ఆయన ప్రధాని అట… జగన్ కి ఓకేనా… ?
రాజకీయాల్లో ఎపుడు ఏం జరుగుతుంది అన్నది ఎవరికీ తెలియదు. నిన్న ఉన్నట్లుగా నేడు ఉండదు, మిత్రులు శత్రువులు అవుతారు. అలాంటి రాజకీయ క్రీడలో మరో అద్భుతం ఆవిష్కృతమవుతుందా [more]
;
రాజకీయాల్లో ఎపుడు ఏం జరుగుతుంది అన్నది ఎవరికీ తెలియదు. నిన్న ఉన్నట్లుగా నేడు ఉండదు, మిత్రులు శత్రువులు అవుతారు. అలాంటి రాజకీయ క్రీడలో మరో అద్భుతం ఆవిష్కృతమవుతుందా [more]
రాజకీయాల్లో ఎపుడు ఏం జరుగుతుంది అన్నది ఎవరికీ తెలియదు. నిన్న ఉన్నట్లుగా నేడు ఉండదు, మిత్రులు శత్రువులు అవుతారు. అలాంటి రాజకీయ క్రీడలో మరో అద్భుతం ఆవిష్కృతమవుతుందా అంటే ఏమో చెప్పలేమనే జవాబు వస్తోంది. కాంగ్రెస్ ఎంపీ గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన జగన్ తరువాత ఆ పార్టీ అధినాయకత్వంలో విభేదించారు. జగన్ ఒక నాయకుడుగా మారడానికి, పోరాటయోధుడుగా జనంలో నానడానికి కాంగ్రెస్ కారణమని అందరికీ తెలిసిందే. ఇక కాంగ్రెస్ అకారణంగా తన పైన సీబీఐ కేసులు బనాయించిందని జగన్ ఇప్పటికీ నమ్ముతారు. అలాంటి కాంగ్రెస్ తో కలలో అయినా కలిసేది లేదన్నది జగన్ మాట.
ప్రశాంత్ వ్యూహంతో…?
దేశంలో నానాటికీ బీజేపీ ఇమేజ్ తగ్గిపోతోంది. మోడీ మాటలను ఇదివరకులా జనాలు నమ్మడంలేదు. దాంతో ఆయన కాలికి బలపం కట్టుకుని తిరిగినా కూడా ఇటీవల అయిదు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ పరాభవం తప్పలేదు. దాంతో వచ్చే ఎన్నికల నాటికి మరింతగా మోడీ ఇమేజ్ పడిపోవడం ఖాయమని విశ్లేషణలు ఉన్నాయి. ఇక మోడీని తన వ్యూహాలతో ఒకనాడు గద్దెనెక్కించిన ప్రశాంత్ కిశోర్ ఇపుడు దేశంలోని విపక్ష పార్టీలను అన్నింటికీ ఒక గూటికి చేర్చే పనిలో పడ్డారు. ఆయన ఏపీలో జగన్ సీఎం కావడానికి తనదైన వ్యూహాలను రచించిన సంగతి తెలిసిందే. ఒక విధంగా జగన్ తో పీకేకి జిగినీ దోస్తీ ఉంది అంటారు.
రెడీయేనా ?
ప్రశాంత్ కిశోర్ వ్యూహకర్తగా ఇకపైన ఉండను అని చెప్పేసినా ఆయన వ్యూహాలు మాత్రం అన్ని పార్టీలకు అవసరమే. ఏపీలో 2024 ఎన్నికల్లో గెలవడానికి మరోమారు ప్రశాంత్ వ్యూహాలనే జగన్ నమ్ముకుంటున్నారు అన్నది కూడా ప్రచారంలో ఉంది. అటువంటి ప్రశాంత్ కిశోర్ మాట అంటే జగన్ కి బాగా గురి అని కూడా చెబుతారు. దేశంలో మరోమారు కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమికి అధికారాన్ని దక్కేలా ఇపుడు ప్రశాంత్ పావులు కదుపుతున్నారు. ఆయన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను తనతో కలుపుకుని పోగలను అని ఆలోచిస్తున్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి ప్రశాంత్ తన బుర్రకు పదును పెడుతున్న వేళ జగన్ ఆయన మాటను వింటారా అన్నదే ఇక్కడ చర్చ.
పరీక్షగానే ….?
జగన్ కి ఇపుడు అసలైన పరీక్ష వచ్చినట్లే. ఎందుకంటే ఒక వైపు ప్రశాంత్ కిషోర్. మరో వైపు బీజేపీ, ఇంకో వైపు బద్ధ విరోధి అనుకుంటున్న రాహుల్ గాంధీ. ఈ నేపధ్యంలో జగన్ ఆలోచనలు ఎలా ఉంటాయి అన్నది కూడా ఎవరూ ఊహించలేరు. జగన్ మనస్తత్వం ఎరిగిన వారు ఆయన ఎప్పటికీ కాంగ్రెస్ లో కలవరు అనే అంటారు. అయితే బీజేపీకి దేశంలో నిండా వ్యతిరేకత కమ్ముకుంటున్న పరిస్థితులో రేపటి రోజున రాజీవ్ గాంధీ నిజంగా ప్రధాని అయితే అపుడు జగన్ సంగతేంటి అన్న ప్రశ్న కూడా ఉంది. పైగా తాను కాదంటే చంద్రబాబు కాంగ్రెస్ కూటమి వైపు మళ్లడానికి రెడీగా ఉంటారు. సో తన పన్నెండేళ్ల కాంగ్రెస్ పగకు పాతరేసి విపక్ష కూటమిలోకి పీకే సూచనల మేరకు జగన్ రావాల్సిందేనా. చూడాలి మరి.