వారు తిడితే జగన్ కు అడ్వాంటేజీగా మారదా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టి రెండేళ్లు కావస్తుంది. అయితే ఇప్పటికీ జగన్ కు పాలన చేతకాదని, ఏపీని అప్పుల ఊబిలో నెట్టేశారన్న విమర్శలు విపక్షాలు [more]

;

Update: 2021-06-22 02:00 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టి రెండేళ్లు కావస్తుంది. అయితే ఇప్పటికీ జగన్ కు పాలన చేతకాదని, ఏపీని అప్పుల ఊబిలో నెట్టేశారన్న విమర్శలు విపక్షాలు నుంచి వస్తున్నాయి. దీనికి తోడు జగన్ ను బద్నాం చేయడానికి కాచుక్కూర్చున్న ఒకవర్గం మీడియా తెలంగాణ నేతలను తెచ్చి జగన్ ను తిట్టిపోయిస్తుంది. ఇది జగన్ కు అడ్వాంటేజీగా మారే అవకాశముంది.

బాబు కు అనుకూలంగా….

చంద్రబాబు అధికారం కోల్పోయిన నాటి నుంచి ఫ్రస్టేషన్ లో ఉన్నారు. ప్రజలు తనను ముఖ్యమంత్రిగా చేయకుండా తప్పు చేశారన్న ధోరణిలోనే చంద్రబాబు ఉన్నారు. ఇక ఆయన అనుకూల మీడియా కూడా జగన్ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే వ్యతిరేక ప్రచారం ప్రారంభించింది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ను నిత్యం భుజాన వేసుకుని మోస్తుంది. జగన్ ను ఎవరైనా తిట్టగలిగితే వారికి ఆ మీడియాలో ప్రాధాన్యత మామూలుగా ఉండదు.

తెలంగాణ నేతలతో….

ఇక ఇటీవల కాలంలో తెలంగాణ నేతలయినా సరే జగన్ ను తిడితే చాలు గంటలు గంటలు స్టూడియోలో కూర్చోబెట్టి లైవ్ లు ఇచ్చేస్తున్నారు. ఇటీవల ఆ మీడియాకు గోనె ప్రకాశరావు దొరికినట్లుంది. గోనె ప్రకాశరావు సిన్సియర్ అండ్ సీనియర్ నేత. దానిని ఎవరూ కాదనరు. కానీ ఆయన జగన్ మానసిక పరిస్థితిని విశ్లేషించే మానసిక విశ్లేషకుడిగా ఈ మధ్య మీడియాలో తరచూ కనపడుతున్నారు.

మానసిక విశ్లేషకులుగా మారి…?

వైఎస్ షర్మిల కొత్త పార్టీ దగ్గర నుంచి జగన్ మనస్తత్వం వరకూ గోనె ప్రకాశరావు చేత చెప్పించి జగన్ కు వ్యతిరేక ప్రచారం ఇటీవల మొదలు పెట్టారు. ఇక తెలంగాణలో ఇటీవల పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయిన ఒక నేత తో కూడా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ మీడియా ప్రచారం చేయిస్తుంది. అయితే తెలంగాణ నేతలతో జగన్ ను విమర్శిస్తే అది ఎంత మాత్రం వర్కవుట్ అవుతుందనేది తెలియాల్సి ఉంది. ఇది జగన్ కు అడ్వాంటేజీగా మారుతుందన్న విశ్లేషణలు వైసీపీ అనుకూల మీడియా లో కన్పిస్తుండటం విశేషం.

Tags:    

Similar News