జగన్ టార్గెట్ సక్సెస్… చంద్రబాబు సక్సెస్ కాలేకపోయారే ?
యువతకు ప్రాధాన్యం ఇస్తాం.. వారినే పార్టీలో కీలక పదవుల్లో నియమిస్తాం.. అంటూ.. టీడీపీ అధినేత చద్రబాబు పదే పదే చెబుతున్నారు. కానీ, వాస్తవంలోకి వచ్చే సరికి మాత్రం [more]
;
యువతకు ప్రాధాన్యం ఇస్తాం.. వారినే పార్టీలో కీలక పదవుల్లో నియమిస్తాం.. అంటూ.. టీడీపీ అధినేత చద్రబాబు పదే పదే చెబుతున్నారు. కానీ, వాస్తవంలోకి వచ్చే సరికి మాత్రం [more]
యువతకు ప్రాధాన్యం ఇస్తాం.. వారినే పార్టీలో కీలక పదవుల్లో నియమిస్తాం.. అంటూ.. టీడీపీ అధినేత చద్రబాబు పదే పదే చెబుతున్నారు. కానీ, వాస్తవంలోకి వచ్చే సరికి మాత్రం సీనియర్లు, వృద్ధులు, 50 ఏళ్ల పైబడిన వారినే నియమిస్తున్నారు. వారి సలహాలు, సూచనలు తీసుకుంటే.. తన పంథాలో ముందుకు సాగుతున్నారు. దీంతో టీడీపీలో యువతకు ప్రాధాన్యం ఎప్పుడు? అనే ప్రశ్న కొన్నేళ్లుగా అలానే నిలిచిపోయింది. ఇటీవల పలు జిల్లాల్లో పార్లమెంటరీ నియోజకవర్గాల కమిటీలు పూర్తయ్యాయి. ఈ కమిటీలు చూసిన పార్టీ నేతలు నెత్తి నోరు బాదుకుంటున్నారు. ప్రతి కమిటీలో 50 % మంది వృద్ధులే ఉన్నారు.
వచ్చే ఎన్నికల నాటికి….
కానీ, అధికార పార్టీ వైసీపీని తీసుకుంటే.. సీఎం జగన్.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన గత ఎన్నికల్లోనే ఎంపీలు, ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది యువకులకు, ఉన్నత విద్యావంతులకు సీట్లు ఇచ్చి ఎంపీలు, ఎమ్మెల్యేలను చేశారు. ఇక ఇటీవల స్థానిక సంస్థల పదవుల విషయంలోనూ యువత, మహిళలే ఎక్కువుగా ఉండేలా చూసుకున్నారు. ఇక వచ్చే ఎన్నికల నాటికి 55-60 ఏళ్లు దాటిన వారిని పక్కన పెట్టే చర్యలను ఆయన చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.
వృద్ధ వాసనలు లేకుండా…?
అదే సమయంలో మహిళల్లోనూ 50 ఏళ్లలోపు వారే ఎక్కువగా ఉన్నారు. దీంతో వైసీపీలో యువరక్తం ఎక్కువగా నే ఉందనే టాక్ వస్తోంది. ఇక, ఇదే ఫార్ములాను మరింత పెంచి.. పార్టీలో వృద్ధవాసనలు లేకుండా చేసుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. ఇటీవల కాలంలో నామినేటెడ్ పోస్టులను వృద్ధులు, 50 ఏళ్లు పైబడిన వారితోనే ఫిలప్ చేస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల నాటికి యువతకు 75 శాతం టికెట్లు ఇవ్వాలనే వ్యూహాన్ని జగన్ రెడీ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇందులో రెండు కోణాలు ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు.
మాట వినేందుకు…?
ఒకటి యువత అయితే.. ప్రజలతో నేరుగా కనెక్ట్ అయ్యేందుకు ఎలాంటి పరిస్థితి వచ్చినా.. ప్రజలకు అండగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అదేసమయంలో అధినేత జగన్‌ను ఎదరించడం, ఆయన మాటలను లక్ష్య పెట్టకపోవడం అనే ప్రశ్న తలెత్తదు. వారి బెదిరింపులు పనిచేయవు.. వారు అంత సాహసం కూడా చేయరు. ఈ వ్యూహాల నేపథ్యంలో జగన్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే.. చంద్రబాబు మాత్రం ఆదిశగా ఇంకా చర్యలు ప్రారంభించకపోవడంపై పార్టీలో విస్మయం వ్యక్తమవుతోంది. ఆయన కేవలం మాటలు చెపుతూ చేతల్లో మాత్రం పాత పంథాలోనే వెళుతుండడంతో పార్టీ పట్ల యువతతో నిరాశ, నిస్పృహలే వ్యక్తమవుతున్నాయి.