వైసీపీ నేతలకు జగన్ బంపర్ ఆఫర్
జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తుంది. ఇప్పటికీ నామినేటెడ్ పోస్టులు భర్తీ కాలేదు. అనేక మంది వైసీపీ నేతలు నామినేటెడ్ పోస్టుల కోసం కొన్నాళ్లుగా ఎదురు చూస్తున్నారు. [more]
;
జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తుంది. ఇప్పటికీ నామినేటెడ్ పోస్టులు భర్తీ కాలేదు. అనేక మంది వైసీపీ నేతలు నామినేటెడ్ పోస్టుల కోసం కొన్నాళ్లుగా ఎదురు చూస్తున్నారు. [more]
జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తుంది. ఇప్పటికీ నామినేటెడ్ పోస్టులు భర్తీ కాలేదు. అనేక మంది వైసీపీ నేతలు నామినేటెడ్ పోస్టుల కోసం కొన్నాళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు జగన్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దాదాపు 70 కార్పొరేషన్ ల ఛైర్మన్ పదవులు, 840 డైరెక్టర్ పదవులను జగన్ భర్తీ చేయనున్నారు. ఈ మేరకు కసరత్తు పూర్తయిందని, త్వరలోనే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తారన్న ప్రచారం పార్టీలో ఊపందుకుంది.
ఎదురు చూపులు…?
వైసీపీ అధికారంలోకి రావడానికి అనేక మంది కష్టపడ్డారు. కొందరు తమ టిక్కెట్లను త్యాగం చేశారు. కొందరు జగన్ హవాలోనూ ఓటమి పాలయ్యారు. మరికొందరు సీనియర్ నేతలైనా పార్టీ కోసం పనిచేసి ఉన్నారు. వీరందరినీ ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల విషయంలో జగన్ పరిగణనలోకి తీసుకునే అవకాశముంది. నియోజకవర్గాల వారీగా వారి పేర్లను సేకరించే బాధ్యతను జగన్ కీలక నేతలకు అప్పగించినట్లు తెలిసింది.
రెండేళ్లవుతున్నా…?
జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా నామినేటెడ్ పోస్టులు భర్తీ కాకపోవడంతో కొంత అసంతృప్తి నెలకొంది. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయమే ఉండటంతో అనేక మంది తమకు పదవులు దక్కవనే బెంగ పెట్టుకున్నారు. ఇందులో మొన్న ఎన్నికల్లో పోట ీచేసి ఓటమి పాలయిన అభ్యర్థులతో పాటు సీనియర్ నేతలు కూడా ఉన్నారు. రాజకీయ పదవులు లేక వీరు పెద్దగా ప్రజల్లో వెళ్లలేకపోతున్నారు.
పదవుల జాతరతో…?
ఈ నేపథ్యంలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. తొలుత ఎమ్మెల్యేగా పోట ీచేసి ఓటమి పాలయిన వారికి ఈ పోస్టుల విషయంలో తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అలాగే గత ఎన్నికల్లో టిక్కెట్ త్యాగం చేసిన వారికి కూడా నామినేటెడ్ పోస్టులు దక్కనున్నాయి. ఇక డైరెక్టర్ల ఎంపిక పూర్తిగా స్థానిక ఎమ్మెల్యేలకే అప్పగించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద వైసీపీలో పెద్దయెత్తున పదవులు భర్తీ అవుతుండటంతో ఆశావహులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.