జగన్ సెలక్షన్… పార్టికి రియాక్షన్

జగన్ కు సామాజిక సమీకరణాలు అవసరం. తనకు భవిష్యత్ లో రాజకీయంగా ఉపయోగపడే వారు ముఖ్యం. అలాంటి నేతలకే ఎమ్మెల్సీ పదవులను జగన్ కట్టబెట్టారు. జగన్ కు [more]

;

Update: 2021-07-11 06:30 GMT

జగన్ కు సామాజిక సమీకరణాలు అవసరం. తనకు భవిష్యత్ లో రాజకీయంగా ఉపయోగపడే వారు ముఖ్యం. అలాంటి నేతలకే ఎమ్మెల్సీ పదవులను జగన్ కట్టబెట్టారు. జగన్ కు తొలి నుంచి అలవాటు లేని పని ఏందంటే సమిష్టి నిర్ణయాలు తీసుకోవడం. ఒక నిర్ణయం తానే తీసుకుంటారు. నష్టమైనా, కష్టమైనా, సుఖమైనా, లాభమైనా దాని ఫలితం తానే అనుభవించాలనుకుంటాడు. సాధారణంగా అన్ని పార్టీల్లో పార్టీ అధినేత ముందుగానే నిర్ణయం తీసుకున్నా ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. కాని జగన్ అలా కాదు. ఎవరినీ సంప్రదించకుండానే నిర్ణయం తీసుకుంటారు.

కొన్ని చోట్ల తలనొప్పి….

కానీ జగన్ అలా కాదు. ఏ నిర్ణయమైనా తనదే ఫైనల్. తాను అనుకున్నట్లే ముందుకు వెళతారు. ఎమ్మెల్సీల నియామకంలో కూడా అదే జరిగింది. ఇప్పుడు అదే ఎమ్మెల్సీల ఎంపిక కొన్ని చోట్ల తలనొప్పిగా తయారైంది. సామాజిక సమీకరణాలు, పార్టీకి భవిష‌్యత్ ను దృష్టిలో ఉంచుకుని జగన్ చేసిన ఎంపికలు ఇప్పుడు అనేక చోట్ల ఇబ్బందికరంగా మారాయి. తిరుపతి ఎంపీ బల్లిదుర్గాప్రసాద్ మరణంతో ఆయన కుమారుడు బలి చక్రవర్తికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ప్రస్తుతం గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ పై లోకల్ గా వ్యతిరేకత వస్తుండటంతో కల్యాణ చక్రవర్తి మరో వర్గంగా మారారు.

వర్గాలుగా విడిపోయి…

టీడీపీ నుంచి వచ్చిన డొక్కా మాణిక్యవరప్రసాద్, పోతుల సునీతకు తిరిగి జగన్ ఎమ్మెల్సీ పదవులను రెన్యువల్ చేశారు. కానీ తాడికొండ నియోజకవర్గంలో డొక్కా తన వర్గాన్ని పెంచుకుంటూ పోతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి అది ఇబ్బందికరంగా మారింది. ఇక్కడ ఉండవల్లి శ్రీదేవి, డొక్కా, ఎంపీ నందిగం సురేష్ వర్గాలున్నాయి. ఇక చీరాలలో పోతుల సునీత ఇటు ఆమంచికి, అటు కరణం వర్గాలకు దూరంగా ఉన్నారు.

కొందరు ఎమ్మెల్సీలకు ఇబ్బందులు….

విజయనగరంలో పీవీసీ సూర్యనారాయణ రాజును ఎమ్మెల్సీగా జగన్ ఎంపిక చేస్తే అక్కడ బొత్స వర్గం ఆయనను దూరంగా పెట్టింది. తాజాగా ఎంపిక చేసిన తోట త్రిమూర్తులు రామచంద్రాపురంలో స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇక్కడ కూడా మూడు గ్రూపులతో వైసీపీ కష్టాల్లో పడినటే. ఇక ప్రొద్దుటూరుకు చెందిన రమేష్ యాదవ్ ఎంపిక కూడా వివాదాస్పదమయింది. ఇక్కడ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనుచరులు ఆయనను బెదిరిస్తున్నారు. రమేష్ యాదవ్ రాజకీయంగా ఎదగకుండా, ప్రొద్దుటూరుపై పట్టు సంపాదించకుండా అడ్డుకుంటున్నారు. మొత్తం మీద జగన్ ఎంపిక చేసిన ఎమ్మెల్సీలలో కొందరు ఇబ్బందిపడుతుండగా, మరికొందరు పార్టీకి ఇబ్బంది తెచ్చిపెడుతున్నారు.

Tags:    

Similar News