విస్తరణకు అదే ముహూర్తం.. మంత్రులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్?
వైసీపీ మంత్రులు ఇపుడు సరిగ్గా పనిచేయడం లేదు. వారు అన్యమనస్కంగా ఉంటున్నారు. ఎందుకొచ్చిన తంటా. ఎలాగూ ఊడిపోయే పదవి కోసం అంటూ టైమ్ పాస్ చేస్తున్నారు. దాంతో [more]
;
వైసీపీ మంత్రులు ఇపుడు సరిగ్గా పనిచేయడం లేదు. వారు అన్యమనస్కంగా ఉంటున్నారు. ఎందుకొచ్చిన తంటా. ఎలాగూ ఊడిపోయే పదవి కోసం అంటూ టైమ్ పాస్ చేస్తున్నారు. దాంతో [more]
వైసీపీ మంత్రులు ఇపుడు సరిగ్గా పనిచేయడం లేదు. వారు అన్యమనస్కంగా ఉంటున్నారు. ఎందుకొచ్చిన తంటా. ఎలాగూ ఊడిపోయే పదవి కోసం అంటూ టైమ్ పాస్ చేస్తున్నారు. దాంతో రాగల ప్రమాదాన్ని జగన్ చక్కగానే గుర్తించారు అంటున్నారు. మంత్రులలో నిరాశను పారదోలేందుకు ఆయన కొత్త ప్లాన్ ని రెడీ చేశారు. వారి చెవిన శుభ వార్తను కూడా వేశారు. ప్రస్తుత మంత్రులకు మరో ఆరు నెలల పాటు పదవీకాలం పొడిగింపు ఉంటుదని జగన్ చెప్పేశారు అంటున్నారు. హాయిగా మీ పని మీరు చేసుకోండి. వచ్చే ఏడాది జూన్ వరకూ విస్తరణ ఉండదు అంతే అంటున్నారుట జగన్.
కరోనా వరం…
నిజానికి మంత్రుల పని తీరు మదింపు చేయాలన్నా కూడా సీఎం జగన్ వల్ల కాని విషయం. ఏపీలో కరోనా రెండు దశలుగా వచ్చింది. దాంతో ఏకంగా తొమ్మిది నెలల పాటు ఏ మంత్రీ కూడా జనంలోకి వెళ్ళలేకపోయారు. తమ శాఖలకు సంబంధించిన పనులను కూడా చూసుకోలేకపోయారు. దాంతో జగన్ వద్ద ఇదే విషయాన్ని చనువు ఎక్కువ ఉన్న ఒకరిద్దరు మంత్రులు ప్రస్తావించారు అంటున్నారు. దానికి జగన్ కూడా ఏకీభవించారట. అవును నిజమే. కరోనా వల్ల విలువైన కాలం పోయింది కాబట్టి మరో ఆరు నెలల పాటు కొనసాగింపు ఇస్తున్నామని జగన్ వరమే ప్రసాదించారుట. దీంతో మంత్రులలో సరికొత్త ఆనందం వెల్లి విరుస్తోంది అంటున్నారు.
అదే ముహూర్తం …?
జగన్ పాలనకు వచ్చే ఏడాది మే 30కి మూడేళ్ళు పూర్తి అవుతాయి. దాంతో పాటే ఎన్నికలకు కూడా గడువు దగ్గరపడుతుంది. అంటే మెజారిటీ పాలన ముగిసి మరోసారి ప్రజాతీర్పు కోరేందుకు రంగం సిధ్ధమవుతుంది అన్న మాట. దాంతో ఎన్నికల మంత్రి వర్గాన్ని నిర్మించుకునేందుకు జగన్ ఆ అవకాశాన్ని వాడుకుంటారు అంటున్నారు. ఇపుడు జగన్ మంత్రులకు మరో ఆరు నెలల పాటు గడువు ఇచ్చినందువల్ల రేపటి రోజున ఎవరినీ తీసేసినా వారు మాట్లాడకూడదు. ఎందుకంటే ముందే వరం పొందిన మంత్రులు జగన్ నిర్ణయానికి తప్పనిసరిగా సహకరించాల్సిఉంటుంది. మరో వైపు చూస్తే సీనియర్ మంత్రుల విషయంలో కూడా కత్తి వేలాడుతుందని అంటున్నారు.
బరువు దించుకున్నారా …?
సీనియర్లు అయినంతమాత్రాన కొనసాగించాలని ఎక్కడా లేదని జగన్ భావిస్తున్నారుట. తాను చెప్పిన ప్రకారం పూర్తి స్థాయిలో కొత్త మంత్రులే ఉండాలని జగన్ అనుకుంటున్నారుట. అదే విధంగా వారంతా మరింత సమర్ధులుగా ఉంటూ ఎన్నికలలో పార్టీని తిరిగి గెలిపించే సత్తా కలిగి ఉండాలని జగన్ అర్హతలు నిర్ణయిస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే మంత్రివర్గ విస్తరణ అన్నది ఒక విధంగా జగన్ కి కూడా తలనొప్పిగా ఉందిట. ఈ మంత్రుల తీసివేత, కూడికలతో అసమ్మతి తలెత్తితే దాన్ని సర్దుబాటు చేయడం కూడా కష్టమే అని భావించే మరో ఆరు నెలలు వాయిదా వేసుకున్నారని అంటున్నారు. ఏదైతేనేం మంత్రులకు ఇది శుభవార్తగానే చూడాలిపుడు.