జగన్ ని సీఎం గా గుర్తించరా… ?

అదేంటో కానీ జగన్ సీఎం అని గుర్తించడానికి విపక్షాలు ససేమిరా ఇష్టపడడంలేదు. వారి మదిలో జగన్ సీఎం కావడం ఇష్టం లేదు. అసలు ఆయన ఈ జన్మలో [more]

Update: 2021-06-10 03:30 GMT

అదేంటో కానీ జగన్ సీఎం అని గుర్తించడానికి విపక్షాలు ససేమిరా ఇష్టపడడంలేదు. వారి మదిలో జగన్ సీఎం కావడం ఇష్టం లేదు. అసలు ఆయన ఈ జన్మలో కాడు అని తెలుగుదేశం అయితే గత అయిదేళ్లలో రోజుకు పదిసార్లు జోస్యం చెప్పింది. అలాంటిది జగన్ సీఎం అయి కూర్చున్నాడు. మరి ఆయన్ని కాకపోయినా సీటునైనా గౌరవించాలి కదా. అంటే మేము ఆ పని చేయమన్నట్లుగనే విపక్షాల తీరు ఉంది. పవన్ కళ్యాణ్ రాజకీయంగా జూనియర్ కాబట్టి ఉన్న మాటను బయటకే అనేశారు. తాను జగన్ ని సీఎం గా గుర్తించను అంటూ ఆయన అప్పట్లో ఇచ్చిన స్టేటెమెంట్లు మంటను పుట్టించాయి.

జగన్ కి తప్ప…..

ఏపీలో సర్వం సహా జగనే. ఆయన ఆదేశం లేకుండా ఏ ఒక్క పనీ జరగదు. ఆ సంగతి విపక్షలకు బాగా తెలుసు. ఇక ఏపీలో ఏ చిన్న సంఘటన జరిగినా కూడా నేరుగా జగన్ మీదనే విరుచుకుపడిపోయే జాణ‌తనం విపక్షానిది అయినపుడు సమస్యలపైన నేరుగా ఆయనకే లేఖలు కూడా రాయాలి కదా. కానీ తలపండిన చంద్రబాబు ఒక్క జగన్ కి తప్ప అన్నట్లుగా వరసపెట్టి లేఖలు రాస్తున్నారు. ఆయన కేంద్ర హోం మంత్రికి రాస్తారు. మోడీకి, అమిత్ షాకు కూడా రాస్తారు, కానీ ఏపీ సీఎం జగన్ కి మాత్రం లేఖ రాయరు. ఇక ఏపీ గవర్నర్ కి, డీజీపీకి, ప్రధాన కార్యదర్శికి కూడా చంద్రబాబు లేఖలు రాస్తున్నారు. తాను చెప్పాల్సింది అందులో చెబుతున్నారు. కానీ జగన్ ఊసు మాత్రం తలవడం లేదు.

అన్నీ దాటేసి …?

ఇదేమి విడ్డూరమో అర్ధం కాదు, ఏపీ సీఎం గా జగన్ ఉంటే చంద్రబాబు గౌరవించను అంటారు. ఆయనను పట్టుకుని విమర్శలు మాత్రం చేస్తారు. రాష్ట్రాధినేతగా గవర్నర్ చర్యలు తీసుకోవాలని కోరతారు. కేంద్ర పెద్దలు ఏపీ వ్యవహారాలను చక్కదిద్దాలని కూడా అభిలషిస్తారు. మరి తాను ఉన్నపుడు మాత్రం ఏపీలో సీబీఐని రానివ్వరు, కేంద్రం పెత్తనమేంటి అని నిలదీస్తారు. ప్రజల నుంచి ఎన్నుకున్న ప్రభుత్వం ఉంటే గవర్నర్లతో పనేంటి అని లాజిక్కులు తీస్తారు. కానీ జగన్ విషయానికి వచ్చేసరికి మాత్రం ఇవేమీ గుర్తుకు రానట్లుగా బాబు ప్రవర్తించడమే విశేషం అనుకోవాలి.

మారరంతే …?

ఏపీలో అటూ ఇటూ కూడా రాజకీయం అసలు మారడంలేదు. అలా మారాలని ఆశించడం కూడా పొరపాటే అవుతుందేమో. జగన్ రాజకీయంగా జూనియర్ అనుకున్నా సీనియర్ మోస్ట్ నేత చంద్రబాబు అయినా మంచి సంప్రదాయాలను పునరుద్ధరించాలిగా. తాను ముఖ్యమంత్రి సీటుని గౌరవించాలి కదా. అక్కడ జగన్ సీఎం అయినా మరొకరు అయినా కూడా చేసింది కోట్లాది మంది ప్రజలు కదా. మరి జగన్ ని గౌరవించను అంటే ప్రజాభిప్రాయాన్ని కూడా తిరస్కరిస్తున్నట్లే లెక్క కదా. మరో వైపు బీజేపీ నేతలు కూడా జగన్ ని వింత ముఖ్యమంత్రి అంటూ ఎకసెక్కం చేస్తూ టీడీపీ బాటనే సాగుతున్నారు. ఏది ఏమైనా ఏపీలో రాజకీయాలు దారుణంగా తయారయ్యాయి అని మేధావులు అంటున్నారు అంటే తప్పేముంది.

Tags:    

Similar News