జనంలోకి వెళ్లడానికి జగనే దోవ చూపిస్తున్నాడా?

జగన్ హఠాత్తుగా ముఖ్యమంత్రి అయిపోలేదు. ఆయన అయిదేళ్ల పాటు విభజన ఏపీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ప్రతీ బడ్జెట్ సమావేశంలో పాలుపంచుకుని నాటి బాబు సర్కార్ [more]

;

Update: 2021-07-20 05:00 GMT

జగన్ హఠాత్తుగా ముఖ్యమంత్రి అయిపోలేదు. ఆయన అయిదేళ్ల పాటు విభజన ఏపీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ప్రతీ బడ్జెట్ సమావేశంలో పాలుపంచుకుని నాటి బాబు సర్కార్ కి సలహా సూచనలు ఎన్నో ఇచ్చేవారు. మరి నాడు ఏపీకి ఆదాయం ఎంత వస్తుంది. ఎలా ఖర్చు అవుతుంది అన్న లెక్కలు జగన్ కి తెలియకుండా వుండవు అంటే ఎవరూ నమ్మరు. అన్నీ తెలిసి జగన్ తన పాదయాత్ర సందర్భంగా అలవి కాని హామీలు ఇచ్చేశారు. అవే ఇపుడు సర్కార్ మెడకు గుదిబండలై కూర్చున్నాయి.

లక్షన్నర కావాలిట…

జగన్ రెండేళ్ల హానీమూన్ పూర్తి అయ్యేటప్పటికి అన్ని రకాల ఆర్ధిక వనరులనూ జగన్ పూర్తిగా వాడేసుకున్నారు. అప్పులు పెద్ద ఎత్తున తెచ్చేసుకున్నారు. మొత్తానికి లక్ష కోట్ల దాకా సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేశారు. ఇంతవరకూ బాగానే ఉంది, మరో మూడేళ్ల కాలం గడవాలి. అంటే ఇదే తీరున సంక్షేమ పధకాలు అమలు చేస్తూ పోవాలి అంటే మరో లక్షన్నర కోట్ల నిధులు ఏపీకి అవసరం అవుతాయి. అంత డబ్బు ఎక్కడ ఉంది. అప్పులు ఎక్కడ నుంచి వస్తాయి. దీంతో వైసీపీ పెద్దలు పరేషాన్ అవుతున్నారు.

కట్ చేస్తారా…?

ఏపీలో కోతలు వేళాయిందా. జగన్ సర్కార్ ఇప్పటిదాకా ఇచ్చింది చాలు అని ఇక కోతలకు రెడీ అయిపోతోందా అంటే అవును అనే సమాధానం వస్తోంది. గత ఏడాది నుంచి ఈ కోత మొదలు పెట్టేశారు. ఏకంగా ఎనిమిది లక్షల రేషన్ కార్డులను నాడు కట్ చేసి పారేశారు. దీని వల్ల చాలా మంది అర్హులైన వారు లబోదిబోమన్నా కూడా సర్కార్ కనికరించింది లేదు. వారు పెట్టుకున్న గైడ్ లైన్స్ ప్రకారం మీరు అర్హులు కారు అనేశారు. ఆ వ్యతిరేకత ఎటూ ఉంది. ఇపుడు సామాజిక పించన్ల మీద పడుతున్నారు. ఏపీలో లక్ష వరకూ సామాజిక పించన్లలో కోత పెట్టడానికి జగన్ సర్కార్ సిధ్ధపడుతోంది. అనర్హులు పెద్ద ఎత్తున ఉన్నారని వారిని ఏరి పారేస్తామని అధికారులు చెబుతున్నారు.

ఇచ్చి వెనక్కి తీసేసుకుంటే …?

ఎవరైనా ఇవ్వకపోతే ఫరవాలేదు. కానీ ఇచ్చిన తరువాత లాగేసుకుంటే ఆ బాధ చెప్పనలవి కాదు. అదే విధంగా వాటిని కోల్పోయిన వారు బద్ధ శత్రువులే అవుతారు. ఇపుడు అలాంటి శత్రువులను జగన్ సర్కార్ కోరి తెచ్చుకుంటోందా అన్న చర్చ సాగుతోంది. మరి సర్కార్ కి ఇంతకంటే ఏమీ చేయడానికి కూడా లేదుట. ఎందుకంటే ఖర్చులు తగ్గించుకోకపోతే ఇంకా దారుణమైన ఆర్ధిక పరిస్థితులను ఏపీ చవి చూస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దాంతో ఒక్కో పధకానికి కటింగులు పెట్టుకుంటూ పోవాల్సిందేనట. దీని వల్ల పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత వస్తుంది, రాజకీయంగా వైసీపీకి ఇబ్బందులు స్టార్ట్ అవుతాయని అంటున్నారు. సరిగ్గా దీని కోసమే వెయిట్ చేస్తున్న టీడీపీ వంటి పార్టీలు మాత్రం జనంలోకి వెళ్ళడానికి జగనే దోవ ఇస్తున్నాడు అని సంతోషిస్తున్నారుట.

Tags:    

Similar News