ఇమేజ్ బిల్డప్ కోసమేనా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఎప్పుడూ ఒక అలవాటు ఉంది. ఆ అలవాటునే ఆయన అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా సంప్రదాయంగా మార్చేశారు. నిత్యం సెలబ్రిటీలు చంద్రబాబును [more]

;

Update: 2021-07-18 02:00 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఎప్పుడూ ఒక అలవాటు ఉంది. ఆ అలవాటునే ఆయన అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా సంప్రదాయంగా మార్చేశారు. నిత్యం సెలబ్రిటీలు చంద్రబాబును కలుస్తుంటారు. పని ఉన్నా లేకపోయినా కొందరు ఎంపిక చేసిన సెలబ్రిటీలను చంద్రబాబు టీం తరచూ ఆయనను కలిసేలా చేస్తుంది. తద్వారా చంద్రబాబు తన ఇమేజ్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి కూడా అదే బాటలో పయనిస్తున్నట్లు కన్పిస్తుంది.

బాబు హయాంలోనూ అంతే…

చంద్రబాబు అధికారంలో ఉండగా రాజకీయ నేతల దగ్గర నుంచి స్పోర్ట్స్, సినిమా వంటి రంగాల్లో ప్రజాదరణ ఉన్న వ్యక్తులు తరచూ కలిసే వారు. ఆరోజుకు అది వార్త. ప్రజలు చర్చించుకోవడానికి మాత్రమే పనికి వస్తుంది. తర్వాత చంద్రబాబుతో సహా అందరూ మరిచి పోతారు. ఇప్పుడు జగన్ కూడా ఎవరో ఒకరు వచ్చి తనను కలిసేలా ఏర్పాట్లు బాగానే చేసుకున్నట్లుంది. అందులో భాగంగానే ఇటీవల క్రికెటర్ అనిల్ కుంబ్లే జగన్ ను కలవడం.

రెండేళ్లలో…..

జగన్ ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని చేపట్టి రెండేళ్లు దాటుతుంది. తొలినాళ్లలో పెద్దగా తన ఇమేజ్ ను పెంచుకునే ప్రయత్నం జగన్ చేయలేదు. కేవలం సంక్షేమ పథకాలపైనే దృష్టి పెట్టారు. అలా అయితే లాభం లేదనుకున్నారో ఏమో. జగన్ కూడా చంద్రబాబు తరహాలోనే ఇమేజ్ బిల్డప్ కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్లే కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్ లో స్పోర్ట్స్ యూనివర్సిటీ, క్రీడా సామాగ్రి తయారీ యూనిట్లపై జగన్ అనిల్ కుంబ్లేతో చర్చించినట్లు వార్తలు వచ్చాయి.

మన రాష్ట్రానికి చెందిన..

అయితే స్పోర్ట్స్ యూనివర్సిటీ మీద జగన్ చర్చించడానికి పొరుగు రాష్ట్రానికి చెందిన అనిల్ కుంబ్లే సలహాలు మాత్రమే కావాలా? ఏపీలో క్రీడాకారులు లేరా? మన రాష్ట్రానికి చెందిన వీవీఎస్ లక్ష్మణ్ తో చర్చించవచ్చు గదా? అన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో కనపడుతున్నాయి. ఇదంతా ఇమేజ్ బిల్డప్ కోసమేనని, రానున్న కాలంలో మరింత మంది సెలబ్రిటీలు జగన్ ను కలుస్తారన్న సెటైర్లు విన్పిస్తున్నాయి. ఎవరు వచ్చి కలిసినా రాష్ట్రానికి ఒరిగే ప్రయోజనం ఏమీ లేదన్న వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. మొత్తం మీద రానున్న మూడేళ్లు ఏపీలో సెలబ్రిటీల హడావిడి ఎక్కువగానే ఉంటుంది.

Tags:    

Similar News