వారందరికీ జగన్ మార్క్ ఝలక్… ?
ఈసారికి ఇలా అయిపోనీయండి వచ్చే ఎన్నికల్లో మా అబ్బాయికి చాన్స్ ఇవ్వండి అంటూ చాలా మంది సీనియర్లు వైసీపీలో ఇప్పటికే జగన్ కి అర్జీలు పెట్టుకుంటూ వస్తున్నారు. [more]
;
ఈసారికి ఇలా అయిపోనీయండి వచ్చే ఎన్నికల్లో మా అబ్బాయికి చాన్స్ ఇవ్వండి అంటూ చాలా మంది సీనియర్లు వైసీపీలో ఇప్పటికే జగన్ కి అర్జీలు పెట్టుకుంటూ వస్తున్నారు. [more]
ఈసారికి ఇలా అయిపోనీయండి వచ్చే ఎన్నికల్లో మా అబ్బాయికి చాన్స్ ఇవ్వండి అంటూ చాలా మంది సీనియర్లు వైసీపీలో ఇప్పటికే జగన్ కి అర్జీలు పెట్టుకుంటూ వస్తున్నారు. తమ సేవలు అక్కరలేదు అనుకుంటే ఆ ఇచ్చే పదవి ఏదో తమ ఇంట్లోకే మళ్ళీ ఇవ్వాలని వారు కొత్త బేరాలు పెడుతున్నారు. అయితే జగన్ ఆలోచనలు వేరు. ఆయనకు ఈ వారసత్వాల మీద ఆసలు నమ్మకం లేదు. పైగా ఆయన ఆలోచనలు ఎపుడూ కొత్త వారికీ, పార్టీ కోసం కష్టపడిన వారికీ అవకాశాలు ఇవ్వాలనే ఉంటాయి. దాంతో ఇపుడు సీనియర్లకు ఒక్కసారిగా గుండె దడ మొదలైందిట.
ఆ కల్చర్ కట్…..
ఎంతసేపూ మేమూ మా కుటుంబం అంటూ పదవులు పంచుకునే కల్చర్ కి జగన్ పూర్తిగా చెక్ పెట్టబోతున్నారు. సీనియర్లు అయితే వారికి ఇక రిటైర్మెంటే తప్ప వారసులకు ఉద్యోగాలు ఇవ్వడం కుదరదు అని కచ్చితంగా చెప్పేస్తున్నారు. దాంతో సీనియర్ల కుమారుల రాజకీయ భవిష్యత్తు ఇపుడు డోలాయమానంలో పడిపోయింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రా జిల్లాలు తీసుకుంటే చాలా మంది సీనియర్లు తమ కుమారులకు రాజకీయ బాధ్యతలు అప్పగించి రెస్ట్ తీసుకుందామని అనుకుంటున్నారు. శ్రీకాకుళం నుంచి మొదలుపెడితే విశాఖ దాకా వారే పెద్ద సంఖ్యలో ఉన్నారు. మరి వారంతా జగన్ మార్క్ డెసిషన్ విని ఖంగు తింటున్నారుట.
ఇంతే సంగతులు….
శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణదాస్ ఆ మధ్యన బోల్డ్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చెశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయను అని ఆయన తానుగా చెప్పేసుకున్నారు. ఆయన కుమారుడు డాక్టర్ క్రిష్ణ చైతన్యను నరసన్నపేట నుంచి బరిలోకి దింపాలని చూస్తున్నారు. దానికి రిహాల్సల్స్ గా జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయించారు కూడా. ఇక స్పీకర్ తమ్మినేని సీతారామ్ కుమారుడు తమ్మినేని చిరంజీవి నాగ్ కూడా వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారు. ఆయనకూ ఇపుడు గట్టి షాక్ తగలబోతోంది. ఇక మాజీ మంత్రి ధర్మనా ప్రసాదరావు కుమారుడు రామ మనోహర్ నాయుడు కూడా శ్రీకాకుళం నుంచి ఎమ్మెల్యేగా పోటీకి తయారు అవుతున్నారు. జగన్ కనుక ఇదే నిర్ణయం అమలు చేస్తే జూనియర్లు అంతా నీరు కారాల్సిందే మరి.
చూసుకోనక్కరలేదా…?
ఇక విజయనగరం జిల్లాలో చూసుకుంటే మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు డాక్టర్ సందీప్ కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారు. ఇదే జిల్లాలో కోలగట్ల వీరభద్రస్వామి కుమార్తె శ్రావణి కూడా పోటీకి రెడీ అంటున్నారు. విశాఖలో చూసుకుంటే గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు వంశీరెడ్డి పోటీకి రెడీ అంటున్నారు. ఎలమంచిలి నుంచి కన్నబాబు రాజు కుమారుడు సుకుమార్ వర్మ కూడా టికెట్ ఆశిస్తున్నారు. మరి ఇంతమంది వారసులు తయారుగా ఉన్నా కూడా జగన్ వద్దు అంటే చాలు ఒక్కసారిగా సైలెంట్ అవాల్సిందే. మరి జగన్ అలాంటి నిర్ణయం తీసుకుంటే వీరంతా సహకరిస్తారా లేక వ్యతిరేకించి పక్క పార్టీలలోకి ఫిరాయిస్తారా అన్నది వేచి చూడాల్సిందే.