జగన్ క్యారెక్టరే కరెక్టేనేమో…?
రాజకీయాల్లో ఒక్కోసారి మౌనంగా ఉండటమే కలసి వస్తుంది. ఇప్పుడు నీటి వివాదాలు కూడా ఏపీ ప్రభుత్వ పెద్దలు సెలెంట్ గా ఉండటం చర్చనీయాంశమైనా అది పార్టీ పరంగా [more]
;
రాజకీయాల్లో ఒక్కోసారి మౌనంగా ఉండటమే కలసి వస్తుంది. ఇప్పుడు నీటి వివాదాలు కూడా ఏపీ ప్రభుత్వ పెద్దలు సెలెంట్ గా ఉండటం చర్చనీయాంశమైనా అది పార్టీ పరంగా [more]
రాజకీయాల్లో ఒక్కోసారి మౌనంగా ఉండటమే కలసి వస్తుంది. ఇప్పుడు నీటి వివాదాలు కూడా ఏపీ ప్రభుత్వ పెద్దలు సెలెంట్ గా ఉండటం చర్చనీయాంశమైనా అది పార్టీ పరంగా ఉపయోగం ఉంటుందంటున్నారు. గత రెండేళ్లుగా జగన్ మౌనంగానే ఉంటున్నారు. ఆయన పెద్దగా బయటకు వచ్చి మాట్లాడింది లేదు. కోవిడ్ తొలిదశలో ఒక్కసారి మీడియా సమావేశం పెట్టారు. తాను చెప్పదలచుకున్నవి సభల్లోకాని, వీడియో కాన్ఫరెన్స్ లలో కాని జగన్ చెబుతున్నారు.
తెలంగాణ నేతలు…..
ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ నేతలు మాటల దాడి చేస్తున్నారు. అయినా జగన్ నుంచి కానీ వైసీపీ నేతల నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. తొలినాళ్లలో రోజా, శ్రీకాంత్ వంటి వారు కొంత కౌంటర్ ఇచ్చినా తర్వాత వారిని కూడా కట్టడి చేసినట్లే కనపడుతుంది. ఈ విషయంలో జగన్ వ్యూహాత్మకంగానే వెళుతున్నట్లు కన్పిస్తుంది. తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆంధ్రప్రజల నుద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పద మయ్యాయి.
వ్యక్తిగత దూషణలకు…..
దీంతోపాటు వైఎస్ జగన్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి లను వ్యక్తిగతంగా దూషించడం, దొంగ, గజదొంగలుగా చిత్రీకరించడం పట్ల కూడా ఏపీ ప్రజల్లో కొంత ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉమ్మడి రాష్ట్రాలన్ని విభజించడమే కాకుండా, ఇప్పుడు రాయలసీమ ప్రయోజనాలకు జగన్ పాటుపడుతుంటే తెలంగాణ నేతల అభ్యంతరమేంటని ఏపీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అంటే ఏపీ ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి అండగా ఉన్నారు. ఇది చాలదు.
తన పని తాను చేసుకుపోతూ…
అందుకే వైసీపీ నేతలు తెలంగాణ నేతలు ఏం మాట్లాడినా సంయమనం పాటిస్తున్నారు. దీనివల్ల పార్టీపైనా, ప్రభుత్వంపైనా సానుభూతి పెరుగుతుందన్న అంచనాలో ఉన్నారు. అందుకే తెలంగాణ నేతలు ఎంత రెచ్చిపోతున్నా జగన్ సయితం ఎటువంటి కామెంట్స్ చేయడం లేదు. తాను చేయాల్సిన పనిని చేస్తున్నారు. ఏదైనా అభ్యంతరం ఉంటే లేఖల ద్వారా తెలపాలని అధికారులకు జగన్ సూచించారు. నేతలకు కూడా జల వివాదంపై ఆచితూచి మాట్లాడాలని, అభ్యంతరకర వ్యాఖ్యలు చేయవద్దని జగన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ప్రజల్లో ఈ వివాదం ఎక్కువ కాలం నలగాలి. జగన్ కు కావాల్సిందీ అదే.