నాడు వైఎస్.. నేడు జగన్.. సేమ్ టు సేమ్ కష్టాలు
ఔను.. ఏపీ రాజకీయాలను గమనిస్తున్న వారు ఇదే చెబుతున్నారు. గతంలో కాంగ్రెస్ నేత, ఉమ్మడి ఏపీ సీఎంగా రికార్డు సృష్టించిన దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి.. ప్రస్తుత ఏపీ [more]
ఔను.. ఏపీ రాజకీయాలను గమనిస్తున్న వారు ఇదే చెబుతున్నారు. గతంలో కాంగ్రెస్ నేత, ఉమ్మడి ఏపీ సీఎంగా రికార్డు సృష్టించిన దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి.. ప్రస్తుత ఏపీ [more]
ఔను.. ఏపీ రాజకీయాలను గమనిస్తున్న వారు ఇదే చెబుతున్నారు. గతంలో కాంగ్రెస్ నేత, ఉమ్మడి ఏపీ సీఎంగా రికార్డు సృష్టించిన దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి.. ప్రస్తుత ఏపీ సీఎం జగన్.. సేమ్ టు సేమ్.. ఒకే సమస్య ఎదుర్కొంటున్నారని అంటున్నారు విశ్లేషకులు. నాడు పాదయాత్ర చేసి.. కాంగ్రెస్ పార్టీని ఉమ్మడి ఏపీలో అధికారంలోకి తీసుకువచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డికి ప్రజలు పగ్గాలు అప్పగించారు. కానీ, ఆయనను రాజకీయంగా టార్గెట్ చేయలేని కొన్ని ప్రతిపక్షాలు.. వ్యవస్థలను అడ్డు పెట్టుకుని.. అడుగడుగునా ఆటంకాలు కలిగించాయి.
న్యాయపరమైన అడ్డంకులు….
వైఎస్ ఏ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా.. వెంటనే ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నేతలు.. కోర్టులకు వెళ్లి.. న్యాయపరంగా అడ్డంకులు సృష్టించారు. పలితంగా ప్రజల సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాలు చాలా వరకు ఆగిపోయాయి. ఈ క్రమంలోనే పోలవరం.. సహా అనేక ప్రాజెక్టులు ఆగిపోయాయి. అంటే.. ప్రజల నుంచి అభిమానం చూరగొన్న నేతలను అదే ప్రజల ద్వారా ఎదుర్కొన వలసిన.. ప్రజల్లో అభిమానం సంపాయించుకుని.. ప్రతిపక్షంగా గెలవాల్సిన నేతలు.. న్యాయవ్యవస్థలను.. కేంద్రంలోని పెద్దలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం.. అప్పట్లో వివాదం అయింది. అయినా.. రాజశేఖరరెడ్డి మొండిగా ముందుకు సాగారు.
అడుగడుగునా….?
ఇక, ఇప్పుడు జగన్ పాలన విషయాన్ని చూస్తే.. సేమ్ టు సేమ్. అప్పటి టీడీపీ ప్రతిపక్ష నేతే ఇప్పుడు కూడా .. జగన్ పాలనకు అడుగడుగునా అడ్డుతగులుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏ కార్యక్రమం చేపట్టినా.. వ్యవస్థలను అడ్డు పెట్టుకుని లేఖలు రాయించి.. సదరు కార్యక్రమాలను అడ్డుకోవడం పరిపాటిగా మారింది. తాజాగా జగన్ కుటుంబానికి చెందిన సరస్వతి సిమెంట్స్ సంస్థక గనుల లీజు విషయంలో ఇప్పటికే సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును టీడీపీ కనుసన్నల్లోనే వైసీపీకి చెందిన ఓ అసంతృప్త నేత హైకోర్టులో సవాల్ చేశారని పెద్ద ఎత్తున పొలిటికల్ సర్కిళ్లలో ప్రచారం సాగుతోంది.
వ్యవస్థలను అడ్డం పెట్టుకుని…..
అదే సమయంలో.. జగన్‌ను ఆర్థికంగా దెబ్బతీసేలా.. ఆయనపై ఉన్న కేసులను తవ్వితీసే ఉద్దేశంతోను ప్రతిపక్షం వ్యవహరిస్తోందనే వాదన వినిపిస్తోంది. ఏదైనా.. ఉంటే రాజకీయంగా చూసుకోవాలి. కానీ, వ్యవస్థలను అడ్డుపెట్టుకుని.. అధికారం చేజిక్కించుకు నేందుకు ప్రయత్నించడం ఏమేరకు సమంజసం అంటున్నారు పరిశీలకులు. ఇక, జగన్ మాత్రం తన తండ్రి బాటలో ప్రజలను నమ్ముకున్నారని.. ఆయన ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటున్నారని.. రాజకీయం అంటే.. ఇదేనని అంటున్నారు. కానీ, ప్రతిపక్షం ప్రజా మద్దతు కోల్పోయి.. వ్యవస్థలను అడ్డుపెట్టుకుని.. ఎదగాలని ప్రయత్నించడం.. ప్రజాస్వామ్యంలో ఇదేనని చెబుతున్నారు.