జగన్ చరిష్మా చెక్కు చెదరలేదా? ఆ సర్వేలో అదే తేలిందా?
ఏపీ ప్రజలు ప్రతిపక్షాలను పట్టించుకోవడం లేదా ? ప్రభుత్వంపై సానుభూతి కోణంలోనే ఉన్నారా ? అంటే.. ఔననే అంటోంది.. డెమొక్రటిక్ రిఫార్మ్స్ సర్వే..! జగన్ సర్కారు రెండేళ్లు [more]
;
ఏపీ ప్రజలు ప్రతిపక్షాలను పట్టించుకోవడం లేదా ? ప్రభుత్వంపై సానుభూతి కోణంలోనే ఉన్నారా ? అంటే.. ఔననే అంటోంది.. డెమొక్రటిక్ రిఫార్మ్స్ సర్వే..! జగన్ సర్కారు రెండేళ్లు [more]
ఏపీ ప్రజలు ప్రతిపక్షాలను పట్టించుకోవడం లేదా ? ప్రభుత్వంపై సానుభూతి కోణంలోనే ఉన్నారా ? అంటే.. ఔననే అంటోంది.. డెమొక్రటిక్ రిఫార్మ్స్ సర్వే..! జగన్ సర్కారు రెండేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ సంస్థ సర్వే చేసింది. జగన్ పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రతి పక్షాలు పుంజుకున్నాయా? అనే కోణంలో ఈ సర్వే సాగినట్టు రిఫార్మ్స్ సర్వే పేర్కొంది. ఇంకా తుది ఫలితాలు ఇంకా రానప్పటికీ.. ప్రస్తుతానికి ఉన్న అంచనాల ప్రకారం.. జగన్ సర్కారుకు గ్రామీణ ప్రాంత ప్రజల నుంచి పట్టణ, నగరాల్లోని పేద, దిగువ మధ్య తరగతి వర్గం సానుకూలంగా ఉన్నట్టు పేర్కొంది.
సంక్షేమ పథకాలు…
జగన్ అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు.. అటు గ్రామీణ, ఇటు నగరాలు, పట్టణాలలోని ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్నాయని పేర్కొంది. అమ్మ ఒడి, చేయూత, ఇంటింటికే రేషన్, ఇంటింటికీ ఫించన్ వంటి పథకాలు హైలెట్‌గా నిలుస్తున్నాయని తెలిపింది. ప్రస్తుతం తమ సర్వే కొనసాగుతోందని సంస్థ పేర్కొంది. అదేసమయంలో మూడు రాజధానులపై సగం మంది ప్రజలు సానుకూలంగా ఉన్నట్టు తెలిపింది. ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. ఎన్నికలు జరిగి, వైసీపీ సర్కారు ఏర్పడి రెండేళ్లు పూర్తయినా ప్రధాన ప్రతిపక్షాలుగా ఉన్న టీడీపీ, జనసేన, వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలు.. ఎక్కడా పుంజుకోలేదని స్పష్టం చేసింది.
విపక్షాలు పుంజుకోలేదని…?
సర్వేలో పాల్గొన్న వారిలో జనసేన అధినేత పేరు చెబుతున్నా.. ఇతర నాయకుల పేర్లు కానీ, పార్టీ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది ? అనే ప్రశ్నకు కానీ సమాధానం చెప్పలేక పోతున్నారని సర్వే వెల్లడించింది. అదేసమయంలో టీడీపీ అధినేతగా చంద్రబాబును మాత్రమే అంగీకరిస్తామని.. మెజారిటీ ప్రజలు చెప్పడం గమనార్హం. లోకేష్ సహా బాలయ్యను కీలక నేతలుగా ఎక్కువ మంది గుర్తించలేదని.. బాలయ్యపై అభిమానం ఉన్నప్పటికీ.. లోకేష్ విషయానికి వస్తే.. ఈ అభిమానం కూడా తక్కువగానే ఉందని పేర్కొనడం గమనార్హం.
వామపక్షాలు సయితం….
ఇక, వామపక్షాల వైఖరిపై ప్రజల్లో ఒకవిధమైన సందేహాలు నెలకొన్నాయని.. అసలు వామపక్షాలను కానీ, ఆ పార్టీలు చేస్తున్న ఉద్యమాలను కానీ ఎవరూ లెక్కచేయడం లేదని పేర్కొంది. ఇక, కాంగ్రెస్ పరిస్థితి ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నట్టు తెలిపింది. ఈ సర్వే తాలూకు పూర్తి వివరాలను ఆగస్టులో వెల్లడించనున్నట్టు సంస్థ వివరించింది.