మరోసారి…అధికారంలోకి రావడానికి భారీ యాక్షన్ ప్లాన్
జగన్ మరీ నల్ల పూస అయిపోయారు. కంటికి కనిపించడం మానేశారు. రెండేళ్ళుగా కరోనా మహమ్మారి ఏపీలో తిష్ట వేసుకున్న నేపధ్యంలో ముఖ్యమంత్రి అసలు బయటకు రావడమే మానుకున్నారు. [more]
;
జగన్ మరీ నల్ల పూస అయిపోయారు. కంటికి కనిపించడం మానేశారు. రెండేళ్ళుగా కరోనా మహమ్మారి ఏపీలో తిష్ట వేసుకున్న నేపధ్యంలో ముఖ్యమంత్రి అసలు బయటకు రావడమే మానుకున్నారు. [more]
జగన్ మరీ నల్ల పూస అయిపోయారు. కంటికి కనిపించడం మానేశారు. రెండేళ్ళుగా కరోనా మహమ్మారి ఏపీలో తిష్ట వేసుకున్న నేపధ్యంలో ముఖ్యమంత్రి అసలు బయటకు రావడమే మానుకున్నారు. అంతా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ తోనే అన్నట్లుగానే సీన్ ఉంది. అదే సమయంలో జగన్ అన్ని ప్రారంభోత్సవాలూ వర్చువల్ విధానంలోనే చేసేస్తున్నారు. అలాగే సంక్షేమ కార్యక్రమాలను సైతం ఆన్ లైన్ లో బటన్ నొక్కి డైరెక్ట్ గా లబ్దిదారుల ఖాతాల్లో వేస్తున్నారు. లైవ్ వీడియో ద్వారానే వారితో ముచ్చట్లు తప్ప మరేమీ లేదన్నట్లుగా సీన్ ఉంది. మధ్యలో లోకల్ బాడీస్ కి ఎన్నికలు జరిగినా, ప్రతిష్టాత్మకంగా తిరుపతి ఉప ఎన్నిక జరిగినా కూడా జగన్ ఎక్కడా హాజరు కాలేదు.
ముహూర్తం ఉందా…?
అయితే జగన్ కి కూడా జనాలను ప్రత్యక్షంగా కలవాలని మనసులో ఉందని మంత్రులు చెబుతున్నారు. ఆయన తపన అంతా కూడా ప్రజల కోసమే అని కూడా అంటున్నారు. కానీ కరోనా కాలం కాబట్టే జగన్ ప్రజల వద్దకు వెళ్ళడం లేదని అంటున్నారు. సరైన టైమ్ చూసుకుని జగన్ జనంలోకి వస్తారని చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే జనం వద్దకు వెళ్ళేందుకు జగన్ పక్కా ప్లాన్ తో ఉన్నారన్నది తెలుస్తోంది. కరోనా నెమ్మదించిన మీదట జగన్ జనం బాట పడతారని కూడా వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట.
రచ్చ బండతో …?
జగన్ కి రచ్చ బండ మీద మోజు ఉంది. ప్రతీ ఊరు తిరిగి ముఖ్యమంత్రిగా ప్రజల సమక్షంలోనే సమస్యలను తేల్చాలని కూడా ఆయన అనుకుంటున్నారుట. నిజానికి తొలి ఏడాది పూర్తి అయ్యాక అడుగు బయట పెట్టాలని అనుకున్నారు. కానీ దానికి ముందే కరోనా వచ్చి ఏపీని అతలాకుతలం చేసింది. ఇక ఈ ఏడాది అనుకుంటే రెండవ దశ కూడా గట్టిగా ఉంది. దీంతో జగన్ తన ఆలోచనలను వాయిదా వేసుకున్నారని చెబుతున్నారు. మొత్తానికి మొత్తం జనాలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేసిన మీదట జగన్ రచ్చ బండకు రంగం సిద్ధమవుతుందని అంటున్నారు.
క్రేజే వేరు…?
అంటే మూడేళ్ల పాలన పూర్తి అయ్యాక జగన్ జనం ముఖం చూస్తారన్న మాట. నిజంగా ఇంత కాలం జగన్ని చూడని వారికి ఒక్కసారిగా ఆయన్ని చూస్తే పూనకాలే వస్తాయని అంటున్నారు. జగన్ కూడా ఒక వ్యూహం ప్రకారమే ఇలా చేశారు అన్న మాట కూడా ఉంది. పాదయాత్ర పేరిట ఊరూరా తిరిగేసిన ఏడాదిన్నర పాటి కలియతిరిగేసిన జగన్ కొన్నాళ్ళుగా కావాలనే తెర వెనక్కు వెళ్లారని కూడా చెబుతున్నారు. మరి ఇలా భారీ గ్యాప్ ఇచ్చేసిన తరువాత అన్న అడుగేస్తే మాత్రం ప్రజలు బ్రహ్మరధం పడతారని కూడా అంచనా వేస్తున్నారు. జగన్ చెప్పే మాటలు, ఆయన హావభావాలు ఇపుడు కొత్తగా ఉంటాయని కూడా ఊహిస్తున్నారు. మొత్తానికి ఎన్నికలకు రెండేళ్ల వ్యవధి ఉండగా జగన్ జనంలోనే ఉంటూ మరోసారి పార్టీని అధికారంలోకి తేవడానికి భారీ యాక్షన్ ప్లాన్ రూపొందించారని అంటున్నారు. దీంతో ఆలోచన అదిరింది. అన్న అడుగేయడమే ఇక ముందుంది అంటున్నారు వైసీపీ నేతలు.