ఇక్కడ మాత్రం ఇద్దరిదీ ఒకే రూటు…?
గతంలో చంద్రబాబు పాలనకు ఇప్పుడు జగన్ పరిపాలనకు మధ్య ఒక విషయంలో తేడా కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు. అప్పట్లో చంద్రబాబు నడిచిన మార్గంలోనే ఇప్పుడు జగన్ [more]
;
గతంలో చంద్రబాబు పాలనకు ఇప్పుడు జగన్ పరిపాలనకు మధ్య ఒక విషయంలో తేడా కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు. అప్పట్లో చంద్రబాబు నడిచిన మార్గంలోనే ఇప్పుడు జగన్ [more]
గతంలో చంద్రబాబు పాలనకు ఇప్పుడు జగన్ పరిపాలనకు మధ్య ఒక విషయంలో తేడా కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు. అప్పట్లో చంద్రబాబు నడిచిన మార్గంలోనే ఇప్పుడు జగన్ కూడా నడుస్తున్నారని చెబుతున్నారు. విషయం ఏంటంటే.. గతంలో చంద్రబాబు మీడియాను నమ్ముకున్నారు. ప్రచారానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు సమీక్షను ఏకంగా.. ప్రచార ఆర్భాటంగా మార్చేశారు. ఏటా జనవరిలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సును కూడా ప్రచారానికి బాగా వాడుకున్నారు. అదే సమయంలో ఇతర పథకాలను కూడా ప్రచారానికి ఎక్కువగా వాడుకున్నారు.
పథకం ఖర్చు కంటే…?
దీంతో ప్రచారం అయితే లభించింది కానీ.. పోలవరం కానీ, అమరావతి కానీ, పెట్టుబడుల సదస్సులు కానీ.. ఏపీకి ఎలాంటి లాభాలనూ పెద్దగా తీసుకురాలేక పోయాయి. దీంతో ప్రచారం ఎక్కువ పనితక్కువ అనే ప్రధాన విమర్శలు.. చంద్రబాబు సర్కారుకు బాగానే తాకాయి. ఇప్పుడు అచ్చం అదేవిధంగా జగన్ పాలనలోనూ .. జరుగుతోందని అంటున్నారు పరిశీలకులు. చాలా వరకు మీడియాకు దూరంగా ఉంటున్నానని చెబుతున్న జగన్.. ప్రతి పథకాన్నీ ప్రచారాలతో నింపేస్తున్నారు. చేయూత కింద 45 ఏళ్లు దాటిన మహిళలకు లబ్ధి చేకురుస్తామంటూ.. పథకానికి సమానంగా ఆయన ప్రచారానికి ఖర్చు చేశారు.
ప్రకటనలతో నింపేసి…..
ప్రధాన పత్రికల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేసి యాడ్స్ ఇచ్చారు. రైతు భరోసా గత ఏడాది ప్రారంబించారు. అయినా.. ఇటీవల దీనికి నిధులు ఇచ్చే సమయంలో మళ్లీ ఇప్పుడే ప్రారంభిస్తున్నామనే విధంగా ప్రచారం కల్పించుకున్నారు. ఇక, అన్నిటికన్నా వింత ఏంటంటే.. జాబ్ క్యాలెండర్. నిజానికి దీనివల్ల వచ్చే లబ్ధి ఇప్పట్లో కనిపించదు. కానీ, జాబ్ క్యాలెండర్ విడుదల సందర్భంగా కూడా జగన్.. భారీ ఎత్తున ప్రకటనలు గుప్పించారు. ఇక, ఇప్పుడు.. తాజాగా మహిళలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో తీసుకువచ్చిన దిశ యాప్ వ్యవహారంలోనూ ఇదే విధంగా జగన్ వ్యవహరిసంచారు.
యాడ్ తయారీ కంటే…?
పెద్ద ఎత్తున దీనికి యాడ్‌లు ఇవ్వడం ద్వారా.. భారీగానే ఖర్చు చేశారు. నిజానికి యాప్ తయారీకి.. అయిన ఖర్చుకు వంద రెట్లు యాడ్ కోసం ఖర్చు చేసినట్టు అధికారులే చెబుతున్నారు. మరి దీనివల్ల ఎంత మందికి ప్రయోజనం జరుగుతుందనే విషయం పక్కన పెడితే.. ప్రస్తుతానికి కోట్ల రూపాయల చమురు మాత్రం వదిలింది. ఇదంతా చూస్తే.. నాడు బాబు.. నేడు జగన్.. ప్రచారానికే పరిమితమయ్యారని అంటున్నారు.