ఈ రిస్క్ అవసరమా జగన్… ?

జగన్ ఏం చదివారో మాకు తెలియదు అని టీడీపీ ఎపుడూ ఎకసెక్కమాడుతుంది. ఆయన చదువు టీడీపీకే కాదు ఏపీ జనాలకు కూడా ఇపుడు అనవసరం. ఆ మాటకు [more]

;

Update: 2021-06-09 08:00 GMT

జగన్ ఏం చదివారో మాకు తెలియదు అని టీడీపీ ఎపుడూ ఎకసెక్కమాడుతుంది. ఆయన చదువు టీడీపీకే కాదు ఏపీ జనాలకు కూడా ఇపుడు అనవసరం. ఆ మాటకు వస్తే రాజ్యాంగం ప్రకారం ప్రజా ప్రతినిధిగా పోటీ చేయడానికి ఉన్నత చదువులు చదవాలని నిబంధన కూడా ఏదీ లేదు. పైగా జగన్ ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతారు. ఆయన ఉత్తమ పారిశ్రామికవేత్తగా కూడా ఉన్నారు. అది చాలు. కానీ ఏదో విమర్శ చేయాలని చూసే విపక్షాలకు మాత్రం జగన్ గురించి అన్నీ కావాలి. కోడి గుడ్డు మీద వెంట్రుకలు పీకాలని వారికి సరదా. పోనీ వారికేదో ఆ దురద ఉందనుకుంటే సబబే కానీ మధ్యలో జగన్ కి ఎందుకు ఇలా పరీక్షలు చదువూ అంటూ పట్టుకుంది అన్నదే వైసీపీలోని జగన్ వీరాభిమానుల ఆవేదన.

పట్టుదల ఏల…?

ఏపీలో ఏదో ఒక దాన్ని పట్టుకుని రాద్ధాంతం చేయడానికి విపక్షాలు రెడీగా ఉంటాయి. గత మూడు నెలలుగా చినబాబు ఒకే ఒక సబ్జెక్ట్ పట్టుకుని అలా ముందుకు పోతున్నాడు. ఆయన చేస్తున్నది రాజకీయమని ఒక వైపు అంటూనే చినబాబుకు అలా చాన్స్ ఇచ్చేస్తూ వైసీపీ అడ్డంగా దొరికిపోతోంది. ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణ అన్నది కూడా ఇపుడు పొలిటికల్ అజెండాగా మారిపోయింది. ప్రతీ నాలుగు రోజులకు ఒకసారి విద్యా మంత్రి ఆదిమూలపు సురేష్ పరీక్షలు పెట్టి తీరుతామని గర్జిస్తారు. ఆ వెంటనే లోకేష్ బాబు రంగంలోకి దిగిపోయి ఎలా పెడతారో చూస్తామని హూంకరిస్తారు. మొత్తానికి ఇదొక పొలిటికల్ గేన్ గా పార్టీలకు ఉన్నా ఈ మధ్యన నలిగి అటు విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాలులు కూడా తెగ వేదన చెందుతున్నారు.

పాస్ అంటే పోలా…?

దేశంలో ప్రతిష్టాత్మకమైన సీబీఎస్ఈనే కేంద్రం రద్దు చేసింది. అదే విధంగా దేశంలోని అనేక రాష్ట్రాలు కూడా టెన్త్ ఇంటర్ పరీక్షలు రద్దు చేశారు. పొరుగున ఉన్న తెలుగు రాష్ట్రం అదే పని చేసింది. కానీ ఒక్క జగన్ సర్కార్ మాత్రమే విద్యార్ధులు వారి భవితవ్యం అంటూ దీర్ఘాలు తీస్తూ విపక్షాల రొచ్చు రాజకీయానికి ఊపిరి పోస్తోంది అన్న మాట అయితే ఉంది. నిజానికి కరోనా రెండవ దశ దూకుడు చూశాక పరీక్షలు వద్దురా బాబూ అన్నట్లుగానే విద్యార్హ్దుల మూడ్ ఉంది. తల్లిదండ్రులు కూడా డిటో. మరి వారికి తెలియదా తమ బిడ్డల ఫ్యూచర్ ఎలా ఉండాలో. ముందు బతికుంటే బలుసాకు తింటామన్న తీరున బయట వాతావరణం ఉంటే పరీక్షలు నిర్వహించి రేపటి ఉజ్వలమైన భవిష్యత్తుకు బాటకు వేస్తామని జగన్ సర్కార్ చెప్పడం వింతగానే ఉంది కదా.

కేసులు తగ్గినా..?

ఆగస్టులో పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం అంటోంది. టెన్త్ పరీక్షలే అన్నింటికీ కొలమానం కాబట్టి పాస్ చేయలేమని చెబుతోంది. జగన్ ప్రభుత్వం ఆదర్శవంతమైన విధానాన్ని ఎంచుకున్నా ప్రజల మూడ్ కూడా పరిగణనలోకి తీసుకోవాలి. కదా ఎంత కేసులు తగ్గినా కూడా కరోనా భయం అన్నది ఆగస్ట్ నాటికి పూర్తిగా పోతుంది అని ఎవరూ చెప్పలేరు. ఇక పెద్ద ఎత్తున విద్యార్ధులు పరీక్షలు రాస్తే ఇందులో ఏ కొద్ది మందికైనా కరోనా సోకితే తప్పు అంతా జగన్ దే అంటూ మొత్తం బురద పూయడానికి ఎటూ విపక్షం రెడీగా ఉంటుంది. అంటే ఒక వైపు పొలిటికల్ గా రిస్క్ అని తెలిసి జగన్ సర్కార్ పరీక్షల నిర్వహణకు దూకుడు చేయడం మంచిది కాదు అన్నది పార్టీలో కూడా వినిపిస్తున్న మాట. మొత్తానికి ఇవి విధార్ధులు రాసే పరీక్షలుగా లేవు, జగనే పరీక్షలు రాస్తున్నట్లుగా ఉంది అని వైసీపీ నేతలు మధనపడుతున్నారంటే పాయింటేగా మరి.

Tags:    

Similar News