సీనియర్లను పక్కన పెడుతున్నట్లేనా… జగన్ వ్యూహం ఏంటి ?
వైసీపీలో ఏం జరుగుతోంది ? వచ్చే ఎన్నికల నాటికి ఎలాంటి పరిణామాలు ఉంటాయి ? పరిస్థితులు ఎలా మారతాయి ? పార్టీ అధినేత, సీఎం జగన్ వ్యూహం [more]
;
వైసీపీలో ఏం జరుగుతోంది ? వచ్చే ఎన్నికల నాటికి ఎలాంటి పరిణామాలు ఉంటాయి ? పరిస్థితులు ఎలా మారతాయి ? పార్టీ అధినేత, సీఎం జగన్ వ్యూహం [more]
వైసీపీలో ఏం జరుగుతోంది ? వచ్చే ఎన్నికల నాటికి ఎలాంటి పరిణామాలు ఉంటాయి ? పరిస్థితులు ఎలా మారతాయి ? పార్టీ అధినేత, సీఎం జగన్ వ్యూహం ఏంటి ? ఇప్పుడు ఇవే ప్రశ్నలు వైసీపీ నేతల మధ్య ఊగిస లాడుతున్నాయి. దీనికి కారణం.. గడిచిన కొన్నాళ్లుగా.. సీనియర్లను జగన్ పక్కన పెడుతుండడమే. పక్కన పెట్టడం అంటే.. మరీ అంత ప్రాధాన్యం లేకుండా చేయడం కాదు. అలాగని అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం లేదు. పైగా సీనియర్లను చాలా మందిని శాసన మండలికి పంపేస్తున్నారు. మరి కొందరు సీనియర్లకు ప్రయార్టీ లేకపోవడంతో వారంతట వారే సైడ్ అవుతున్నారు.
అనేక మంది సీనియర్లు….
వీరిలో ఫైర్ బ్రాండ్లు కూడా ఉండడం, నియోజకవర్గాలపై పట్టున్న నాయకులు కూడా ఉండడం గమనార్హం. అయినప్పటికీ.. వీరు రాజకీయంగా మూడు దశాబ్దాలుగా చక్రం తిప్పుతున్న వారు కావడంతో జగన్ వారిని పక్కన పెడుతున్నారనే గుసగుస వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. వచ్చే 2024 ఎన్నికలు ప్రతిష్టాత్మకం కానున్నాయి. అంటే.. గత ఎన్నికలకు భిన్నంగా వచ్చే ఎన్నికల్లో జగన్.. వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఒక్క ఛాన్స్ అనే నినాదం వర్కవుట్ కాదు..! జగన్ ఐదేళ్ల పాలనే వచ్చే ఎన్నికల్లో ఆయన సామర్థ్యానికి గీటురాయి.
యువతకే ప్రాధాన్యం….
సో.. ఇప్పటికే జరిగిపోయిన పాలనను చూపించి.. వచ్చే ఎన్నికల్లో తాను విజయం దక్కించుకునేందుకు జగన్ ప్రయత్నించాలి. అదే సమయంలో తనను బలపరిచేందుకు కూడా జగన్.. సరైన నేతలను వెంట నడిపించాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే ఆయన యువతను నమ్ముకుంటున్నారనే వ్యాఖ్యలు తరచుగా వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యం ఇస్తూనే.. సీనియర్లను కేవలం సలహాలు, సూచనల వరకు మాత్రమే పరిమితం చేయనున్నట్టు వైసీపీ వర్గాలే చెపుతున్నాయి. జరుగుతోన్న పరిణామాలు కూడా ఇందుకు నిదర్శనంగానే ఉన్నాయి.
అందుకే వారిని…?
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రుల్లో కూడా చాలా మంది యువనేతలు, రాజకీయంగా మరీ పెద్ద అనుభవం లేని వారే ఎక్కువుగా ఉన్నారు. ఎంపీలు అంతే..! ఈ క్రమంలోనే చాలా మంది సీనియర్లను, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని కూడా జగన్.. ఇటీవల కాలంలో ఖాళీ అవుతున్న శాసన మండలి స్థానాలకు పంపేస్తున్నారు. దీనివల్ల రెండు ప్రయోజనాలు జగన్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకటి.. సీనియర్లకు ప్రాధాన్యం ఇవ్వలేదన్న విమర్శల నుంచి తనకు ఇబ్బందులు తప్పుతాయి. అదే సమయంలో యువతను యాక్టివేట్ చేసుకుని.. వచ్చే ఎన్నికల్లో యువతను ప్రోత్సహించేందుకు జగన్ కు ఇబ్బందులు తొలుగుతాయి. ఈ రెండు పరిణామాలు కూడా జగన్ కలిసి వస్తాయని అంటున్నారు పరిశీలకులు. మరి ఈ వ్యూహం ఏమేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.