టీడీపీ ఆయువుపట్టే జగన్ టార్గెట్ ?
ఎస్… టీడీపీకి ఆయువుపట్టువు లాంటి ఒక్కో కొమ్మను క్రమక్రమంగా నరికేసుకుంటూ వస్తోన్న జగన్ ఈ రెండేళ్లలో టీడీపీని చావుదెబ్బకొట్టాడు. టీడీపీకి వెన్నుదన్నుగా ఉన్న అనేకానేక కులాలను ఆ [more]
;
ఎస్… టీడీపీకి ఆయువుపట్టువు లాంటి ఒక్కో కొమ్మను క్రమక్రమంగా నరికేసుకుంటూ వస్తోన్న జగన్ ఈ రెండేళ్లలో టీడీపీని చావుదెబ్బకొట్టాడు. టీడీపీకి వెన్నుదన్నుగా ఉన్న అనేకానేక కులాలను ఆ [more]
ఎస్… టీడీపీకి ఆయువుపట్టువు లాంటి ఒక్కో కొమ్మను క్రమక్రమంగా నరికేసుకుంటూ వస్తోన్న జగన్ ఈ రెండేళ్లలో టీడీపీని చావుదెబ్బకొట్టాడు. టీడీపీకి వెన్నుదన్నుగా ఉన్న అనేకానేక కులాలను ఆ పార్టీకి దూరం చేసిన ఆ పార్టీ ఆర్థిక మూలాల మీద దెబ్బకొడుతూ పలువురు కీలక నేతలు, ఫైనాన్షియర్లను కూడా తమ పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు ప్రాంతాల మీద జగన్ దృష్టి పెడుతున్నారు. జగన్‌కు సీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు ఎప్పుడూ కంచుకోటలే. ఇక ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలు టీడీపీకి ఆయువుపట్టు. చంద్రబాబు 2014లో సీఎం కావడానికి కూడా ఈ ప్రాంతం నుంచి వచ్చిన ఓట్లు, సీట్లే కారణం. ఇక ఉత్తరాంధ్రపై జగన్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రత్యేకంగా దృష్టిపెట్టారు.
ఉత్తరాంధ్రలో….
ఇప్పటికే ఉత్తరాంధ్రలో విశాఖ మేయర్ పదవి, అప్పలరాజుకు మంత్రి పదవి, కృష్ణదాస్‌కు డిప్యూటీ సీఎం ఇవ్వడంతోనే కులాల లెక్కలు సరిచేసి టీడీపీని చావుదెబ్బకొట్టాడు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి ఎప్పుడూ వెన్నంటే ఉండే కొన్ని కీలక కులాలు ఆ పార్టీకి దూరం జరుగుతోన్న పరిస్థితి. ఇక రాజధాని వైజాగ్‌కు తరలించే ఎఫెక్ట్ టీడీపీపై మామూలుగా లేదు. ఇక ఇప్పుడు టీడీపీకి బలంగా కొమ్ము కాస్తోన్న కోస్తా జిల్లాలపై జగన్ గురిపెట్టినట్టే కనిపిస్తోంది. గోదావరి జిల్లాలు టీడీపీ ఆవిర్భావం నుంచే ఆ పార్టీకి కంచుకోటలుగా ఉంటున్నాయి. గత ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లోనూ టీడీపీ కేవలం ఆరు సీట్లకే పరిమితం అయ్యింది.
కీలక నేతలను చేర్చుకుని….
వచ్చే ఎన్నికల్లోనూ ఇక్కడ తమ బలం నిలుపుకునేందుకు జగన్ టీడీపీకి చెందిన కీలక నేతలను తమ పార్టీలో చేర్చేసుకున్నారు. కులాల వారీగా ఈ రెండు జిల్లాల్లో పలువురు నేతలకు పదవులు ఇస్తున్నారు. బీసీ, ఎస్సీ, కాపు వర్గాలకు తిరుగులేని ప్రయార్టీ ఇస్తున్నారు. బీసీల్లో పిల్లి బోస్‌కు మంత్రి పదవి ఇచ్చారు. ఆ తర్వాత ఆయన్ను ఏకంగా రాజ్యసభకు పంపారు. మరో బీసీ ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుకు మంత్రి పదవి ఇచ్చారు. కాపుల్లో కురసాల కన్నబాబు మంత్రిగా ఉన్నారు. ఇక టీడీపీలో బలమైన కాపు నేతగా ఉన్న తోట త్రిమూర్తులు ఆ పార్టీలో ఓడినా కూడా వైసీపీలోకి తీసుకుని రెండు కీలక పదవులు కట్టబెట్టారు.
గోదావరి జిల్లాల్లో….
అమలాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్ష పదవితో పాటు ఇప్పుడు ఏకంగా జగన్ ఎమ్మెల్సీ ఇచ్చారు. తోటకు ఎమ్మెల్సీ ఇవ్వడం కాపుల్లో వైసీపీకి చాలా ప్లస్ అయ్యేలా ఉంది. ఇక ఈ రెండు జిల్లాలో ఇద్దరు ఎస్సీలకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లాలో అమలాపురం మాజీ ఎంపీ పండుల రవీంద్ర ఎన్నికలకు ముందే వైసీపీలోకి వచ్చారు. ( టెక్నికల్‌గా పండులది పశ్చిమగోదావరి జిల్లాయే) ఆయనకు కొద్ది రోజుల క్రిందటే ఎమ్మెల్సీ ఇచ్చిన జగన్.. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కొయ్యే మోషేన్‌రాజుకు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇలా ఈ రెండు జిల్లాలో కాపు, బీసీ, ఎస్సీ నేతలకు జగన్ తిరుగులేని ప్రయార్టీతో పాటు పదవులు ఇస్తూ పార్టీని తిరుగులేని విధంగా పటిష్టం చేసుకుంటున్నారు. ఈ పరిణామాలు గమనిస్తోన్న రాజకీయ వర్గాలు జగన్ టీడీపీ ఆయువుపట్టుపై గురిపెట్టి కొట్టేస్తున్నారనే అంటున్నారు.