ఈ ఎమ్మెల్యేను కంట్రోల్ చేయలేవా జగన్?

`నాకు మంత్రి ప‌ద‌వి రాదు. ఎందుకంటే.. నేనే రెడ్డిని. కానీ, ఆయ‌న‌కు మాత్రం మంత్రి ప‌ద‌వి వ‌ద్దు!` ఇదీ.. తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన ఓ సామాజిక వ‌ర్గం [more]

;

Update: 2021-07-14 03:30 GMT

'నాకు మంత్రి ప‌ద‌వి రాదు. ఎందుకంటే.. నేనే రెడ్డిని. కానీ, ఆయ‌న‌కు మాత్రం మంత్రి ప‌ద‌వి వ‌ద్దు!' ఇదీ.. తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన ఓ సామాజిక వ‌ర్గం నేత గురించి సీఎం జ‌గ‌న్ సామాజిక వ‌ర్గానికి చెందిన కీల‌క ఎమ్మెల్యే చేస్తున్న ప్రచారం. నోరు విప్పితే.. వివాదాస్పద వ్యాఖ్యల‌కు కేంద్రంగా ఉన్న స‌ద‌రు ఎమ్మెల్యేగారికి చాలానే హిస్టరీ ఉంది. జ‌గ‌న్ వ్యాపారాల్లోనూ ఆయ‌నకు పావ‌లా వాటా ఉంద‌ని అంద‌రూ చెప్పుకొంటారు. అయితే.. మంత్రి వ‌ర్గంపై ఆయ‌న‌కు ఆశ‌లు లేక‌పోయినా.. త‌న ఆధిప‌త్యానికి ఎవ‌రూ అడ్డు రాకూడ‌ద‌నేదే ఆయ‌న ప్రధాన ఉద్దేశంగా క‌నిపిస్తోంది.

మంత్రిని టార్గెట్ చేస్తూ….

ఈ క్రమంలోనే స‌ద‌రు మంత్రిని ఈయ‌న కొన్నాళ్లుగా టార్గెట్ చేస్తున్నారు. “ఏంటండీ ఆయ‌న చేసింది. ఆయ‌న వ‌ల్ల ఇక్కడ ఎవ‌రూ హ్యాపీగా లేరు. జ‌గ‌న్ ప‌థ‌కాలు ప్రక‌టిస్తున్నారు. వ‌లంటీర్లు ప‌నిచేస్తున్నారు. ఆయ‌న‌తో ప‌నేంటి ? ఆయ‌న వ‌ల్ల ఇక్కడ అధికారులు కూడా ఇబ్బందులు ప‌డుతున్నారు“ అని ప్రెస్‌మీట్ లో బాహాటంగానే విమ‌ర్శలు చేసిన స‌ద‌రు ఎమ్మెల్యే వైఖ‌రి.. మ‌రోసారి చ‌ర్చకు వ‌చ్చింది. తాజాగా.. జ‌గ‌న్ అమ‌లు చేసిన చేయూత ప‌థ‌కంలో త‌న నియోజ‌క‌వ‌ర్గంలో చాలా మందిని ఎలిమినేట్ చేశారంటూ.. స‌ద‌రు ఎమ్మెల్యే వ్యాఖ్యలు సంధించారు.

మరోసారి వ్యాఖ్యలు…

“మాకు మ‌ధ్యలో కొంద‌రు మంత్రులు ఉంటారండీ.. వారివ‌ల్లే మాకు త‌ల‌నొప్పుడు. ఇప్పుడు డ‌బ్బులు రానోళ్లంతా మామీద ప‌డ‌తారు. ఆయ‌న చెబుతాడా స‌మాధానం. అధికారులు మాకు చెప్పలేక స‌త‌మ‌తం అవుతున్నారు. ఎందుకండీ ఆ మంత్రి వేస్ట్ కాక‌పోతే. తీసేయ‌మ‌ని జ‌గ‌న్‌కే చెబుతా. పార్టీ బాగుండాలంటే ఇలాంటివారు కాదు పార్టీ కోసం ప‌నిచేసేవారు కావాలి“ అంటూ ఆయ‌న మీడియాతో ఆఫ్ ది రికార్డుగా వ్యాఖ్యలు చేశారు. రాస్తే రాసుకోండి.. అంటూ చెప్పినా త‌ర్వాత పీఏతో ఫోన్లు చేయించివ‌ద్దని చెప్పారు.

ఆయన దూకుడుకు….?

ఆ ఎమ్మెల్యే దూకుడు వైఖ‌రికి తోడు అధిష్టానం సైతం ఆయ‌న్నే స‌పోర్ట్ చేసేలా వ్యవ‌హ‌రించ‌డంతో కొద్ది రోజుల వ‌ర‌కు మీడియాలో జ‌గ‌న్‌ను స‌పోర్ట్ చేస్తూ దుమ్ము దులిపేసే స‌ద‌రు మంత్రి కొద్ది రోజులుగా సైలెంట్ అయిపోయారు. ఇక స‌ద‌రు ఎమ్మెల్యే తీరుపై పార్టీలోనే జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ర‌గులుతున్నారు. ఒక ప్రతిప‌క్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేతో చేతులు క‌లిపి ఎంచ‌క్కా మ‌ట్టి వ్యాపారాలు చేసుకుంటూ క‌మీష‌న్లు దండుకుంటున్నార‌న్న విమ‌ర్శలు ఉన్నాయి.

కొన్నాళ్ల క్రితం….?

ఇక జిల్లాకే చెందిన మ‌రో కీల‌క నేత‌, జ‌గ‌న్ ఫ్యామిలీకి వీర విధేయుడు అయిన ఓ నేత‌ను జిల్లా స‌మీక్షా స‌మావేశంలోనే బూతులు తిట్టడంతో అంద‌రూ షాక్ అయ్యారు. వాస్తవానికి అదే ప‌ని మ‌రో నేత చేసి ఉంటే అధిష్టానం ఏకంగా షోకాజ్ నోటీసులు ఇచ్చి నానా ర‌చ్చ చేసేద‌ని.. అయితే స‌ర‌దు ఎమ్మెల్యే జ‌గ‌న్ వ్యాపార భాగ‌స్వామి కావ‌డంతోనే ఆయ‌న విష‌యంలో కిమ్మన‌కుండా ఉంద‌ని పార్టీ నేత‌లే చెవులు కొరుక్కున్నారు. ఇక ఇప్పుడు స‌ద‌రు ఎమ్మెల్యే మంచి ఇమేజ్ ఉన్న మంత్రిని సైతం టార్గెట్ చేస్తూ రాజ‌కీయం చేస్తున్నారు.

Tags:    

Similar News