అదే జరిగితే.. జగన్ కు తిరుగుండదా?

చంద్రబాబు, జగన్ వ్యూహాలు వేరు వేరుగా ఉన్నాయి. చంద్రబాబు మళ్లీ ఎన్నికల్లో గెలవడానికి ముఖ్యమైన వాటిని పెండింగ్ లో పెడితే, జగన్ మాత్రం వాటిని పూర్తి చేసి [more]

;

Update: 2021-06-18 14:30 GMT

చంద్రబాబు, జగన్ వ్యూహాలు వేరు వేరుగా ఉన్నాయి. చంద్రబాబు మళ్లీ ఎన్నికల్లో గెలవడానికి ముఖ్యమైన వాటిని పెండింగ్ లో పెడితే, జగన్ మాత్రం వాటిని పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారు. జగన్ అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఖచ్చితంగా మరోసారి ఏపీ ప్రజలు వైసీపీ వైపు నిలబడతారన్నది వాస్తవం. అందుకోసమే జగన్ పట్టుబట్టి మరీ లక్ష్యాలను సాధించే పనిలో పడ్డారు. వీటిపైనే ప్రధాన దృష్టి పెట్టారు.

బాబు మాత్రం…?

చంద్రబాబు తన హయాంలో పోలవరం, అమరావతి ప్రాజెక్టులు పూర్తయితే ప్రజలు తన వెంట ఉండరని అంచనా వేసుకున్నారు. అందుకే ఆ ప్రాజెక్టులను ప్రజల్లోనే ఉంచుతూ తిరిగి ఎన్నికలకు వెళ్లారు. అయితే చంద్రబాబు అంచనాలు విఫలమయ్యాయి. ఏపీ ప్రజలు బాబు మాటలను విశ్వసించలేదు. దీంతో జగన్ ఈసారి పనులు పూర్తి చేసి ప్రజల ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందుకోసమే అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు.

పోలవరం ప్రాజెక్టు….

ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి. ఈ ప్రాజెక్టు పూర్తయితే జగన్ కు ప్రజల్లో మంచి పేరు వస్తుంది. తన తండ్రి వైఎస్ ప్రారంభించిన ప్రాజెక్టును తాను పూర్తి చేశానన్న ఖ్యాతి దక్కుతుంది. చంద్రబాబు తరహాలో కూడా తాను ప్రాజెక్టును పూర్తి చేశానని చెప్పుకుని తిరిగి ప్రజల్లోకి వెళ్లే వీలుకలుగుతుంది. అందుకే జగన్ పోలవరం ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. నిధుల కోసం తరచూ ఢిల్లీ వెళుతున్నారు. 2022 చివరినాటికి నీళ్లు ఇవ్వాలన్న లక్ష్యాన్ని జగన్ నిర్దేశించుకున్నారు.

మూడు రాజధానులు….

ఇక మూడు రాజధానులను కూడా త్వరగా పూర్తి చేయాలని జగన్ భావిస్తున్నారు. విశాఖలో పాలనారాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటయితే ప్రజలకు తనపై నమ్మకం కలుగుతుంది. అందుకే త్వరిత గతిన కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేయాలని జగన్ తన ఢిల్లీ పర్యటనలో కేంద్ర పెద్దలను కోరారు. విశాఖలో తాను నేరుగా వెళ్లి పాలనను సాగించే వీలుంది. న్యాయ రాజధాని కోసం కేంద్ర ప్రభుత్వం రీ నోటిఫికేషన్ ను ఇవ్వాల్సి ఉంది. ఇందుకోసం జగన్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. మొత్తం మీద జగన్ ఇచ్చిన హామీలతో పాటు లక్ష్యాలను పూర్తి చేసి తిరిగి ప్రజల ముందుకు వెళ్లాలన్న యోచనలో ఉన్నారు

Tags:    

Similar News