జగన్ ఉప ఎన్నికలకు రెడీ అవుతున్నారా? మినీ సమరం ఖాయమా?
ఎన్నికలు అంటే అధికారంలో ఉన్న వారు మామూలుగా వద్దు అనుకుంటారు. ఎందుకొచ్చిన తలనొప్పి అని కూడా భావిస్తారు. ఎక్కడైనా తేడా కొడితే మొదటికే మోసం వస్తుందని కూడా [more]
;
ఎన్నికలు అంటే అధికారంలో ఉన్న వారు మామూలుగా వద్దు అనుకుంటారు. ఎందుకొచ్చిన తలనొప్పి అని కూడా భావిస్తారు. ఎక్కడైనా తేడా కొడితే మొదటికే మోసం వస్తుందని కూడా [more]
ఎన్నికలు అంటే అధికారంలో ఉన్న వారు మామూలుగా వద్దు అనుకుంటారు. ఎందుకొచ్చిన తలనొప్పి అని కూడా భావిస్తారు. ఎక్కడైనా తేడా కొడితే మొదటికే మోసం వస్తుందని కూడా ఆలోచిస్తారు. కానీ జగన్ విషయం వేరు. ఆయన పట్టుదలకు మారుపేరు. తనకు నచ్చని వారిని అట్టేపెట్టుకుని కొనసాగడం చికాకు. ఇక తన తప్పు లేకుండా మాటపడడానికి కూడా ఆయన ఇష్టపడరు అంటున్నారు. అందుకే ఏపీలో పెద్ద ఎత్తున ఉప ఎన్నికలకు తెరలేపడానికి జగన్ రంగం సిద్ధం చేశారని తెలుస్తోంది.
ఇదే రీజన్ …?
ఒక దెబ్బ తగిలినపుడే మరో దెబ్బ వేయాలి. టీడీపీ గత రెండేళ్ల పెర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇంకా అలాగే ఉందని లోకల్ బాడీ రిజల్ట్స్ రుజువు చేశాయి. అదే సమయంలో జగన్ పట్ల, ఆయన పాలన పట్ల జనాలు సుముఖంగా ఉన్నారని కూడా తేలిపోయింది. ఈ జోరులోనే టీడీపీకి మరిన్ని షాకులు ఇవ్వాలని జగన్ అనుకుంటున్నారుట. ఏపీలో ఇపుడు నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతు ఇస్తున్నారు. అయితే వారు టెక్నికల్ గా సైకిల్ పార్టీ వారే. పైగా చంద్రబాబు ఈ మధ్య మా ఎమ్మెల్యేలను జగన్ లాగేసుకున్నారంటూ విమర్శలు చేశారు. దాంతో వారిని అధికారికంగా వైసీపీ ఎమ్మెల్యేలుగా చూపించాలన్నది జగన్ పంతంగా ఉందిట.
నోరెత్తకుండానే…?
ఇక ఏపీలో మూడు రాజధానులకు జనం మద్దతు లేదని లోకల్ బాడీ ఎన్నికల ముందు వరకూ టీడీపీ గట్టిగా సౌండ్ చేసేది. లోకల్ బాడీస్ ఫలితాలు చూస్తే అన్ని ప్రాంతాలలో ఏకపక్షంగా వైసీపీ విజయాలను నమోదు చేసింది. దాంతో టీడీపీ ఏమీ అనలేని పరిస్థితి ఉంది. దీంతో ఇపుడు టీడీపీ నుంచి తన వైపు వచ్చిన ఎమ్మెల్యేలను రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలు తేవాలని జగన్ ఆలోచిస్తున్నారుట. విజయవాడ నుంచి వల్లభనేని వంశీ, గుంటూరు నుంచి మద్దల గిరి, ప్రకాశం నుంచి కరణం బలరాం, విశాఖ సౌత్ నుంచి వాసుపల్లి గణేష్ కుమార్ లను ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయిస్తే కచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి. అలాగే విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదిస్తే అక్కడ కూడా ఉప ఎన్నిక ఖాయం
మినీ సమరేమే…?
ఇక నర్సాపురం రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు మీద అనర్హత వేటు వేయిస్తే అక్కడ కూదా ఉప ఎన్నిక అనివార్యం అవుతుంది. కడప జిల్లాలో బద్వేల్ వైసీపీ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య కరోనాతో చనిపోవడంతో ఉప ఎన్నిక ఆరు నెలల వ్యవధిలో రావడం తధ్యం. దాంతో పాటుగానే వీటిని కూడా చేర్చి మొత్తంగా మినీ సమరానికి జగన్ సిద్ధపడాలని అనుకుంటున్నారుట. సహజంగానే అధికార పార్టీగా వైసీపీ కి ఎడ్జి ఉంది. దాంతో పాటు జగన్ పధకాలు కూడా జనంలో ఉన్నాయి. టీడీపీ నుంచి పెద్దగా యాక్టివిటీ లేదు. దాంతో ఈ సీట్లు అన్నీ కూడా వైసీపీ గెలిచి తీరుతుందందని ఆ పార్టీ పెద్దలు అంచనా వేస్తున్నారు. ఈ దెబ్బతో టీడీపీని చిత్తు చేయడమే కాకుండా అటు పార్టీలో రెబెల్స్ నోరు లేవకుండా చూసుకోవడం, ఏపీలో రాజకీయం మొత్తాన్ని అనుకూలం చేసుకోవడమే జగన్ పొలిటికల్ అజెండా అంటున్నారు. మొత్తానికి జగన్ డెసిషన్ తో ఏపీలో పెద్ద ఎత్తున ఉప ఎన్నికలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.