జగన్.. తన తండ్రి కల నెరవేరుస్తారా… లేక ఇంతేనా…?
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కల నెరవేర్చడంలో ఏపీ సీఎం జగన్ సఫలీకృతం అయ్యేనా ? తండ్రి బాటలో నడుస్తున్నానని.. తండ్రి ఆశయాలకు అనుగుణంగా అడుగులు వేస్తున్నానని పదే [more]
;
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కల నెరవేర్చడంలో ఏపీ సీఎం జగన్ సఫలీకృతం అయ్యేనా ? తండ్రి బాటలో నడుస్తున్నానని.. తండ్రి ఆశయాలకు అనుగుణంగా అడుగులు వేస్తున్నానని పదే [more]
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కల నెరవేర్చడంలో ఏపీ సీఎం జగన్ సఫలీకృతం అయ్యేనా ? తండ్రి బాటలో నడుస్తున్నానని.. తండ్రి ఆశయాలకు అనుగుణంగా అడుగులు వేస్తున్నానని పదే పదే ప్రకటించే జగన్.. మరి ఆ తండ్రి సాకారం చేసుకోలేక పోయిన.. కలను నెరవేరుస్తారా ? లేక.. చేతులు ఎత్తేస్తారా ? .. ఇదీ వైసీపీ నేతల మధ్య కొన్నాళ్లుగా సాగుతున్న చర్చ. మరి వైఎస్ కల ఏంటి? ఆయన ఎందుకు నెరవేర్చుకోలేక పోయారు.? అనే విషయం చూద్దాం.
ప్లాన్ చేసుకున్న తర్వాత…?
ప్రభుత్వం ఏదైనా.. పాలకుడు ఎవరైనా.. ప్రజలకు చేరువ కావాలని.. మళ్లీ మళ్లీ అధికారంలోకి రావాలని కలలు కనడం సహజం. ఈ క్రమంలోనే వైఎస్ రాజశేఖరరెడ్డి.. రెండోసారి అదికారంలోకి వచ్చిన తర్వాత.. ప్రజలతో మమేకం అయ్యేందుకు.. రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిన జన్మభూమి, ప్రజల వద్దకే పాలన.. వంటి వాటిని డామినేట్ చేసేలా రచ్చబండకు వైఎస్ రెడీ అయ్యారు. ప్రోగ్రామ్ అంతా రెడీ అయి.. రచ్చబండను ప్రారంభించేందుకు వెళ్తున్న సమయంలోనే ప్రమాదవ శాత్తు ఆయన దుర్మరణం పాలయ్యారు.
కరోనా వ్యాప్తితో?
వైఎస్ ఎన్నో ఆశలు పెట్టుకున్న రచ్చబండ కార్యక్రమం ఆగిపోయాక.. తర్వాత వచ్చిన కాంగ్రెస్ సీఎంలు ఎవరూ ముందుకు తీసుకువెళ్లలేక పోయారు. దీంతో వైఎస్ రచ్చబండ కల అలానే నిలిచిపోయింది. ఇక, ఇప్పుడు వైఎస్ వారసుడిగా ఏపీలో అధికారం దక్కించుకున్న జగన్.. తన తండ్రి కల అయిన రచ్చబండను సాకారం చేయాలనే కృత నిశ్చయంతో ఉన్నారు. గత ఏడాది అంటే.. అధికారంలోకి వచ్చిన ఏడెనిమిది నెలల్లోనే రచ్చబండకు రెడీ అయ్యారు. కానీ, అనూహ్యంగా ఆయన ఈ కార్యక్రమానికి రెడీ అవుతున్న సమయంలోనే కరోనా వ్యాపించింది.
రానున్న కాలంలో?
ఇక, ఈ ఏడాదైనా కార్యక్రమం ప్రారంభించేందుకు రెడీ అవుతున్న సమయంలో రెండో వేవ్ వచ్చింది. ఫలితంగా వైఎస్ రచ్చబండ కల ఇప్పటి వరకు నెరవేర్చలేక పోయారు సీఎం జగన్. ఇక, మున్ముందు అయినా.. ఈ కార్యక్రమం అమలవుతుందా? అంటే… సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మూడు రాజధానుల అంశంతోపాటు.. జిల్లాల విభజన, పోలవరం పనులు వంటి అనేక అంశాలతో సీఎం జగన్ బిజీకానున్నారు. మరోవైపు ప్రత్యర్థి పార్టీలు ఆయనను న్యాయపరంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. జగన్‌కు ఎప్పుడూ ఏదో ఒక టెన్షన్ తప్పట్లేదు. ఆయన ప్రజల్లోకి వెళ్లడం కుదరట్లేదు. ఈ నేపథ్యంలో రచ్చబండ కార్యక్రమాన్ని జగన్ ఎప్పటికి సక్సెస్ చేస్తారో చూడాలని వైసీపీ నేతలు గుసగుసలాడుతుండడం గమనార్హం.