శ్రీవారి నిధుల రగడ.. మరోసారి తెరమీదికి వస్తుందా..?
తిరుమల తిరుపతి దేవస్థానం.. మరోసారి వార్తల్లోకి వచ్చింది. కోనేటిరాయుడికి సంబంధించిన ఆస్తులు, ఆయన ఆదాయ వ్యవహా రాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం రెండేళ్లు పూర్తి చేసుకున్న [more]
;
తిరుమల తిరుపతి దేవస్థానం.. మరోసారి వార్తల్లోకి వచ్చింది. కోనేటిరాయుడికి సంబంధించిన ఆస్తులు, ఆయన ఆదాయ వ్యవహా రాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం రెండేళ్లు పూర్తి చేసుకున్న [more]
తిరుమల తిరుపతి దేవస్థానం.. మరోసారి వార్తల్లోకి వచ్చింది. కోనేటిరాయుడికి సంబంధించిన ఆస్తులు, ఆయన ఆదాయ వ్యవహా రాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం రెండేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో టీటీడీ బోర్డును ప్రభుత్వం రద్దు చేసింది. వాస్తవానికి మరో ఆరు మాసాలైనా పొడిగిస్తారని.. అందరూ అనుకున్నారు. పైగా బోర్డు చైర్మన్‌గా జగన్ చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డే ఉన్నందున.. ఖచ్చితంగా పొడిగింపు ఉంటుందని భావించారు. కానీ, అలా లేకపోగా.. సమయం గడవగానే వెంటనే రద్దు చేసేశారు. ఇక, ఇది జరిగిన నిముషాల వ్యవధిలోనే.. స్పెసిఫైడ్ అధారిటీని ఏర్పాటు చేస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది.
అందుకే అనుమానాలు….
ఈ పరిణామమే తీవ్ర వివాదానికి, అనేక అనుమానాలకు అవకాశం కల్పించింది. స్పెసిఫైడ్ అథారిటీలోనూ సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితులుగా ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అధికారులే ఉండడం కూడా ప్రతిపక్షాలకు మరింత అవకాశం చిక్కినట్టయింది. ప్రస్తుత ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో.. ధర్మారెడ్డిలను స్పెసిఫైడ్ అథారిటీగా నియమిస్తూ.. జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మొత్తం వ్యవహారం వెనుక.. ఆగమేఘాలపై 'అనుకున్నది'చేసేలా ప్రభుత్వం అడుగులు వేస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గతంలో ఒక వ్యవహారం వెలుగు చూసింది. తిరుమల శ్రీవారికి ఉన్న వేల కోట్ల ఆస్తులను.. ముఖ్యంగా నగదు డిపాజిట్లను వెనక్కి తీసుకుని.. ప్రభుత్వానికి బాండ్ల (సెక్యూరిటీస్) రూపంలో ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చింది.
అప్పుడు వెనక్కు తగ్గి…..
అయితే.. దీనిపై ఊరూవాడా గగ్గోలు పుట్టడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇక, ఇప్పుడు మళ్లీ ఈ విషయం మీదే.. ప్రభుత్వం.. కీలక 'కసరత్తు' చేసిందనే వాదన జోరుగా వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వానికి నిధుల అవసరం ఎంతో ఉంది. ఎక్కడికక్కడ చేస్తున్న అప్పులు సంక్షేమానికి సరిపోవడం లేదు. నెల తిరిగే సరికి.. ఖజానా ఖాళీ అయిపోతోంది. ఈ నేపథ్యంలో లెక్కకు మించి అప్పులు చేస్తున్న ప్రభుత్వం.. కేంద్రం చుట్టూ పడిగాపులు కాస్తోంది. అయినా.. కేంద్రం కనికరించే పరిస్థితిలో లేదు. ఈ క్రమంలోనే శ్రీవారికి ఉన్న నిధుల్లో ఐదు వేల కోట్లను సెక్యూరిటీల రూపంలో తీసుకుంటే.. కొంత వరకు బయట పడొచ్చని జగన్ సర్కారు అంచనా వేస్తోందన్న ప్రచారం ఉంది.
అథారిటీ ఏర్పాటు…..
ఈ క్రమంలోనే బోర్డును వెంటనే రద్దు చేసిందని అంటున్నారు పరిశీలకులు. బోర్డు ఉంటే.. చర్చించి నిర్ణయాలు తీసుకునే సరికి వివాదం అయ్యే అవకాశం ఉంది. అదే స్పెసిఫైడ్ అథారిటీ ఉంటే.. కేవలం ఒక నిర్ణయంతో నిధులను ప్రభుత్వ ఖజానాకు తరలించే అవకాశం ఉంటుందని అంటున్నారు విమర్శకులు. ఈ క్రమంలోనే జగన్ బోర్డును వెంటనే రద్దు చేశారని.. అంటున్నారు. శ్రీవారి నిధులకు బ్యాంకులు ప్రస్తుతం 3 నుంచి 4 శాతం మాత్రమే వడ్డీ ఇస్తున్నాయని.. అదే బాండ్ల ద్వారా 7 శాతం లభించే అవకాశం ఉందని టీటీడీ ఇప్పటికే కొన్ని గణాంకాలు సిద్ధం చేసినట్టు ప్రచారం సాగుతోంది. అంటే.. బ్యాంకుల కన్నా కూడా ప్రభుత్వం వద్ద అయితే.. మరింత ఆదాయం వస్తుందని.. చెప్పేందుకు ఇలా చేస్తున్నారని అంటున్నారు.కానీ, ప్రభుత్వాలు మారితే.. ఈ బాండ్లకు బాధ్యులు ఎవరు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే.. అమరావతి రాజధాని బాండ్ల విషయమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. మరి ఏం జరుగుతుందో చూడాలి.