జగన్ ఢిల్లీకి వెళితే… బాబుకు సంబరమేనా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడు ఢిల్లీ పర్యటన పెట్టుకున్నా విపక్షాల విమర్శలకు అవకాశం దొరికినట్లే. జగన్ కు అపాయింట్ మెంట్ దొరకకపోయినా దానిని అనుకూలంగా మలుచుకుంటారు. అలాగే [more]

Update: 2021-06-09 06:30 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడు ఢిల్లీ పర్యటన పెట్టుకున్నా విపక్షాల విమర్శలకు అవకాశం దొరికినట్లే. జగన్ కు అపాయింట్ మెంట్ దొరకకపోయినా దానిని అనుకూలంగా మలుచుకుంటారు. అలాగే అపాయింట్ మెంట్ దొరికి కేంద్రం పెద్దలతో మాట్లాడి వస్తే మరొక టైపులో కామెంట్స్ వచ్చిపడతాయి. జగన్ ఢిల్లీ పర్యటన ఎప్పుడు పెట్టుకున్నా ఏపీలో ఇదే తంతు. ఒక ముఖ్యమంత్రిగా జగన్ ఢిల్లీ పర్యటనను ఎప్పుడూ వివాదంగానే మలచడంలో టీడీపీ, దాని అనుకూల మీడియా సక్సెస్ అవుతుంది.

ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా…..

జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు పది సార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలతో పాటు కేంద్ర మంత్రులను కూడా కలసి వచ్చారు. అయితే ఎప్పుడు వారిని కలసి వచ్చినా కేసుల మాఫీ కోసమేనని టీడీపీ విమర్శలు చేయడం మామూలుగా మారిపోయింది. తనపై నమోదయి ఉన్న సీబీఐ కేసుల నుంచి తప్పించుకోవడానికే జగన్ ఢిల్లీలో పెద్దలను కలిశారని, రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని టీడీపీ నేతలు విమర్శలు చేస్తూ ఉంటారు.

వాయిదా పడితే?

ఒకవేళ అపాయింట్ మెంట్ దొరక్క జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా పడితే ఢిల్లీ పెద్దలతో బెడిసి కొట్టిందన్న కామెంట్స్ చేస్తుంటారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు 29 సార్లు ఢిల్లీ కి వెళ్లి వచ్చారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లినప్పుడల్లా హడావిడి ఉండేది. జాతీయ మీడియాకు కూడా చంద్రబాబు తన ఢిల్లీ పర్యటను బ్రీఫ్ చేసేవారు. కానీ జగన్ మాత్రం ఢిల్లీకి వెళ్లి పెద్దలను కలసినా మీడియా సమావేశం ఏర్పాటు చేయడం లేదు. సీఎంవో కార్యాలయం నుంచి నోట్ మాత్రం విడుదల చేస్తారు.

ఏ ముఖ్యమంత్రి అయినా?

దీనిని టీడీపీ, దాని అనుకూల మీడియా అడ్వాంటేజీగా తీసుకుంటుంది. సహజంగా ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ముందుగానే ఖరారవుతుంది. ఢిల్లీలో కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్ లభిస్తేనే ఏ ముఖ్యమంత్రి అయినా వెళతారు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా అంతే. కానీ జగన్ విషయంలో మాత్రం ఢిల్లీ పర్యటనకు వెళ్లినా, వాయిదా పడినా మాత్రం తమకు అనుకూలంగా మార్చుకోవడంలో టీడీపీ సక్సెస్ అవుతుందనే చెప్పాలి. ఇది పూర్తిగా వైసీపీ ఫెయిల్యూర్ కారణమన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News