జ‌గ‌న్ వ‌ర్సెస్ బాబు.. రాష్ట్రానికి శాపంగా మారిందే..?

రాజ‌కీయ వైరుధ్యాలు.. రాష్ట్రానికి శాపంగా మారాయా ? ఏపీ సీఎం.. జ‌గ‌న్‌.. అనుస‌రిస్తున్న వైఖ‌రిపై మేధావులు అంటున్న మాట ఇది..! ఏపీలో జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చి రెండేళ్లు [more]

;

Update: 2021-07-07 12:30 GMT

రాజ‌కీయ వైరుధ్యాలు.. రాష్ట్రానికి శాపంగా మారాయా ? ఏపీ సీఎం.. జ‌గ‌న్‌.. అనుస‌రిస్తున్న వైఖ‌రిపై మేధావులు అంటున్న మాట ఇది..! ఏపీలో జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చి రెండేళ్లు గ‌డిచిపోయాయి. ఇప్పటి వ‌ర‌కు ఒక్క ప్రతిష్టాత్మక కంపెనీ కూడా రాష్ట్రానికి రాలేదు. పోనీ.. రాష్ట్ర ప్రభుత్వమైనా.. ఏ కంపెనీనైనా ఆహ్వానించిందా ? అంటే అది కూడా లేదు. ఇప్పటి వ‌ర‌కు చేసింద‌ల్లా సంక్షేమం పేరిట పంప‌కాలే.. అంటున్నారు మేధావులు. నిజానికి ప్రజా సంక్షేమం కూడా రాష్ట్ర అభివృద్ధితోనే ముడి ప‌డి ఉంటుంది. రాష్ట్ర ఆదాయం పెరిగితే.. ప్రజ‌ల‌కు మ‌రింత సంక్షేమం చేసే అవ‌కాశం ల‌భిస్తుంది.

పారిశ్రామిక ప్రగతి లేకుంటే…?

అయితే.. ఈ కీల‌క సూత్రాన్ని తోసిరాజ‌ని.. జ‌గ‌న్ స‌ర్కారు వేస్తున్న అడుగులు.. రాష్ట్ర భ‌విత‌కు ప్రశ్నార్థకంగా మారాయి. పెట్టుబడులు వ‌చ్చేందుకు గుదిబండ‌గా ప‌రిణ‌మించాయి. గత చంద్రబాబు పాల‌న‌లో అనేక ప్రతిష్టాత్మక కంపెనీల‌ను ఏపీకి ఆహ్వానించారు. ఈ క్రమంలో ఏటా జ‌న‌వ‌రిలో పెట్టుబ‌డుల స‌ద‌స్సును నిర్విరామంగా నాలుగేళ్లు కొన‌సాగించారు. వివిధ దేశాల ప్రముఖ కంపెనీల‌కు ఆహ్వానం ప‌లికేవారు. దీంతో చాలా కంపెనీలు వ‌చ్చాయి. వాటితో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. ఈ క్రమంలోనే స్థలాలు, విద్యుత్‌.. నీరు.. వంటి విష‌యాల్లో ప్రభుత్వం రాయితీ ఇచ్చింది. ఆయా కంపెనీలు ప‌నులు ప్రారంభిస్తే.. స్థానికంగా యువ‌త‌కు ఉపాధి ల‌భించి.. రాష్ట్రంలో ఆదాయం పెరుగుతుంద‌ని చంద్రబాబు భావించారు.

ఉన్న వాటిని……

అయితే బాబు చేసుకున్న ఒప్పందాల‌కు సంబంధించిన కంపెనీలు.. ప్రారంభానికి అడుగులు వేసే స‌రికి ప్రభుత్వం మారిపోయింది. బాబు దిగిపోయి.. జ‌గ‌న్ వ‌చ్చారు. దీంతో అప్పటికే చేసుకున్న ఒప్పందాల‌ను గౌర‌వించి.. ఆయా కంపెనీల‌ను సంస్థలు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాల్సిన జ‌గ‌న్‌.. నిమ్మకు నీరెత్తిన‌ట్టు వ్యవ‌హ‌రించారు. అదే స‌మ‌యంలో కొంద‌రు అమ్యామ్యాల‌కు కూడా చేతులు చాచార‌ని.. వార్తలు వ‌చ్చాయి. ఈ క్రమంలో స‌ద‌రు కంపెనీలు బిచాణా ఎత్తేస్తున్నాయి. మ‌రి ఇలా జ‌రుగుతున్న స‌మ‌యంలో అస‌లు ఏం జ‌రిగింది? అనేవిష‌యంపై దృస్టి పెట్టి.. వాటిని ఆపే బాధ్యత‌.. కొత్త కంపెనీల‌ను ప్రోత్సహించాల్సిన ఆవ‌శ్యక‌త జ‌గ‌న్‌పై ఉంది.

బాబుకు పేరొస్తుందని…..

కానీ, జ‌గ‌న్ అలా చేయ‌లేదు. ఎందుకంటే.. “అవ‌న్నీ.. బాబు తెచ్చిన కంపెనీలు' ఇప్పుడు వాటిని బ్రతిమాలితే.. వాటికి రాయితీలు ఇస్తే.. త‌న ఇజ్జత్ ఏంటి? త‌న హ‌యాంలో వ‌చ్చాయ‌ని ఎవ‌రు చెప్పుకొంటారు. రేపు పేరంతా.. బాబుకు వెళ్లిపోదా..? ఇదీ.. జ‌గ‌న్ ఆలోచ‌న ఫ‌లితంగా.. రాష్ట్రానికి పెట్టుబ‌డులు వ‌చ్చే అవ‌కాశం లేకుండా పోగా.. ఉన్నవి కూడా పోతున్నాయి. ఈ రాజ‌కీయ వివాదంలో అక్షరాలా న‌లిగిపోతోంది.. న‌వ్యాంధ్రే అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News