జగన్ స్కూల్ తో టీడీపీకి చాకిరేవేనా… ?
జగన్ రాజకీయంగా రాటుదేలారు. ఆయన ఏపీలోని పదమూడు జిల్లాల మీద బాగా అవగాహన పెంచుకున్నారు. టీడీపీ అనుకూల మీడియా అధిపతి ఒకరు తన వీకెండ్ పాయింట్ లో [more]
జగన్ రాజకీయంగా రాటుదేలారు. ఆయన ఏపీలోని పదమూడు జిల్లాల మీద బాగా అవగాహన పెంచుకున్నారు. టీడీపీ అనుకూల మీడియా అధిపతి ఒకరు తన వీకెండ్ పాయింట్ లో [more]
జగన్ రాజకీయంగా రాటుదేలారు. ఆయన ఏపీలోని పదమూడు జిల్లాల మీద బాగా అవగాహన పెంచుకున్నారు. టీడీపీ అనుకూల మీడియా అధిపతి ఒకరు తన వీకెండ్ పాయింట్ లో చెప్పినట్లుగా ఏపీ ప్రజల సైకాలజీని జగన్ బాగా చదివేశారు. ఆయన 2024లో జరిగే ఎన్నికలను సైతం గెలవడానికి ఇప్పటి నుంచే తనదైన శైలిలో వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఏపీలో వివిధ వర్గాలకు ఆయన అందిస్తున్న తాయిలాలు అన్నీ అందులో భాగమే అంటున్నారు. దాంతోనే విపక్షం వీరంగం వేస్తోంది అన్న మాట ఉంది.
ఓట్లు కొంటున్నారా ..?
ఈ మాటను బీజేపీకి చెందిన ఏపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు అంటున్నారు. ప్రభుత్వం సొమ్ము పెట్టి జగన్ ఓట్లు కొనుక్కొంటున్నారని ఆయన ఆక్షేపిస్తున్నారు. వివిధ పధకాలను ఆయన అప్పులు చేసి కొనసాగించడం అందులో భాగమేనని అంటున్నారు. ఏపీలో సంక్షేమం తో పాటు అభివృద్ధి కూడా ఉండాలన్నది తమ విధానం అని చెబుతున్నారు. సరే సోము వీర్రాజు అన్నారని కాదు కానీ ఏపీలో జగన్ సంక్షేమం వెనక పక్కా రాజకీయ లెక్క ఉందని అంతా అంటున్నారు. ఇక టీడీపీ అయితే జగన్ మీద విమర్శలు చేయడానికి ఇదే కారణం అంటున్నారు.
ఫస్ట్ నుంచీ ….
గతంలో పాలకులు అభివృద్ధి చేసి ఓట్లు అడిగేవారు. ఇక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత దాకా జనాలు గుర్తుకురాక పోవడం పాత కాంగ్రెస్ నాయకుల విధానం. ఎన్టీఆర్ టైమ్ లో అయితే ఎన్నికలు ఉంటాయంటే జాగ్రత్త పడేవారు. చంద్రబాబు జమానాలో ప్రతీ అంశాన్ని రాజకీయాలకు వాడుకునే పద్ధతిని అమలు చేసేవారు. ఇపుడు జగన్ స్కూల్ సెపరేట్. ఆయన ఫస్ట్ ఇయర్ నుంచే జనాలకు చేరువ కావాలని చూస్తూ వచ్చారు. గద్దెనెక్కిన నాటి నుంచే ఆయన ప్రజలకు పధకాలను ప్రకటిస్తూ ఓటు బ్యాంక్ రాజకీయాలకు తెర తీశారని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.
కష్టమేనట…
టీడీపీ అనుకూల మీడియాకు చెందిన ఒకాయన తన రాజకీయ వ్యాఖ్యానం రాస్తూ ఏపీలో విపక్షానికి తావు లేని పరిస్థితి ఉందని వాపోయారు. ఆయన నిరాశతోనే ఆ వ్యాఖ్యానం రాశారనుకోవాలి. జగన్ ఎక్కడ లేని విధంగా అప్పులు చేసి మరీ ప్రజలకు నగదు బదిలీ పధకాన్ని పకడ్బంధీగా అమలు చేస్తున్నారని ఆయన ఆ విధంగా చేయడం ద్వారా తన ఓటు బ్యాంక్ ని పటిష్టం చేసుకుంటున్నారని రాసుకొచ్చారు. జగన్ ని ఓడించాలంటే ఇంతకు మించి పధకాలను ఇస్తామని జనాలకు చెప్పాలట. అలా జనాలకు చెప్పి వారు నమ్మితేనే మరొకరు గద్దెనెక్కే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అంటే టీడీపీ ఇంతకు మించి హామీలు ఇవ్వాలన్న మాట. మొత్తానికి జగన్ ప్రభుత్వం డబ్బుతో ఓట్లు కొనేసుకుంటున్నారన్న అక్కసు అయితే విపక్షానికి ఉంది. కానీ పధకాలను నేరుగా విమర్శించలేని బలహీనత కూడా ఉంది. బహుశా ఇదే వైసీపీకి అడ్వాంటేజ్ గా మారుతోంది అనుకోవాలేమో.