సీఎం జగన్‌పై సీనియర్ల గుర్రు.. రీజన్ ఇదేనా..?
ఏపీ సీఎం జగన్‌పై ఆ పార్టీ సీనియర్లు గుర్రుగా ఉన్నారు. చాలా మంది నేతలు.. సీఎం జగన్ వైఖరిపై విస్తు పోతున్నారు. “మేం ఎన్నో త్యాగాలు చేశాం. [more]
;
ఏపీ సీఎం జగన్‌పై ఆ పార్టీ సీనియర్లు గుర్రుగా ఉన్నారు. చాలా మంది నేతలు.. సీఎం జగన్ వైఖరిపై విస్తు పోతున్నారు. “మేం ఎన్నో త్యాగాలు చేశాం. [more]
ఏపీ సీఎం జగన్‌పై ఆ పార్టీ సీనియర్లు గుర్రుగా ఉన్నారు. చాలా మంది నేతలు.. సీఎం జగన్ వైఖరిపై విస్తు పోతున్నారు. “మేం ఎన్నో త్యాగాలు చేశాం. మాకు మిగిలింది ఏంటి?.. జెండాలు.. కర్రలేనా?“ అని ఒకింత దూకుడుగానే మాట్లాడుతున్నారు. ఇటీవల కాలంలో జగన్.. పార్టీలు మారిన వారికి పదవులు ఇస్తున్నారు. గత ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు టీడీపీ నుంచి వచ్చిన వారిలో నలుగురికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు. డొక్కా మాణిక్య వరప్రసాద్, పోతుల సునీత, పండుల రవీంద్రబాబు తాజాగా తోట త్రిమూర్తులుకు జగన్ ఎమ్మెల్సీ ఇచ్చారు.
గుర్తింపు కూడా…?
అయితే.. వైసీపీలోనే ఉన్న సీనియర్లకుఅన్యాయం చేస్తున్నారనే వాదన కొన్నాళ్లుగా వినిపిస్తోంది. మేం ఎంతో కష్ట పడ్డాం. జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగాం. మేం పోటీ చేయాలను కున్న స్థానాలను కూడా జగన్ ఆదేశించారనే వదులుకున్నాం. కానీ, ఇప్పుడు మాకు మిగిలింది ఏమిటి? కనీసం మాకు ఎలాంటి గుర్తింపు కూడా లేదు. గతంలో టీడీపీ ప్రభుత్వం.. ఆయా నియోజకవర్గాల్లో ఓడిపోయిన నేతలకు కూడా నిధులు ఇచ్చారు. నియోజకవర్గాల నిధులు అందుబాటులో ఉంచారు. అయితే..వైసీపీలో మాత్రం ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పుడు ప్రజల్లోకి ఎలా వెళ్లాలి? వచ్చే ఎన్నికల్లో ప్రజలను ఎలా కలవాలి ? అసలు మేం ఉన్నామని జగన్ మరిచిపోయారా? లేక ఉద్దేశ పూర్వకంగానే చేస్తున్నారా? అనేది వీరు సంధిస్తున్న ప్రశ్నలు.
వైసీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలకు…
విచిత్రం ఏంటంటే టీడీపీలో గెలిచి వైసీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలకు కూడా జగన్ బాగానే నిధులు ఇస్తున్నారట. ఆ నియోజకవర్గాల్లో వారు అడిగిన పనులకు వెంటనే నిధులు మంజూరు అయిపోతున్నాయి. వారి పనులు ఎక్కడా ఆగడం లేదు. కానీ వైసీపీ నుంచి రెండు, మూడు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ లేని దుస్థితి. వారు ఎవరిని అయినా పదవులకు సిఫార్సు చేసినా దిక్కూ దివాణం ఉండడం లేదట. అయితే.. కొందరు మాత్రం సలహాదారులకు క్లోజ్‌గా ఉండేవారికే పదవులు దక్కుతున్నాయా ? అనేసందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. పదవులు పొందుతున్న వారంతా.. సలహాదారులకు క్లోజ్‌గా ఉన్నవారే కావడం గమనార్హం. అలాగే సలహాదారులకు క్లోజ్‌గా ఉన్న ఎమ్మెల్యేలకు కూడా పనులు బాగానే అవుతున్నాయట. ఏదేమైనా వైసీపీ కీలక నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నది వాస్తవం.