సైలెన్స్ ప్లీజ్… ఏపీ మంత్రుల్లో కొత్త గుబులు ?
ఏపీలోని జగన్ కేబినెట్ మంత్రుల మధ్య ఆసక్తికర చర్చ సాగింది. కొన్ని విషయాలు అంతే.. మనం సైలెంట్ గా ఉండాలి.. ఎవరూ నోరు విప్పొద్దు..! అని సీనియర్ [more]
;
ఏపీలోని జగన్ కేబినెట్ మంత్రుల మధ్య ఆసక్తికర చర్చ సాగింది. కొన్ని విషయాలు అంతే.. మనం సైలెంట్ గా ఉండాలి.. ఎవరూ నోరు విప్పొద్దు..! అని సీనియర్ [more]
ఏపీలోని జగన్ కేబినెట్ మంత్రుల మధ్య ఆసక్తికర చర్చ సాగింది. కొన్ని విషయాలు అంతే.. మనం సైలెంట్ గా ఉండాలి.. ఎవరూ నోరు విప్పొద్దు..! అని సీనియర్ మంత్రులు జూనియర్లకు హితవు పలికారట. దీంతో విషయం కొంత ఆలస్యమైనా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో మంత్రులను మారుస్తారు.. అనేది అందరికీ తెలిసిందే. అయితే.. అది ఎప్పుడు ఉంటుంది.. ఎలా చేస్తారు? ఎవరిని తీసుకుంటారు? అనేది కూడా సస్పెన్స్‌గానే ఉంది. అయితే మరో మూడు, నాలుగు నెలల్లో ఈ మార్పు ఉండడంతో చాలా మంది మంత్రుల్లో ఎక్కడా లేని టెన్షన్, ఆందోళన అయితే నెలకొంది. ఎవరు జగన్ కేబినెట్ ఉంటారు ? ఎవరు అవుట్ అవుతారన్నదానిపై అధికార పార్టీ, ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఒక సమావేశంలో మంత్రులు చర్చించుకున్నారట.
విస్తరణ ఉండకపోవచ్చంటూ…
ఈ క్రమంలో విజయవాడ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు.. నన్ను మార్చేస్తే.. ఎవరిని తీసుకుంటారు? అని సీనియర్ మంత్రిని ఒకరిని అడిగితే.. ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారని తెలిసింది. ఇదే ప్రశ్న మరికొందరు అడగ్గా.. ఆయన ఇదే సమాధానం చెప్పడంతోపాటు.. కొన్ని విషయాలపై సైలెంట్‌గా ఉండాలని.. సీఎం జగన్ మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేమని ఆయన వ్యాఖ్యానించారట. దీనికి కొనసాగింపుగా మరో సీనియర్ మంత్రి మాట్లాడుతూ.. అసలు కేబినెట్ మార్పు ఉండకపోవచ్చు కూడా అనడంతో అక్కడున్నోళ్లు కాస్త షాక్ తిన్నారట.
మంత్రుల వ్యాఖ్యలపై…?
అదేసమయంలో ఇంకో సీనియర్ మంత్రి, జగన్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే సీమకు చెందిన నేత మాట్లాడుతూ.. మీ పని మీరు చేసుకోండి.. మార్పుల గురించి ఇప్పుడే మాట్లాడొద్దు! అని చెప్పుకొచ్చారట. అదేసమయంలో మీడియాతో మాట్లాడేటప్పుడు కొందరు మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలపై సీఎం జగన్ సీరియస్‌గా ఉన్నారని ఆయన చెప్పడం కొసమెరుపు. అయితే.. ఎవరిని ఉద్దేశించి ఇలా వ్యాఖ్యానించారనేది మాత్రం తెలియకపోయినా.. మంత్రుల విషయంలో మాత్రం జగన్ ఏం చేస్తారనేది ఆసక్తిగా మారింది.
ఎవరి లెక్కలు వారివి……
ఇక గోదావరి జిల్లాలకు చెందిన ఓ సీనియర్ మంత్రికి మంత్రి పదవి ఇచ్చేందుకే జగన్‌కు ఇష్టం లేకపోయినా ఆయన చేసిన లాబీయింగ్‌తో ఇవ్వాల్సి వచ్చింది. అదే సామాజిక వర్గం నుంచి జగన్ కోసం ఎన్నో త్యాగాలు చేసిన మరో ఎమ్మెల్యేకు జగన్ రెండున్నరేళ్ల తర్వాత పదవి ఇస్తానని చెప్పారు. అయితే ఇప్పుడు ఈక్వేషన్లు మారడంతో ఆ సీనియర్ మంత్రి తనను మార్చరని చెప్పుకుంటున్నారు. ఏదేమైనా మంత్రి పదవుల్లో మార్పులకు సమయం ముంచుకొస్తోన్న వేళ ఎవరి లెక్కల్లో వారు మునిగి తేలుతున్నారు.