించినట్లుగా భోగట్టా.
వారికే ప్రయారిటీ….
తాను గెలుస్తానో లేదో తెలియకపోయినా నమ్మి వెంట నడచిన వారికే అగ్ర తాంబూలం ఇవ్వాలని జగన్ డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు. అలాగే పార్టీ కోసం పదేళ్లకు పైగా అన్ని రకాలుగా కష్టపడి చితికిపోయిన వారికి కూడా ఆఫర్లు ఇవ్వాలని భావిస్తున్నారుట. ఇక విధేయతకు పెద్ద పీట వేయాలని, సామాజిక వర్గాల సమీకరణలు కూడా కచ్చితంగా పాటించాలని జగన్ నాయకులకు సూచించారని టాక్. మొత్తం పదవుల్లో సగానికి సగం మహిళలకు ఇవ్వాలని కూడా జగన్ గట్టిగా తీర్మానించుకున్నారని అంటున్నారు.
మొండి చేయే…?
ఈ రకమైన అర్హతలు కనుక చూసుకుంటే ఎన్నికల ముందు తరువాత వచ్చి చేరిన ఇతర పార్టీ నాయకులకు మొండి చేయి తప్పదు అంటున్నారు. వారంతా వివిధ కారణాలతో పార్టీలో చేరారు. మళ్ళీ వైసీపీ కళ తగ్గగానే తాము వచ్చిన చోటుకే వెళ్ళిపోతారు. ఈ సంగతి తెలిసే జగన్ తన కోసం ఎన్నో త్యాగాలు చేసిన వారికే పదవులు అని కచ్చితంగా నియమం పెట్టుకున్నారుట. ఇక పదవులు రాష్ట్ర స్థాయిలోనూ, జిల్లా స్థాయిలోనూ కూడా చాలానే ఉన్నాయి. ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ చివరి నిముషంలో కోల్పోయిన వారికి రాష్ట్ర స్థాయి పదవులు దక్కునున్నట్లుగా భోగట్టా. అలాగే మునిసిపల్ ఎన్నికల్లో పదవులు దక్కని వారిని జిల్లా స్థాయి నామినేటెడ్ పదవుల్లో అకామిడేట్ చేస్తారని అంటున్నారు. జగన్ ఆదేశం మేరకు పార్టీ ముఖ్యులు ఈ మేరకు జాబితాను రూపొందించి అధినేతలు అందచేస్తారు. ఆ మీదట పదవుల పందేరం స్టార్ట్ అవుతుందిట.