వైసీపీలో ఆ నలుగురు ఎమ్మెల్సీలు వీరేనట?

శాసనమండలిలో ఏ స్థానం ఖాళీ అయినా అది ఖచ్చితంగా వైసీపీ ఖాతాలోనే పడుతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మండలిలో ఖాళీ అయిన ప్రతి పోస్టును వైసీపీ దక్కించుకుంది. [more]

;

Update: 2021-06-11 06:30 GMT

శాసనమండలిలో ఏ స్థానం ఖాళీ అయినా అది ఖచ్చితంగా వైసీపీ ఖాతాలోనే పడుతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మండలిలో ఖాళీ అయిన ప్రతి పోస్టును వైసీపీ దక్కించుకుంది. మరోసారి నాలుగు ఎమ్మెల్సీ పోస్టులు ఖాళీ అయ్యాయి. ఎమ్మెల్యే కోటా, స్థానిక సంస్థల ఎన్నికల కోటా కింద ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అవుతున్నా కరోనా కారణంగా ఎన్నికలు ఇప్పట్లో జరపలేమని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. ఆ కోటాల కింద ఎమ్మెల్సీల ఎంపిక మరికొద్దిరోజులు పట్టే అవకాశముంది.

గవర్నర్ కోటా కింద….

అయితే గవర్నర్ కోటా కింద నామినేట్ అయ్యే వారికి ఎటువంటి ఇబ్బంది లేదు. గవర్నర్ కోటా కింద నలుగురు ఎమ్మెల్సీలను భర్తీ చేయాల్సి ఉంది. ఈరోజు నలుగురు ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేయనున్నారు. టీడీ జనార్థన్, రవిచంద్రయాదవ్, శమంతకమణి, గౌరుగాని శ్రీనివాసులు పదవీ విరమణ చేయనున్నారు. అయితే దీనిపై జగన్ ఒక క్లారిటీకి వచ్చినట్లు సమాచారం. నాలుగు సామాజకవర్గాల నుంచి వీరిని జగన్ ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. పార్టీ విధేయతతో పాటు గతంలో తాను ఇచ్చిన హామీలను కూడా ఈ ఎంపికలో జగన్ పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

అప్పిరెడ్డికి ఖరారు…

గవర్నర్ కు రెండు, మూడు రోజుల్లోనే నలుగురి పేర్లను ప్రభుత్వం పంపే అవకాశముంది. కాపు, బీసీ, ఎస్సీ, రెడ్డి సామాజికవర్గాల నుంచి జగన్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లాకు చెందిన లేళ్ల అప్పిరెడ్డికి ఈసారి ఎమ్మెల్సీ పదవి ఖాయమయిందంటున్నారు. తొలి నుంచి పార్టీని నమ్ముకుని ఉండటమే కాకుండా గత ఎన్నికల్లో సీటును కూడా త్యాగం చేయడంతో ఆయన పేరును జగన్ ఖరారు చేశారంటున్నారు.

తోట త్రిమూర్తుల పేరు…?

ఇక తూర్పు గోదావరి జిల్లాలో బలమైన కాపు సామాజికవర్గం నేతగా ఉన్న తోట త్రిమూర్తులు పేరును జగన్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల తర్వాత తోట త్రిమూర్తులు పార్టీలోకి వచ్చినా భవిష్యత్ లో పార్టీకి ఉపయోగపడతారని భావించి ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారంటున్నారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీని నమ్ముకుని ఏళ్లుగా పనిచేస్తున్న ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మోషేన్ రాజు, పొద్దుటూరు కు చెందిన రమేష్ యాదవ్ పేర్లను ఖారారు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై రెండు, మూడు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశముంది.

Tags:    

Similar News