అధికారంలోకి రాగానే అంతా మర్చిపోతారా?
రాష్ట్రంలో రాజకీయాలు మారాయి. అధికారం చేతిలో ఉంటే.. ఒకలా.. లేకపోతే.. మరోలా వ్యవహరించడం ఇప్పుడు కామన్‌గా మారిపోయింది. విషయం ఏదైనా సరే.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. ఒకలా… అధికారంలోకి [more]
రాష్ట్రంలో రాజకీయాలు మారాయి. అధికారం చేతిలో ఉంటే.. ఒకలా.. లేకపోతే.. మరోలా వ్యవహరించడం ఇప్పుడు కామన్‌గా మారిపోయింది. విషయం ఏదైనా సరే.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. ఒకలా… అధికారంలోకి [more]
రాష్ట్రంలో రాజకీయాలు మారాయి. అధికారం చేతిలో ఉంటే.. ఒకలా.. లేకపోతే.. మరోలా వ్యవహరించడం ఇప్పుడు కామన్‌గా మారిపోయింది. విషయం ఏదైనా సరే.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. ఒకలా… అధికారంలోకి ఉంటే మరోలా వైసీపీ అధినేత జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహరిస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. గతంలో పోలవరం అంచనాలను పెంచాలని చంద్రబాబు ప్రతిపాదించారు. అయితే అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా జగన్ దీనిని వ్యతిరేకించి.. కేంద్రానికి లేఖలు సమర్పించారు. కేవలం మామూళ్ల కోసం.. కమీషన్ల కోసమే ఇలా అంచనాలు పెంచారంటూ.. చంద్రబాబు సర్కారుపై నిప్పులు చెరిగారు.
అధికారంలోకి రాగానే?
ఇక, ఇదే విషయంలో అధికారంలోకి రాగానే జగన్ అంచనాలు పెంచాలంటూ.. ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబు.. గతంలో జగన్ పాటనే పాడుతున్నారు. మామూళ్ల కోసమే అంచనాల పెంపుకోరుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఒక్క విషయంలోనే కాదు.. అనేక విషయాల్లో ఇరువురు నేతలు అప్పుడు ఒకలా.. ఇప్పుడు మరోలా వ్యవహరిస్తున్నారు. తాజాగా విద్యార్థుల పరీక్షల విషయంలోనూ ఇరువురూ అదే పంథాను ఎంచుకున్నారు. గతంలో చంద్రబాబు హయాంలో పిల్లలపై ఒత్తిడి పెంచారనే వ్యాఖ్యలు వినిపించాయి.
విద్యార్థుల విషయంలో…..
కార్పొరేట్ విద్యను భారీగా ప్రోత్సహించారు. దీంతో అప్పట్లో విద్యార్థులు కారణాలు ఏవైనా ఈ ఒత్తిళ్లు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ విషయంపై గతంలో ప్రతిపక్షంలో ఉన్న జగన్.. తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు వైఖరి వల్లే.. విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారని.. దీనికి ఆయనే బాధ్యత వహించాలని అన్నారు. పైగా బాబు కేబినెట్లో మంత్రిగా ఉన్న నారాయణ విద్యా వ్యాపారాన్ని బాబు ఎంకరేజ్ చేస్తున్నారంటూ నాడు వైసీపీ నేతలు అంతా గగ్గోలు పెట్టారు. కట్ చేస్తే.. ఇప్పుడు జగన్ అధికారంలో ఉన్నారు. అయితే.. గతంలో చంద్రబాబు మాదిరిగా కాకపోయినా.. కరోనా సమయంలోనూ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించే తీరుతామని.. ఆయన ప్రకటించి.. రాజకీయంగా విమర్శల పాలయ్యారు.
హోదా విషయంలోనూ?
కరోనా ముప్పు ఉందని తెలిసి కూడా ఇంటర్ పరీక్షలకు షెడ్యూల్ ఇచ్చి వివాదం కావడం.. సుప్రీంకోర్టు జోక్యంతో నిలుపుదల చేయడం వంటివి తెలిసిందే. అయితే ఇక్కడ ఇదే విషయంలో టీడీపీ మళ్లీ జగన్ పాత్రనే పోషించింది. కరోనాతో విద్యార్థులు మృతి చెందితే.. ఏం చేస్తారని.. ప్రశ్నించారు టీడీపీ యువ నాయకుడు లోకేష్. అంతేకాదు.. ఏ ఒక్కరు చనిపోయినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇక కీలకమైన ప్రత్యేక హోదా విషయంలో బాబు యూటర్న్ తీసుకున్నారంటూ..ఆయన కేంద్రంపై ఒత్తిడి చేయడం లేదంటూ తీవ్ర విమర్శలు చేసింది వైసీపీ.. ఇప్పుడు జగన్ ప్రభుత్వం అధికారంలో ఉంటే అసలు ప్రత్యేక హోదా గురించే మాట్లాడడం లేదు. ఇలా.. అధికారంలో ఉంటే.. ఒకలాగా.. అధికారంలో లేకపోతే.. మరోలా వ్యవహరించడం అనేది ఇక్కడ రాజకీయ నాయకులకు చాలా కామన్ అయిపోయింది.