జగన్ వీక్‌నెస్‌తోనే బీజేపీ రాజకీయం….?
రాజకీయాలంటేనే ప్రజల నుంచి సానుభూతిని, ప్రత్యర్థుల నుంచి వీక్‌నెస్ ను కోరుకుంటాయి. ఇదే ఇప్పుడు బీజేపీకి వరంగా మారితే.. జగన్‌కు ఇబ్బందిగా పరిణమించింది. కేంద్రంలోని బీజేపీ పెద్దలతో [more]
;
రాజకీయాలంటేనే ప్రజల నుంచి సానుభూతిని, ప్రత్యర్థుల నుంచి వీక్‌నెస్ ను కోరుకుంటాయి. ఇదే ఇప్పుడు బీజేపీకి వరంగా మారితే.. జగన్‌కు ఇబ్బందిగా పరిణమించింది. కేంద్రంలోని బీజేపీ పెద్దలతో [more]
రాజకీయాలంటేనే ప్రజల నుంచి సానుభూతిని, ప్రత్యర్థుల నుంచి వీక్‌నెస్ ను కోరుకుంటాయి. ఇదే ఇప్పుడు బీజేపీకి వరంగా మారితే.. జగన్‌కు ఇబ్బందిగా పరిణమించింది. కేంద్రంలోని బీజేపీ పెద్దలతో అత్యంత సఖ్యతగా ఉంటున్న జగన్.. ఇలా ఎందుకు ఉంటున్నారో.. తెలియంది కాదు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి బీజేపీని లౌక్యంగా తప్పించి.. తనకు పరోక్షంగా ఆ పార్టీని తిప్పుకోవడంలో ఆయన సక్సెస్ అయ్యారని అంటారు పరిశీలకులు. అంటే.. బీజేపీ తెరచాటు సహకారంతోనే జగన్ ఏపీలో పాగా వేసి.. బలమైన చంద్రబాబును పక్కకు నెట్టారన్న చర్చ జాతీయ స్థాయిలోనే ఉంది. ఈ క్రమంలోనే కేంద్రానికి ఎప్పుడు అవసరం వచ్చినా.. జగన్ నేనున్నాను అంటూ రెడీ అవుతున్నారు.
కేంద్రం మాత్రం….
అయితే.. కేంద్రం మాత్రం ఆశించిన విధంగా స్పందించడం లేదు. ప్రత్యేక హోదా సహా.. పోలవరం నిధులు, వెనుక బడిన జిల్లాల నిధులు… ఎంపీ రఘురామ బర్తరఫ్.. వంటి అనేక కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరిస్తోంది. దీనికి కారణం.. జగన్‌పై పట్టు పెంచుకోవాలనే బీజేపీ వ్యూహమే. కేంద్రంతో ఎంత సఖ్యతగా ఉన్నప్పటికీ.. రాష్ట్రంలో బీజేపీ నేతలను జగన్ చాలా దూరమే పెడుతున్నారు. విమర్శించడం లేదు.. అలాగని.. ప్రాధాన్యం ఇవ్వడం లేదు. అంటే.. మొత్తంగా.. కేంద్రం గ్రిప్‌లో ఉన్నారే తప్ప.. రాష్ట్ర బీజేపీ నేతలకు జగన్ అందడం లేదు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో అయినా.. బీజేపీ ఏపీలో పుంజుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
కటీఫ్ చేసుకోవాలనుకున్నా….
ఈ నేపథ్యంలోనే జగన్‌ను తన అదుపులో పెట్టుకోకపోతే.. కష్టమనే భావనలో బీజేపీ ఉంది. ఇక, తమకు ఏమాత్రం సహకరించని.. బీజేపీతో కటీఫ్ చేసుకునేందుకు వైసీపీ రెడీ అవుతున్నా.. జగన్ పెట్టుకున్న 30 ఏళ్ల సీఎం పీఠం లక్ష్యం చెరిగిపోయే ప్రమాదం ఉంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అవకాశం ఇస్తే.. ఆ పార్టీతో కలిసి పనిచేసేందుకు టీడీపీ రెడీగా ఉంది. ఇక వీరిద్దరినీ కలిపేందుకు జనసేన కూడా సిద్ధంగానే ఉంది. రాష్ట్ర బీజేపీ నేతలు కూడా.. ఏదో విధంగా పరువు నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
కాదంటే…?
ఈ క్రమంలో టీడీపీకి మద్దతు ఇచ్చేందుకు చాలా మంది బీజేపీ నేతలు రెడీగానే ఉన్నారు. అంటే.. మొత్తంగా.. కేంద్రంలోని బీజేపీని కాదంటే.. జగన్‌కు ఫ్యూచర్ దాదాపు కష్టమే.. అనే భావన వ్యక్తమవుతోంది. చంద్రబాబు బీజేపీతో పెట్టుకుని రాజకీయంగా ఎలా పతనావస్థకు చేరుకున్నారో .. రేపు జగన్‌కు అదే పరిస్థితి పునరావృతం అవుతుందన్న వారే ఎక్కువ మంది ఉన్నారు. ఇక జగన్ బలహీనతల నేపథ్యంలో బీజేపీ.. ఒడుపుగా జగన్‌ను తన పరిధిలో పెట్టుకుందని అంటున్నారు పరిశీలకులు.