ఆయన వస్తే చేర్చుకోవడానికి రెడీ అట… ?
జగన్ పార్టీ కిక్కిరిసిపోయి ఉంది. లోపల ఉన్న వారు చోటు చాలక నానా అవస్థలు పడుతున్నారు. 150 మంది ఎమ్మెల్యేలు, 20 మంది దాకా ఎమ్మెల్సీలు, 28 [more]
;
జగన్ పార్టీ కిక్కిరిసిపోయి ఉంది. లోపల ఉన్న వారు చోటు చాలక నానా అవస్థలు పడుతున్నారు. 150 మంది ఎమ్మెల్యేలు, 20 మంది దాకా ఎమ్మెల్సీలు, 28 [more]
జగన్ పార్టీ కిక్కిరిసిపోయి ఉంది. లోపల ఉన్న వారు చోటు చాలక నానా అవస్థలు పడుతున్నారు. 150 మంది ఎమ్మెల్యేలు, 20 మంది దాకా ఎమ్మెల్సీలు, 28 మంది ఎంపీలు మరి ఇంత పెద్ద బలగం ఉన్నా కూడా జగన్ కి సొంత పార్టీ వారి కంటే బయట వారి మీదనే మోజు ఉందా. వారు పార్టీలోకి రావాలని గేలం వేస్తున్నారా అంటే సమాధానం అవును అనే వస్తోంది. వైసీపీ అధినేత ఈ రోజు కోసమే కాదు, రేపటి కోసం కూడా కొత్త ఆలోచనలు చేస్తున్నారు. అందులో భాగమే ఆయన వైసీపీలోకి ఇతర పార్టీల నేతలకు ఆహ్వానం పలకడం అంటున్నారు.
తూర్పులో మార్పు …..
కేంద్రంలో కీలకమైన రక్షణ శాఖ మంత్రిగా పనిచేసిన సీనియర్ కాంగ్రెస్ నేత పల్లం రాజు మీద జగన్ దృష్టి ఉందిట. కాకినాడ నుంచి ఆయన లోక్ సభకు పలుమార్లు ఎంపీగా నెగ్గారు. కేంద్రంలో కీలకంగా వ్యవహరించారు. విభజన తరువాత ఆయన హవా తగ్గిపోయింది. అయినా సరే ఆయనకు సొంత బలం ఉంది. మంచి పేరు జనంలో ఉంది. అందుకే ఆయన్ని వైసీపీలోకి తీసుకురావాలని జగన్ భావిస్తున్నారుట. కాంగ్రెస్ కి దేశంలోనే పెద్ద ఊపు కనిపించడంలేదు. ఇక ఏపీలో ఆ పార్టీ ఎత్తిగిల్లుతుందన్న ఆశలు కూడా ఎవరికీ లేవు. దాంతో వచ్చే ఎన్నికల నాటికి యాక్టివ్ గా మారాలని పల్లం రాజు అనుకుంటే కాంగ్రెస్ కి విడాకులు ఇవ్వడమే ఏకైక మార్గమని అంటున్నారు.
ఆ కార్డుతో ….
బలమైన కాపు సామాజికవర్గం నేతగా పల్లం రాజు ఉన్నారు. ఆయన కనుక పార్టీలో చేరితే రాజ్యసభకు పంపించాలన్నది జగన్ ఆలోచనట. ఆయనకు కేంద్రంలో మంచి పలుకుబడి ఉందని, దాన్ని వాడుకోవాలని కూడా జగన్ ఆలోచన చేస్తున్నారు అంటున్నారు. కేంద్రంలో వైసీపీకి ఎంపీలు భారీ సంఖ్యలో ఉన్నా వారెవరూ ఢిల్లీ వ్యవహారాలను సరిగ్గా డీల్ చేయలేకపోతున్నారుట. దాంతో జగన్ పల్లం రాజుకు గేలం వేస్తున్నారు అంటున్నారు. అదొక్కటే కారణం కాదు, 2024లో జరిగే ఎన్నికలలో గోదావరి జిల్లాలు వైసీపీకి కీలకం. కాపుల ఓట్లు కూడా చాలా ముఖ్యం. అందువల్ల దశాబ్దాల కాలంగా తూర్పు రాజకీయాల్లో పాతుకుపోయిన పల్లం రాజు లాంటి వారిని వైసీపీలో చేర్చుకుంటే అది పార్టీకి ప్లస్ అవుతుంది అంటున్నారు.
ఆయన ఓకేనా …?
ఇక పల్లం రాజు విషయం తీసుకుంటే ఆయన కూడా కాంగ్రెస్ లో చురుకుగా లేరు. పైగా పార్టీ పరిస్థితిని అంచనా కడుతున్న ఆయన భవిష్యత్తు గురించి సీరియస్ గానే ఆలోచన చేస్తున్నారు అంటున్నారు. ఆయన్ని పీసీసీ చీఫ్ గా చేస్తామని అధినాయకత్వం చెప్పినా నో అని చెప్పడం వెనక కూడా ఏపీలో ఆ పార్టీకి ఫ్యూచర్ కష్టమన్న అంచనాలే అని చెబుతారు. ఈ మధ్యన ఆయన జగన్ పార్టీ విషయంలో సానుకూలంగా ఉన్నారని కూడా ప్రచారం సాగుతోంది. ఆయన వస్తే చేర్చుకునేందుకు జగన్ రెడీగా కూడా ఉన్నారు. దాంతో అన్నీ అనుకూలిస్తే ఈ కాంగ్రెస్ బిగ్ షాట్ వైసీపీలో కనిపించడం ఖాయమేనని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
.