ఆ ఎత్తుగడ అందుకోసమేనా?

జగన్ మీద ఇప్పటి వరకూ పార్టీ మారి వచ్చిన వారికి నమ్మకం లేదు. తమకు పదవులు ఇస్తారన్న గ్యారంటీ లేదు. ఇదే నమ్మకంతో పార్టీ మారి వచ్చిన [more]

;

Update: 2021-06-23 05:00 GMT

జగన్ మీద ఇప్పటి వరకూ పార్టీ మారి వచ్చిన వారికి నమ్మకం లేదు. తమకు పదవులు ఇస్తారన్న గ్యారంటీ లేదు. ఇదే నమ్మకంతో పార్టీ మారి వచ్చిన నేతలు ఉన్నారు. అయితే వరసగా పార్టీ మారి వచ్చిన నేతలకు జగన్ పదవులు ఇస్తుడటంతో భవిష్యత్ లో మరిన్ని చేరికలకు మార్గం సుగమమం అవుతుందని భావిస్తున్నారు. పార్టీ మారి వచ్చినా జగన్ తమను నమ్ముతారన్న విశ్వాసం నేతల్లో కన్పిస్తుంది.

రెండేళ్ల కాలంలో….

జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతుంది. ఈ రెండేళ్ల కాలంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే ఎక్కువగా పదవులు ఇచ్చారు. ప్రధానంగా ఎమ్మెల్సీ పదవుల్లో ఇది స్పష్టంగా కన్పించింది. పండుల రవీంద్రబాబు దగ్గర నుంచి డొక్కా మాణిక్య వరప్రసాద్, పోతుల సునీత, సి. రామచంద్రయ్య, తోట త్రిమూర్తులు వరకూ పార్టీ మారి వచ్చిన వాళ్లే. జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే రామసుబ్బారెడ్డికి కూడా ఎమ్మెల్సీ ఇస్తానని జగన్ ప్రామిస్ చేశారు.

టీడీపీ నుంచి కీలక నేతలు…..

ఈ నేపథ్యంలో ప్రధానంగా వచ్చే ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీ నుంచి కీలక నేతలు వస్తారన్న ప్రచారం జరుగుతుంది. జగన్ ఆ వ్యూహంతోనే ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు ప్రాధాన్యత ఇస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికే గతంలో పార్టీని వీడిపోయిన వారితో పాటు టీడీపీ నేతలు కొందరు వైసీపీలోకి వచ్చేందుకు సుముఖంగా ఉన్నారు. వారందరికీ జగన్ తమకు ప్రయారిటీ ఇస్తారా? లేదా? అన్న అనుమానం ఒకటుండేది.

పార్టీ మారి వచ్చినా?

అయితే ఒకసారి పార్టీ మారి వచ్చిన తర్వాత జగన్ ఖచ్చితంగా ఆదరిస్తారన్న నమ్మకం తోట త్రిమూర్తులను చూసిన తర్వాత కుదిరింది. తనకు నమ్మకంగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ కు ఇష్టం లేకపోయినా తోట త్రిమూర్తులను పార్టీలో చేర్చుకోవడమే కాకుండా ఎమ్మెల్సీ ఇవ్వడాన్ని ఉదాహరణగా చూపుతున్నారు. మరికొంత మంది టీడీపీ నేతలు త్వరలోనే వైసీపీలోకి వచ్చే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు జగన్ పదవులు ఇస్తూ వేసిన ఎత్తుగడ రానున్న కాలంలో చేరికలకు మార్గం

Tags:    

Similar News