రాజుగారే కాదు రెడ్లు కూడా ఇద్దరున్నారట
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు రానున్న కాలంలో పార్టీలో కొంత వ్యతిరేకత ఏర్పడే అవకాశముంది. అనేక మంది రఘరామ కృష్ణంరాజులు రెడీగా ఉన్నారన్న టాక్ వినపడుతుంది. [more]
;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు రానున్న కాలంలో పార్టీలో కొంత వ్యతిరేకత ఏర్పడే అవకాశముంది. అనేక మంది రఘరామ కృష్ణంరాజులు రెడీగా ఉన్నారన్న టాక్ వినపడుతుంది. [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు రానున్న కాలంలో పార్టీలో కొంత వ్యతిరేకత ఏర్పడే అవకాశముంది. అనేక మంది రఘరామ కృష్ణంరాజులు రెడీగా ఉన్నారన్న టాక్ వినపడుతుంది. ప్రధానంగా ఎంపీలలో ఎక్కువగా అసంతృప్తి కనపడుతుందంటున్నారు. ఇప్పటికిప్పుడు వీరి అసంతృప్తి నేరుగా బద్దలు కాకపోయినా ఎన్నికలకు ముందయినా ఖచ్చితంగా వారు బయటపడతారన్నది పార్టీ వర్గాల నుంచి విన్పిస్తున్న మాట.
సంక్షేమ పథకాలపైనే?
జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సంక్షేమ పథకాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. నియోజకవర్గాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. పార్టీలో నెలకొన్న విభేదాలపై కూడా జగన్ దృష్టి పెట్టలేదు. దీంతో అనేక మంది పార్లమెంటు సభ్యులు అసంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఎంపీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, వారికి పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానాలను పంపకపోవడం వంటివి అసంతృప్తికి కారణాలుగా చెబుతున్నారు.
కోస్తా జిల్లాలకు చెందిన…?
ముఖ్యంగా కోస్తా జిల్లాలకు చెందిన ఇద్దరు ఎంపీలు జగన్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిసింది. వీరిద్దరూ జగన్ సామాజికవర్గానికి చెందిన వారే. గత ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చి టిక్కెట్ పొంది గెలుపొందిన వారే. అయితే వీరికి తమ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో తగిన ప్రాధాన్యత దక్కడం లేదు. తమ విజయానికి సహకరించిన సొంత క్యాడర్ కు కూడా వీరు ఏమీ చేసుకోలేకపోతున్నారు.
జగన్ దృష్టికి తెచ్చినా…?
నామినేటెడ్ పదవుల నుంచి కాంట్రాక్టుల వరకూ అంత ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పినవిధంగానే నడుస్తుంది. ఈ విషయాన్ని ఈ ఎంపీలిద్దరూ గతంలో జగన్ దృష్టికి తమ సమస్యలను తెచ్చారు. అయితే వారి సమస్యకు జగన్ ఎలాంటి పరిష్కారం చూపలేదు. దీంతో ఆ ఇద్దరు ఎంపీలు పార్టీ అధినేతపై బహిరంగంగా అసంతృప్తిని వెళ్లగక్కే అవకాశాలున్నాయంటున్నారు. ఎన్నికలకు ముందు వీరిద్దరూ పార్టీ మారినా ఆశ్చర్యం లేదంటున్నారు. మొత్తం మీద జగన్ పార్టీ నేతల్లోనూ, ఎంపీల్లోనూ ఉన్న అసంతృప్తిని తొలగించే ప్రయత్నం చేయాల్సి ఉంది.