జగన్ స్వయంకృతం.. హైదరాబాద్ రూట్‌లో అభివృద్ది
ఏపీ సీఎం జగన్ చేసుకున్న స్వయంకృతాపరాథం కారణంగా.. అభివృద్ధి అంతా కూడా ఇప్పుడు హైదరాబాద్ రూటు పట్టిందా ? అంటే.. ఔననే అన్న చర్చలు ఇటు రాజకీయ [more]
;
ఏపీ సీఎం జగన్ చేసుకున్న స్వయంకృతాపరాథం కారణంగా.. అభివృద్ధి అంతా కూడా ఇప్పుడు హైదరాబాద్ రూటు పట్టిందా ? అంటే.. ఔననే అన్న చర్చలు ఇటు రాజకీయ [more]
ఏపీ సీఎం జగన్ చేసుకున్న స్వయంకృతాపరాథం కారణంగా.. అభివృద్ధి అంతా కూడా ఇప్పుడు హైదరాబాద్ రూటు పట్టిందా ? అంటే.. ఔననే అన్న చర్చలు ఇటు రాజకీయ వర్గాల్లోనే కాకుండా అటు మేథావి వర్గాల్లోనూ వినిపిస్తున్నాయి. ఏపీలో గత రెండేళ్లుగా అభివృద్ధి అన్న మాట కంటే రాజకీయం, ఎత్తులు, పై ఎత్తులు అన్న మాటలే ఎక్కువుగా వినిపించాయి. పెట్టుబడులు రావడం లేదు.. యువతకు ఉపాధి లభించడం లేదు. కార్మికులకు పని దొరకడం లేదు. అసలు రాష్ట్రంలో చాలా మంది నోట నుంచి మనీ రొటేట్ కావడం లేదన్నదే ఎక్కువుగా వినిపిస్తోంది. దీంతో రాష్ట్రంలో ఒకవిధమైన నైరాశ్యం ఏర్పడిందనేది వాస్తవం. నిజానికి ఏ రాష్ట్రమైనా అభివృద్ది చెందాలంటే.. పెట్టుబడులు రావాల్సిందే. ఇవి రావాలంటే.. రాష్ట్రంలో పరిస్థితి బాగుండాలి. కానీ, ఇప్పుడు జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా.. ఏపీలో పెట్టుబడులు అంటేనే ఎవ్వరూ స్పందించని పరిస్థితి.
రాజధాని లేకుండా…?
ముఖ్యంగా మూడు రాజధానుల నిర్ణయం ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం చూపింది.అదే సమయంలో రాష్ట్రంపైనా అంతే ప్రభావం పడిందని.. అంటున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టి రియల్ ఎస్టేట్ రంగాన్ని పరుగులు పెట్టించాలని భావించినా.. మూడు రాజధానుల నిర్ణయంతో చాలా మంది పెట్టుబడి దారులు వెనక్కి తగ్గారు. పోని.. మూడు రాజధానులైనా కూడా ఓకే అనుకున్నా.. వీటిపై నెలకొన్న న్యాయపరమైన చిక్కులతో ఇప్పుడు మూడు రాజధానులు ఏటూ తేలలేదు. సాధారణంగా జాతీయ స్థాయి, ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించాలంటే ఏ రాష్ట్రానికి అయినా ఓ బలమైన రాజధాని అవసరం. కానీ ఏపీకి ఇప్పుడు అది లేకుండా పోయింది.
పొరుగు రాష్ట్రమే…..
దీంతో ఏపీ కన్నా.. పొరుగు రాష్ట్రమే బెటర్ అనుకుంటున్న వారు.. తృణప్రాయంగా భావిస్తూ.. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. విచిత్రం ఏంటంటే రాష్ట్ర విభజన తర్వాత చాలా మంది హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపలేదు. అక్కడ రియల్ ఎస్టేట్, వ్యాపార రంగాలు పూర్తిగా కుదేలయ్యాయి. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. అమరావతి అన్నా, ఆంధ్రా అన్నా ఎవ్వరూ పెట్టుబడులు పెట్టడం లేదు. ఇదే టైంలో హైదరాబాద్‌లో ఈ రంగాలు ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి.
పరిశ్రమలు రాక…..
ఇక, అక్కడ కేసీఆర్ ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా.. హైదరాబాద్‌ను విస్తరిస్తోంది. చాలా కీలకమైన కంపెనీలను శివారు ప్రాం తాల్లో ఏర్పాటు చేయడంతోపాటు అక్కడ రియల్ రంగాన్ని ప్రోత్సహిస్తోంది. దీనికి మంత్రి కేటీఆర్ కీలకంగా వ్యవహరిస్తు న్నారు. ఈ క్రమంలో ఏపీలో ఎలాగూ.. ఇప్పట్లో కేసులు తేలవు కాబట్టి.. ఖచ్చితంగా.. తెలంగాణ అయితేనే బెటర్ అనుకుంటున్న వారు పెరుగుతున్నారు. దీంతో ఏపీ అన్ని విధాలా నష్టపోతోందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇక పారిశ్రామికవేత్తలు కూడా ఏపీ అంటేనే దూరం దూరం అంటున్నారు. మరి ఇప్పటికైనా.. జగన్ సర్కారు పెట్టుబడి దారులకు భరోసా ఇస్తుందో లేదో .. చూడాలి అంటున్నారు పరిశీలకులు.
.