జగన్ స్కీంలు రివర్స్ కొడతాయా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఈసారి ఎన్నికలు అంత సులువు కాదు. గతంలో కంటే జగన్ కు ఇప్పడు శత్రువులు ఎక్కువయ్యారు. సహజంగా అధికార పార్టీపై [more]

;

Update: 2021-07-26 06:30 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఈసారి ఎన్నికలు అంత సులువు కాదు. గతంలో కంటే జగన్ కు ఇప్పడు శత్రువులు ఎక్కువయ్యారు. సహజంగా అధికార పార్టీపై ఉండే వ్యతిరేకత ఎటూ ఉండనే ఉంటుంది. సొంత పార్టీలో అసమ్మతులు. వీటిన్నింటినీ అధిగమించి జగన్ వచ్చే ఎన్నికలకు సిద్దమవ్వాలి. అయితే జగన్ ఎవరి మాట వినరు. తనకు ఉన్న ఫీడ్ బ్యాక్ ప్రకారమే ముందుకు వెళతారు. తన సంక్షేమ పధకాలు, బీసీ,ఎస్సీ, ఎస్టీలకు చేసిన మేళ్లు తనను మరోసారి గట్టెక్కిస్తాయన్న నమ్మకంతో జగన్ ఉన్నట్లు కనపడుతుంది.

చెప్పాడంటే.. చేస్తాడంతే….

నిజమే జగన్ సంక్షేమ పథకాలు ఇబ్బడి ముబ్బడిగా పంచేశారు. జగన్ చెప్పాడంటే.. చెస్తాడంతే అన్న నమ్మకం ప్రజల్లో ఉంది. మ్యానిఫేస్టో తనకు ఖురాన్, బైబిల్, భగవద్గీత అని జగన్ పదే పదే చెబుతుంటారు. ప్రతి కార్యాయలంలో మ్యానిఫేస్టో కనపడేలా ఉంచారు. అదే జగన్ కు వచ్చే ఎన్నికలకు ఇబ్బంది అవుతుందంటున్నారు. వచ్చే ఎన్నికలకు మరిన్ని హామీలు ఇవ్వకపోతే జనం సంతృప్తి చెందరు. పైగా విపక్షాలు ఇబ్బడి ముబ్బడి గా హమీలు కురిపిస్తాయి.

కొత్త పథకాలు.. హామీలు….

కానీ జగన్ కొత్త పథకాలు, హామీలపై ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభమయిందంటున్నారు. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూస్తే ఇప్పుడు అమలవుతున్న సంక్షేమ పథకాలనే మూడేళ్ల పాటు కొనసాగించడం కష్టమేనంటున్నారు ఆర్థిక నిపుణులు. ఇప్పటికే ఆర్థిక శాఖ అధికారులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త హామీలు, పథకాలకు చోటు కల్పించడం జగన్ కు కష్టమేనంటున్నారు.

అనర్హులకు అందలం…..

మరోవైపు పదవుల పంపకంపై కూడా జగన్ ఆశలు పెట్టుకున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ లకు అనేక పదవులను కట్టబెట్టారు. వీరంతా వచ్చే ఎన్నికల్లో అండగా నిలబడతారని భావిస్తున్నారు. కానీ ఇప్పటికే పదవుల పొందిన నేతల తీరుతో అదే సామాజికవర్గం నుంచి అసంతృప్తి ఎదురవుతుంది. అనర్హులకు కొందరిని అందలమెక్కించారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. బీసీ సామాజిక వర్గం కూడా పూర్తిగా జగన్ వెనక ఉంటుందన్న గ్యారంటీ లేదు. ఆ సామాజికవర్గం ప్రజలు అంత సంతృప్తికరంగా లేరు. సో…మొత్తం మీద జగన్ అనుకున్న స్కీమ్ లు వచ్చే ఎన్నికలకు వర్క్ అవుట్ అయ్యట్లు లేదు.

Tags:    

Similar News